• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • టాటా ట్రస్ట్స్ తొలి సీఓఓగా అపర్ణ ఉప్పలూరి

  టాటా ట్రస్ట్స్ తొలి సీఓఓ(చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌)గా అపర్ణ ఉప్పలూరిని నియమిస్తున్నట్లు టాటా ట్రస్ట్స్ ప్రకటించింది. అలాగే సీఈఓగా సిద్ధార్ధ్ శర్మను నియమించింది. ఈ నియామకాలు వచ్చే ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వస్తాయి. కాగా అపర్ణ ప్రస్తుతం ఫోర్డ్ ఫౌండేషన్‌లో ఇండియా, నేపాల్, శ్రీలంకల ప్రోగ్రామ్ డైరెక్టర్‌గా ఉన్నారు. ఆమె మహిళల హక్కులు, ప్రజారోగ్యం, కళలు, సాంస్కృతిక రంగాల అభివృద్ధికి కృషి చేసి పేరుపొందారు. కాగా టాటా ట్రస్ట్స్ పురాతన స్వచ్ఛంద సంస్థల్లో ఇది కూడా ఒకటి.

  జిందాల్‌కు బెదిరింపులు; రూ.50 కోట్లు డిమాండ్

  ప్రముఖ పారిశ్రామికవేత్త, మాజీ ఎంపీ నవీన్ జిందాల్‌కు బెదిరింపులు రావడం సంచలనంగా మారింది. తనకు 48 గంటల్లోగా రూ.50 కోట్లు ఇవ్వాలని.. లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఓ ఖైదీ బెదిరింపు లేఖ పంపాడు. ఈ లేఖను చత్తీస్‌గఢ్‌లో ఉన్న బిలాస్‌పూర్‌లోని సెంట్రల్ జైలు ఖైదీ పుష్పేంద్ర చౌహాన్ పంపినట్లు తెలుస్తోంది. సదరు ఖైదీపై పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. నాలుగేళ్లుగా నిందితుడు జైల్లోనే ఉంటున్నాడు. కాగా నిందితుడి మానసిక స్థితి సరిగా లేదని తెలుస్తోంది.

  చనిపోతానేమో అనుకున్నా: ఎలన్ మస్క్

  ట్విటర్ అధినేత ఎలన్ మస్క్ చేసిన ఓ ట్వీట్ వైరల్ అవుతోంది. కోవిడ్ రెండో డోసు వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు చనిపోతానేమో అన్న భావన కలిగిందని మస్క్ ట్వీట్ చేశాడు. కోవిడ్ టీకా వల్ల దుష్ప్రభావాలు ఎదురవుతున్నాయని వార్తలు వెలువడుతున్న క్రమంలో మస్క్ ఈ ట్వీట్ చేశాడు. ‘రెండో డోసు తీసుకున్నాక చనిపోతానేమో అనుకున్నా. అంత బాధ కలిగింది. మొదటి డోసు తీసుకున్నప్పుడు కన్నా రెండో డోసుకు చాలా ఇబ్బంది పడ్డా. జర్మనీలో టెస్లా గిగాఫ్యాక్టరీని చూడ్డానికి ఈ టీకా వేసుకోవాల్సి వచ్చింది’ అంటూ మస్క్ … Read more

  ప్రపంచ అపర కుబేరుడు రిటైర్‌మెంట్!

  ప్రపంచ అపర కుబేరుడుగా ఉన్న ట్విటర్ సీఈఓ ఎలన్ మస్క్ రికార్డు స్థాయి నష్టాలు ఎదుర్కొని రెండో స్థానానికి పడిపోయాడు. ప్రస్తుతం ఈ స్థానాన్ని ఫ్రాన్స్ వ్యాపార దిగ్గజం బెర్నార్డ్ ఆర్నాల్ట్ ఆక్రమించాడు. కానీ బెర్నార్డ్ రిటైర్‌మెంట్ ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయనకు ఇద్దరు భార్యల ద్వారా 5 మంది సంతానం ఉన్నారు. వారికి ఒక్కొక్కరికి బాధ్యతలు అప్పజెప్పుకుంటూ వస్తున్నారు.ఆయన పెద్ద కూతురు డెల్‌ఫైన్‌కు తన లగ్జరీ వస్తువుల కంపెనీ ‘ఎల్వీఎంహెచ్’ బాధ్యతలు అప్పగిస్తారని తెలుస్తోంది.

  ఆ ఒక్కటీ ఇప్పటికీ బాధిస్తోంది? గౌతమ్ అదానీ

  తన కాలేజీ చదువును పూర్తి చేయలేకపోయినందుకు ఇప్పటికీ పశ్చాత్తాప పడుతుంటానని ఆసియా కుబేరుడు గౌతమ్ అదానీ అన్నారు. తన 16 ఏళ్ల వయసులో 1978లో అహ్మదాబాద్ నుంచి ముంబై ట్రైన్ ఎక్కేశానని చెప్పారు. తన తొలి సంపాదన మూడేళ్ల తర్వాత గానీ దక్కలేదని పేర్కొన్నాడు. ఒక జపాన్ వ్యాపారికి డైమండ్ అమ్మిపెట్టగా రూ.10 వేల కమీషన్ వచ్చిందని తెలిపాడు. ఇక అప్పటినుంచి వెనుదిరిగి చూసుకోలే దని చెప్పాడు. అదానీకి సోలార్, సిమెంట్, ఎయిర్‌పోర్ట్స్ వంటి వ్యాపారాలు ఉన్నాయి.

  నెటిజన్ వ్యంగ్య ట్వీట్; మస్క్ రిప్లై

  ట్విటర్‌ని టేక్ ఓవర్ చేసిన తర్వాత ఎలన్ మస్క్ వినూత్న నిర్ణయాలు తీసుకున్నారు. ఫలితంగా గతేడాది 200 బిలియన్ డాలర్ల సంపదను కోల్పోయాడు. ఈ క్రమంలో ఓ నెటిజన్ చేసిన వ్యంగ్య ట్వీట్‌కి ఎలన్ మస్క్ అదే స్థాయిలో బదులిచ్చారు. ‘గతేడాది మీరెంతో కష్టపడ్డారు. అలా చెమటోడ్చి 200 బిలియన్ డాలర్ల సంపదను కోల్పోయారు. ఈ ఏడాది మరిన్ని చెత్త నిర్ణయాలతో మీ రికార్డును మీరే తిరగరాయాలని ఆశిస్తున్నా’ అని ఓ నెటిజన్ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. ‘బ్లూ టిక్ సబ్‌స్క్రిప్షన్ తీసుకుని.. 8 … Read more

  రాధికతో అనంత్ అంబానీ నిశ్చితార్థం

  ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ నిశ్చితార్థం జరిగింది. ప్రేయసి రాధిక మర్చెంట్‌ని అనంత్ పెళ్లి చేసుకోబోతున్నారు. రాజస్థాన్‌లోని నాథ్వారాలోని శ్రీనాథ్ జీ ఆలయంలో ఈ జంట నిఖా పక్కా అయింది. ఈ మేరకు ఆలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజలో అనంత్ పాల్గొన్నారు. అనంత్ ప్రస్తుతం రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎనర్జీ డివిజన్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఎన్‌కోర్ హెల్త్‌కేర్ కంపెనీలో రాధిక బోర్డ్ ఆఫ్ డైరక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. వీరిద్దరి నిశ్చితార్థాన్ని ధ్రువీకరిస్తూ రిలయన్స్ ఇండస్ట్రీస్ కార్పొరేట్ అఫైర్స్ బోర్డ్ డైరెక్టర్ నాథ్వానీ ఓ … Read more

  ‘రాజీవ్ హయాంలోనే ‘అదానీ’ వృద్ధి’

  మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హయాంలోనే తమ సంస్థ వృద్ధి సాధించిందని అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ తెలిపారు. ఏ ఒక్క రాజకీయ నాయకుడి వల్లో తను అభివృద్ధి చెందలేదని స్పష్టం చేశారు. పీఎం నరేంద్ర మోదీ వల్ల అదానీ గ్రూప్ లాభపడుతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొన్నారు. మోదీదీ, తనదీ ఒకే రాష్ట్రం కావడంతో నిరాధార ఆరోపణలు వస్తున్నాయని చెప్పారు. 30 ఏళ్లుగా పలువురు నేతలు, ప్రభుత్వాల సహకారంతోనే తను ఈ స్థాయికి చేరుకున్నట్లు తెలిపారు.

  వీడియోకాన్ ఛైర్మన్ ధూత్ అరెస్ట్

  వీడియోకాన్ ఛైర్మన్ వేణుగోపాల్ ధూత్ అరెస్టయ్యారు. ఐసీఐసీఐ లోన్ కేసులో అవతకవకలకు పాల్పడినందుకు అవినీతి నిరోధక చట్టం కింద సీబీఐ వేణుగోపాల్‌ని అరెస్ట్ చేసింది. అప్పటి ఐసీఐసీఐ మాజీ సీఎండీ చందా కొచ్చర్, భర్త దీపక్ కొచ్చర్‌లను అరెస్టు చేసిన కొన్ని రోజులకు ధూత్‌ని అరెస్టు చేయడం గమనార్హం. ధూత్‌కి చెందిన వీడియో‌కాన్ గ్రూప్‌నకు అక్రమంగా రూ.3000 కోట్ల రుణాన్ని మంజూరు చేయడంలో అప్పటి ఐసీఐసీఐ సీఈవో చందా కొచ్చర్ క్విడ్ ప్రో కోకి పాల్పడ్డారు. చందా కొచ్చర్ భర్త దీపక్ కొచ్చర్ ద్వారా … Read more

  వచ్చే ఏడాది లాభాల్లోకి ట్విటర్: మస్క్

  వచ్చే ఏడాది వరకల్లా ట్విటర్ లాభాల బాట పడుతుందని ఆ సంస్థ అధినేత ఎలన్ మస్క్ ఆశాభావం వ్యక్తం చేశారు. నష్టాల నుంచి గట్టెక్కించేందుకు ఓ 5 వారాలు అవిశ్రాంతంగా పనిచేశానని ఆయన చెప్పుకొచ్చారు. ‘అప్పుడు ట్విటర్ నేలకొరుగుతున్న విమానంలో ఉండేది. సబ్‌స్క్రిప్షన్ వ్యవస్థ తీసుకురావడం మంచిదైంది. దాని ద్వారానే ఇప్పుడు బిల్లుల్ని చెల్లిస్తున్నాం. ఇతర వ్యయాలను తగ్గించడంపై తీవ్రంగా శ్రమించాం. కేవలం హార్డ్‌వేర్‌పైనే 1.5బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తున్నాం’ అని మస్క్ తెలిపారు. ట్విటర్‌లో నిర్వహించిన పోల్‌ని గౌరవిస్తూ సీఈవో పదవి నుంచి … Read more