• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ఏడ్చేసిన బాబర్ అజామ్

  మ్యాచ్ చివరి వరకూ పోరాడినా ఓటమి పాలవ్వడంతో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజామ్ ఏడ్చేశాడు. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో పాక్ చివరి బంతికి ఓడిపోవడం బాబర్ జీర్ణించుకోలేకపోయాడు. ఆఖరి వరకూ పోరాడినా ఫలితం దక్కకపోవడంతో తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. కాగా నిన్న పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక చివరి బంతికి 2 పరుగులు చేయాల్సి రావడంతో రెండు రన్స్ కొట్టి ఫైనల్‌కు చేరింది. https://x.com/shubham84777556/status/1702498485457522932?s=20

  రెప్పపాటులో రూ.5 లక్షలు చోరీ

  ఇద్దరు దొంగలు రెప్పపాటులో రూ.5 లక్షలు దొంగతనం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. నల్గొండ జిల్లా దామరచర్లకు చెందిన రియల్టర్ అజ్మీరా మాలు తన కారులో రూ.5 లక్షలు ఉంచాడు. మిర్యాలగూడలోని ఓ రెస్టారెంట్ వద్ద కారును ఆపి భోజనానికి వెళ్లాడు. ఇంతలో వారిని అనుసరిస్తూ వస్తోన్న ఇద్దరు దొంగలు కారు అద్దాలు పగులగొట్టి రూ.5 లక్షల క్యాష్ బ్యాగ్‌తో పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. https://x.com/TeluguScribe/status/1702175983523254665?s=20

  HYD: WWE ఫైటింగ్ షురూ

  హైదరాబాద్‌లో WWE సందడి మొదలైంది. గచ్చిబౌలిలోని ఇండోర్ స్టేడియలో ‘సూపర్‌స్టార్ స్పెక్టాకిల్’ పేరిట ఈవెంట్ నిర్వహించారు. డబ్ల్యూడబ్ల్యూఈ ఫైటర్లను దగ్గర నుంచి చూసి ప్రేక్షకులు మైమరిచిపోయారు. తొలుత ఆస్కార్ విన్నింగ్ సాంగ్ ‘నాటు నాటు’ పాటకు రెజ్లర్లు డ్యాన్స్ వేయడంతో స్టేడియం మారుమోగిపోయింది. అనంతరం WWE స్టార్ జాన్ సీనా ప్రేక్షకుల కోసం మాట్లాడారు. ‘‘20 ఏళ్లుగా ఇలాంటి అనుభవం కోసమే ఎదురుచూస్తున్నా. భారత అభిమానులకు ధన్యవాధాలు.’’ అంటూ ఎమోషనల్ అయ్యారు. Cenation For Life ?Luve you @JohnCena ❤️#WWESuperstarSpectacle #WWEHyderabad pic.twitter.com/Ie8How2qbg … Read more

  మరో బాలుడిపై వీధికుక్క దాడి

  హైదరాబాద్‌లో మరోసారి వీధికుక్కలు రెచ్చిపోయాయి. ఓ బాలుడిపై దాడి చేసి చెవి కొరికాయి. టపాచబుత్రకు చెందిన ఓ మహళ తన కుమారుడితో కలసి వీధిలో నడచి వెళ్తోంది. ఈ క్రమంలో వెనుక నడిచి వస్తున్న పిల్లాడిపై ఓ వీధికుక్క అకస్మాత్తుగా దాడి చేసింది. ఆ చిన్నారి చెవిని కొరికివేసింది. వెంటనే అప్రమత్తమైన బాలుడి తల్లి కుక్కను తరిమివేసింది. వెంటనే బాలుడిని ఆస్పత్రిలో చేర్పించారు. ఆ బాలుడి సర్జరీకి రూ.3 లక్షలు ఖర్చు అయినట్లు సమాచారం. Stray dog menace haunts Hyderabad once again. … Read more

  ‘బాహుబలి’ తర్వాత అందుకే నటించలేదు: అనుష్క

  ‘బాహుబలి’ సినిమా తర్వాత విశ్రాంతి అవసరం అనిపించిందని.. అందుకే సినిమాల్లో నటించలేదని హీరోయిన్ అనుష్క శెట్టి తెలిపింది. తాను నటించిన మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి ప్రమోషన్లలో స్వీటీ మాట్లాడింది. ‘‘బాహుబలి తర్వాత కొంతకాలం సినిమాలకు గ్యాప్ ఇవ్వాలనుకున్నా. అందుకే ఎలాంటి కథలు వినలేదు. భవిష్యత్‌లో మరిన్ని సినిమాలు చేయాలంటే విశ్రాంతి అవసరమనుకున్నా. ప్రస్తుతం నటించేందుకు సిద్ధంగా ఉన్నా.’’ అంటూ చెప్పుకొచ్చింది.

  YCP ఎమ్మెల్యే కూతురు ప్రేమవివాహం

  ప్రొద్దుటూరు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కూతురు పల్లవి ప్రేమవివాహం చేసుకుంది. ఓ ఆలయంలో ఎమ్మెల్యే తన కూతురికి వివాహం జరిపించారు. ప్రొద్దుటూరుకు చెందిన ఆర్టీసీ మెకానిక్ కుమారుడు పవన్‌ను పల్లవి చదువుకునే రోజుల నుంచే ప్రేమిస్తోంది. ఈ క్రమంలో పల్లవి కులాంతర వివాహానికి తన తండ్రిని ఒప్పించింది. రిజిస్ట్రార్ ఆఫీస్‌లో నిరాడంబరంగా పెళ్లి చేసుకుంది. కూతురు ప్రేమకు విలువనిచ్చిన ఎమ్మెల్యే శివప్రసాద్‌రెడ్డిని ప్రజలు అభినందిస్తున్నారు. Orey rachamallu… “Shatruvulu ekkado undaru ra mana kompallone … untaaru” ani Rao … Read more

  ‘బేబీ’ హీరోయిన్‌కు బంపరాఫర్

  ‘బేబీ’ హీరోయిన్ వైష్ణవి చైతన్యకు బంపరాఫర్ వచ్చినట్లు సమాచారం. హీరో సిద్ధూ జొన్నలగడ్డ సరసన నటించే ఛాన్స్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ఎస్‌వీసీసీ సంస్థ నిర్మిస్తున్నట్లు టాక్. మరో వైపు ‘రౌడీబాయ్స్’ ఫేమ్ ఆశిశ్ రెడ్డి సరసన ఓ మూవీలో నటిస్తున్నట్లు ఫిలింనగర్ సమాచారం. ఈ చిత్రాన్ని అరుణ్ భీమవరపు తెరకెక్కిస్తున్నారు. దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ రెండు సినిమాలు క్లిక్ అవుతే వైష్ణవి స్టార్ హీరోయిన్‌గా ఎదిగే ఛాన్స్ ఉందని ఫ్యాన్స్ అంటున్నారు.

  ‘భగవంత్ కేసరి’ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్

  నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ‘భగవంత్ కేసరి’ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ విడుదలైంది. ‘గణేష్ ఆంతం’ పేరుతో ఓ సాంగ్‌ను మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు. ఎస్ఎస్ థమన్ మ్యూజిక్ అందించారు. కాగా ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, శ్రీలీలలు నటించారు. ఈ చిత్రాన్ని అనిల్ రావిపూడి తెరకెక్కించారు. సాహూ గారపాటి, హరీష్ పెద్ది నిర్మాతలుగా వ్యవహరించారు. దసరా కానుకగా అక్టోబర్ 19న ఈ మూవీ విడుదల కానుంది.

  మందు కొడుతున్న ధోనీ: వీడియో వైరల్

  భారత క్రికెట్ దిగ్గజం మహేంద్రసింగ్ ధోనికి సంబంధించిన ఓ పాత వీడియో ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోలో ధోని తన స్నేహితులతో కలసి మద్యం తాగుతుండడం విశేషం. ధోని కెరీర్ ఆరంభంలో ఈ వీడియో తీసినట్లుగా కనిపిస్తోంది. ఈ వీడియోలో మద్యం తాగుతూ.. ఫోన్ మాట్లాడుతూ ధోని కనిపించాడు. తన స్నేహితులు కూడా వైన్ సేవిస్తున్నారు. ఓ చిన్న గదిలో కింద కూర్చుని సాదాసీదాగా మహీ ఉన్నాడు. ఇది ఎక్కడ జరిగిందనేది క్లారిటీ లేదు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. … Read more

  పెళ్లి చేసుకోవాలనుంది: నగ్మా

  తనకు పెళ్లి చేసుకోవాలని ఉందని సీనియర్ హీరోయిన్ నగ్మా తెలిపింది. ‘‘కాలం కలిసి వస్తే త్వరలోనే నా పెళ్లి జరుగుతుందేమో. పెళ్లి ద్వారా ఓ కుటుంబాన్ని కోరుకుంటున్నా. నాకూ ఓ తోడు ఉండాలని.. పిల్లలు కావాలని అనిపిస్తుంది. నిజంగానే నాకు వివాహమైతే సంతోషంగా ఫీల్ అవుతా.’’ అంటూ 48 ఏళ్ల నగ్మా చెప్పుకొచ్చింది. కాగా గతంలో సౌరవ్ గంగూలీ, శరత్ కుమార్, మనోజ్ తివారీ, రవికిషన్‌లతో నగ్మా ప్రేమాయణం కొనసాగించిందని టాక్.