• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం

    ఛత్తీస్‌గఢ్‌, మిజోరం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ మొదలైంది. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో మొత్తం 90 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఛత్తీస్‌గఢ్‌లో తొలి విడతలో 20 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్‌ జరుగుతోంది. మిగతా 70 స్థానాలకు ఈ నెల 17 పోలింగ్‌ జరగనుంది. ఈ రోజు ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభమైంది. ఎన్నికల నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. సమస్యాత్మక ప్రాంతాల్లో మధ్యాహ్నం 3కు పోలింగ్‌ ముగియనుంది.

    ఎయిరిండియాకు ఖలిస్థానీ బెదిరింపులు

    భారత్‌-కెనడా కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎయిరిండియా ప్రయాణికులను హెచ్చరిస్తూ ఖలిస్థానీ ఉగ్రవాదులు చేసిన హెచ్చరికలు తీవ్ర దుమారాన్ని రేపాయి. దీనిపై స్పందిస్తూ ఈ విషయాన్ని కెనడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. ఎయిరిండియా విమానాలకు భద్రత పెంచాలని కోరింది. నవంబరు 19న ఎయిరిండియా విమానంలో ప్రయాణించే వారికి ప్రమాదం పొంచి ఉందని ఉగ్రవాదులు హెచ్చరించారు.

    ఆ రాష్ట్రల్లో రేపు తొలి విడత పోలింగ్

    ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ప్రచారం జోరుగా సాగుతోంది. రేపు మిజోరం, ఛత్తీస్‌గఢ్‌లో తొలి విడతలో పోలింగ్‌ జరుగనుంది. మిజోరంలో 40 స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ జరుగనుంది. ఛత్తీస్‌గఢ్‌లో తొలి విడతలో 20 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్‌ జరుగనుంది. రెండో విడుతలో 70 స్థానాలకు ఈ నెల 17న పోలింగ్‌ జరుగనుంది. దీంతో ఎన్నికల ప్రచారానికి నిన్న సాయంత్రంతో తెరపడింది. పోలింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

    లాభాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

    దేశీయ స్టాక్‌ మార్కెట్‌లు నేటి ఉదయం లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 395 పాయింట్ల లాభంతో 64,759 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ 121 పాయింట్ల లాభంతో 19,352 దగ్గర కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాలతో దేశీయ మార్కెట్లు లాభాల్లో ట్రెడవుతున్నాయి. యాక్సిస్‌ బ్యాంక్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఎంఅండ్‌ఎం, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఎల్‌అండ్‌టీ, ఐసీఐసీఐ బ్యాంక్‌, నెస్లే ఇండియా, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఎన్‌టీపీసీ, పవర్‌గ్రిడ్‌ లాభాల్లో ఉన్నాయి.

    రైల్వే ట్రాక్‌పై పడిన బస్సు.. నలుగురి మృతి

    రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ బస్సు అదుపుతప్పి వంతెన పైనుంచి రైల్వే ట్రాక్‌పై పడింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో దాదాపు 30 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. గాయపడిన 28 మందిని ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ నలుగురు మృతి చెందినట్లు వెల్లడించారు.

    ప్రముఖ ఫుడ్ వ్లాగర్ ఆత్మహత్య

    కేరళకు చెందిన ప్రముఖ ఫుడ్ వ్లాగర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 33 ఏళ్ల రాహుల్ N. కుట్టి కొచ్చిలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. రాహుల్ ‘ఈట్ కొచ్చి ఈట్’ పేరుతో కొచ్చిలోని ప్రముఖ ఫుడ్‌ని పరిచయం చేస్తుంటాడు. 2015 నుంచి రాహుల్ ఫుడ్ బ్లాగింగ్‌లో భాగంగా వీడియోలు రూపొందిస్తున్నారు. ‘ఈట్ కొచ్చి ఈట్’ పేరుతో కొచ్చిలోని అండర్ రేటెడ్‌గా ఉన్న ఫుడ్ జాయింట్లను వెలుగులోకి తీసుకువచ్చారు. ఆ పేజీకి 4.21 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. కాగా, రాహుల్‌కు భార్య, రెండేళ్ల … Read more

    కాంగ్రెస్‌పై మోదీ తీవ్ర విమర్శలు

    ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోది కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. అవినీతి సొమ్ముతో కాంగ్రెస్ ఖజానాను నింపుకోంటుందని ఆరోపించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ‘మహాదేవ్’ పేరును కూడా వదిలిపెట్టలేదని విమర్శించారు. మహాదేవ్ బెట్టింగ్ నుంచి భారీగా డబ్బులు తీసుకుంటుందని ఆరోపించారు. కొన్ని రాజకీయ పార్టీలు కొత్త కుట్రలు పన్నుతున్నాయని మండిపడ్డారు. కులతత్వ విషాన్ని వ్యాపింపజేస్తున్నాయని మోదీ ఆరోపించారు.

    ముకేశ్‌ అంబానీకి మళ్లీ బెదిరింపు మెయిల్స్‌

    రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీకి మళ్లీ బెదిరింపు మెయిల్స్‌ వచ్చాయి. అడిగినంత డబ్బు ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని నిందితుడు పేర్కొన్నాడు. అక్టోబర్‌ 31, నవంబర్‌ 1న ఈ రెండు మెయిల్స్‌ వచ్చినట్లు అధికారులు తెలిపారు. రూ.20 కోట్లు ఇవ్వాలని, లేకపోతే ముకేశ్‌ అంబానీని చంపేస్తామని మెయిల్‌లో నిందితుడు పేర్కొన్నాడు. ముకేశ్ మెయిల్స్‌కు స్పందించకపోవడంతో దుండగుడు అంతకంతకు పెంచుకుంటూ పోతున్నాడని పోలీసులు తెలిపారు. © ANI Photo © ANI Photo © ANI Photo

    ఉల్లి ధరలపై కేంద్రం కీలక నిర్ణయం

    దేశంలో ప్రస్తుతం ఉల్లి ధరల మోత మోగుతోంది. కొద్ది రోజుల క్రితం ఉల్లి రూ.30-రూ.40 వరకు ఉండగా.. ప్రస్తుతం రూ. 80 నుంచి రూ.100 వరకు విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో ఉల్లి ధరల పెరుగుదలను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఈ నేపథ్యంలో బఫర్ స్టాక్ నుంచి రిటైల్ మార్కెట్లలోకి లక్ష టన్నుల ఉల్లిని విడుదల చేయనున్నట్లు కేంద్రం తెలిపింది. ఉల్లిని సబ్సిడీ కింద కేంద్ర ప్రభుత్వం రూ.25 కే విక్రయిస్తోంది. రానున్న రోజుల్లో ఉల్లి ధరలు మరింత తగ్గనున్నాయని.. దీంతో సామాన్యుడికి … Read more

    ‘ఒలింపిక్స్‌ క్రీడల నిర్వహణకు భారత్‌ సిద్ధం’

    2036లో ఒలింపిక్స్‌ క్రీడల నిర్వహణకు భారత్‌ సిద్ధంగా ఉంది ప్రధాని మోదీ తెలిపారు. దేశంలో క్రీడా నైపుణ్యాలకు కొదవ లేదన్నారు, దేశం అనేక మంది ఛాంపియన్లను సృష్టించిందని చెప్పారు. నేడు గోవాలో జరిగిన 37వ జాతీయ క్రీడల మోదీ ప్రారంభించారు. ఈ ఏడాది క్రీడలకు కేటాయించిన బడ్జెట్‌.. తొమ్మిదేళ్ల క్రితంనాటి బడ్జెట్‌తో పోలిస్తే మూడు రెట్లు ఎక్కువని చెప్పారు. ఒలింపిక్స్‌కు ఆతిథ్యమిచ్చేందుకు భారత్‌ గొప్ప ఆసక్తి కనబరుస్తోందని మోదీ పేర్కొన్నారు.