వివాహబంధంలోకి పాక్ క్రికెటర్
పాకిస్తాన్ యువ పేసర్ షాహీన్ షా అఫ్రిదీ ఓ ఇంటివాడయ్యాడు. కరాచీలో కుటుంబసభ్యులు, బంధువులు, సన్నిహితుల మధ్య మాజీ ఆల్రౌండర్ షాహిద్ అఫ్రిదీ కుమార్తె అన్నాను పెళ్లి చేసుకున్నాడు. పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యాడు. షాహీన్ షాకు పీఎస్ఎల్ లీగ్ జట్టు సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు. అతడికి అత్యంత సన్నిహితులైన హరీస్ రౌఫ్, నమిబియా ఆల్రౌండర్ డేవిడ్ వీస్ ట్విటర్ ద్వారా విషెస్ చెప్పారు. వీరిద్దరి ఎంగేజ్మెంట్ రెండేళ్ల క్రితమే అయ్యింది.