తన ముద్దుల కూతురు ఇషా అంబానీ కుమారుడు కృష్ణ, కూతురు ఆదియాలకు ముఖేష్ అంబానీ కాస్ట్‌లీ గిఫ్ట్ బహూకరించారు. వీరికోసం ఆల్ట్రా లగ్జరీ క్లోసెట్(కప్‌బోర్డు) ప్రత్యేకంగా తయారు చేయించి కానుకగా ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. ఎల్లో కలర్ గదిలో ఎయిర్ బెలూన్‌లతో మేఘాల వాల్‌పేపర్‌తో ఈ క్లోసెట్ ఆకట్టుకుంటోంది. రంగురంగుల పూలతో ఆకర్షణీయంగా ఉంది. ఈ ఆల్ట్రా లగ్జరీ క్లోసెట్ విలువ రూ.లక్షల్లో ఉంటుందని నెటిజన్లు భావిస్తున్నారు.
ముఖేశ్ అంబానీ తన పిల్లలకు ఖరీదైన బహుమానాలు ఇవ్వటం కొత్త కాదు. కోట్ల విలువ చేసే గిప్ట్స్‌ను ఇస్తూ వస్తున్నారు. తన చిన్న కుమారుడు అనంత్ అంబానీకి 80 మిలియన్ డాలర్లు ఖర్చు చేసి దుబాయ్‌లో విల్లా కొనిచ్చాడు. ఇందులో సౌకర్యాలు చూస్తే ఒకింత ఆశ్చర్య పోవాల్సిందే. బీచ్ వైపున ఉండే ఈ మాన్షన్‌లో 10 బెడ్‌రూమ్‌లు ఉన్నాయి. ఓ ప్రైవేట్ స్పా, ఇండోర్ ఔట్‌డౌర్ పూల్స్ వంటి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీ కోసం యూకేలో ఓ మాన్షన్‌ను కొన్నారు. దీనికి ఏకంగా రూ.79 మిలియన్ డాలర్లను ఖర్చు చేశారు. ప్రస్తుతం ఆకాశ్ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్‌కు ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇలా కుమారుడు, కుమార్తె కోసం విలువైన బహుమానాలు ఇస్తూ ప్రేమను చాటుతున్నాడు ముఖేశ్ అంబానీ.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!