భారత్‌లో మంచి క్రేజ్ ఉన్న క్రీడ అనగానే ఠక్కున గుర్తుకు వచ్చేది క్రికెట్ (Cricket). కులం, మతం, భాష, ప్రాంతంతో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రజలు క్రికెట్‌ను ఆదరిస్తున్నారు. అంతేకాకుండా క్రికెటర్లను సెలబ్రిటీలుగా ట్రీట్ చేస్తూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ముఖ్యంగా టీమిండియా తరపున ఆడే క్రికెటర్లపై క్రీడాభిమానులు ఎంతో ప్రేమానురాగాలు కురిపిస్తారు. సచిన్, ఎం.ఎస్ ధోని, రోహిత్, విరాట్ కోహ్లీలకు దేశ విదేశాల్లోనూ ఫ్యాన్స్ ఉన్నారు. అంతటి ప్రాధాన్యత కలిగిన క్రికెట్‌కు తెలుగు రాష్ట్రాల నుంచి ప్రాతినిథ్యం వహించే వారి సంఖ్య క్రమంగా పెరిగిపోతోంది. ఒక్కప్పుడు తెలుగు క్రికెటర్(Telugu IPL Players) అంటే వీవీఎస్ లక్ష్మణ్ మాత్రమే గుర్తుకు వచ్చేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కొందరు యువకులు తమ టాలెంట్‌తో టీమిండియాలో స్థానం దిశగా దూసుకెళ్తున్నారు. మరికొందరు ఇప్పటికే భారత్ తరపున ఆడి/ ఆడుతూ పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చి క్రికెట్‌లో తమదైన ముద్ర వేసిన క్రీడాకారులపై YouSay ఎక్స్‌క్లూజివ్ కథనం.
Contents
- 1 నితీష్ కుమార్ రెడ్డి (Nitish Kumar Reddy)
- 2 Nitish Kumar Reddy Career Stats
- 3 2. తిలక్ వర్మ (Tilak Varma)
- 4 Tilak Varma Career Stats
- 5 మహమ్మద్ సిరాజ్ (Mohammed Siraj)
- 6 Mohammed Siraj Career Stats
- 7 షేక్ రషీద్ (Shaik Rasheed)
- 8 Shaik Rasheed Career Stats
- 9 కే.ఎస్. భరత్ (K.S Bharat)
- 10 KS Bharat Career Stats
- 11 అంబటి రాయుడు (Ambati Rayudu)
- 12 Ambati Rayudu Career Stats
- 13 ఎలకా వేణుగోపాలరావు (Venugopal Rao)
- 14 Venugopal Rao Career Stats
- 15 వీవీఎస్ లక్ష్మణ్ (VVS Laxman)
- 16 VVS Laxman Career Stats
నితీష్ కుమార్ రెడ్డి (Nitish Kumar Reddy)
2024 ఐపీఎల్ సీజన్ ద్వారా ఒక్కసారిగా (Telugu IPL Cricketers) వెలుగులోకి వచ్చిన తెలుగు క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి. సన్‌రైజర్స్ హైదరబాద్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న నితీష్.. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో అదరగొడుతున్నాడు. కీలక సమయాల్లో రాణిస్తూ నమ్మకమైన ఆల్‌రౌండర్‌గా ఎదుగుతున్నాడు.
నేపథ్యం
ఏపీలోని వైజాగ్‌లో 26 మే, 2003న నితీశ్ కుమార్ రెడ్డి (Nitish Kumar Reddy Early Life) జన్మించాడు. అతడిది దిగువ మధ్య తరగతి కుటుంబం. తండ్రి ముత్యాల రెడ్డి హిందూస్తాన్ జింక్‌లో గతంలో ఉద్యోగం చేశారు. కాగా, నితీష్ రెడ్డి ఐదేళ్ల వయసులోనే క్రికెట్ ఆడటం మొదలుపెట్టాడు. హిందూస్తాన్ జింక్ కంపెనీ గ్రౌండ్‌లో క్రికెట్ మ్యాచ్‌లు చూస్తూ పెరిగిన అతను ప్లాస్టిక్ బాల్‌తో తన ఆటను ప్రారంభించాడు. తండ్రి ప్రోత్సాహంతో క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకున్నాడు. కెరీర్ ఆరంభంలో విశాఖ మైదానంలో ఏర్పాటు చేసిన క్యాంప్‌లకు హాజరైన నితీష్ కుమార్ రెడ్డి.. మాజీ చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ సాయంతో కడపలోని ఏసీఏ అకాడమీలో చేరి మరింత రాటు దేలాడు.
ఫస్ట్ క్లాస్ క్రికెట్
ఏజ్ గ్రూప్ క్రికెట్‌లో ఓపెనర్‌గా ఆడిన నితీష్ కుమార్ రెడ్డి (Nitish Kumar Reddy First Class Career) .. మీడియం పేసర్‌గానూ సత్తా చాటాడు. అండర్-19బీ టీమ్‌కు ప్రాతినిథ్యం వహించి అక్కడ తన టాలెంట్ ఏంటో చూపించాడు. 2019-20 రంజీ సీజన్‌తో ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన నితీష్.. ఇప్పటి వరకు 7 మ్యాచ్‌ల్లో ఒక సెంచరీ, హాఫ్ సెంచరీతో 366 పరుగులు చేశాడు. ఆంధ్ర జట్టు తరపును లిస్ట్ ఏ క్రికెట్‌లో 22 మ్యాచ్‌లు ఆడిన నితీష్.. 15 ఇన్నింగ్స్‌ల్లో 403 స్కోరు చేశాడు. 36.63 సగటుతో 25 ఫోర్లు, 21 సిక్స్‌లు బాదాడు. హైస్కోర్ 60*గా ఉంది. అటు లిస్ట్ A టీ20 ఫార్మెంట్‌లో 14 మ్యాచ్‌లు ఆడిన నితీష్.. 38.87 సగటుతో 311 పరుగులు చేశాడు. హై స్కోర్ 76* గా ఉంది. బౌలింగ్ రికార్డులను పరిశీలిస్తే లిస్ట్‌లో 22 మ్యాచ్‌లకు గాను 5.81 ఎకానమీతో 14 వికెట్లు తీశాడు.
టర్నింగ్ పాయింట్
ఐపీఎల్‌కు ఎంపిక కావడం నితీష్ కుమార్ (Nitish Kumar Reddy Career Turning Point) కెరీర్‌కు టర్నింగ్ పాయింట్‌గా చెప్పవచ్చు. అతడి ఫస్ట్ క్లాస్ ప్రదర్శన చూసిన సన్‌రైజర్స్ ఫ్రాంచైజీ.. 2023లో రూ.20 లక్షల కనీస ధరతో అతడ్ని ఎంపిక చేసింది. తొలి సీజన్లో అతడికి పెద్దగా అవకాశాలు రాలేదు. ఈ సీజన్లో అతడిని ఫినిషర్‌గా ఉపయోగించుకోవాలని సన్‌రైజర్స్ భావించింది. ఇందుకు అనుగుణంగా చెన్నైతో మ్యాచ్ (CSK vs SRH)లో లోయర్ మిడిలార్డర్లో బరిలోకి దింపింది. ఈ మ్యాచ్ ఛేదనలో నితీశ్.. 8 బంతుల్లో 14 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. అతడి ప్రతిభను గుర్తించిన సన్‌రైజర్స్ మేనేజ్‌మెంట్ (Telugu IPL Players).. పంజాబ్‌పై మ్యాచ్‌లో కాస్త ముందుగా బ్యాటింగ్‌కు పంపింది. దీంతో వచ్చిన ఛాన్స్‌ను పూర్తిగా సద్వివినియోగం చేసుకొని నితీశ్ అర్ధసెంచరీతో అదరగొట్టాడు. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఐడెన్ మార్క్‌రమ్, క్లాసెన్ వంటి స్టార్ బ్యాటర్లు విఫలమైన చోట నితీశ్.. 37 బంతుల్లో 64 పరుగులు చేసి జట్టుకు విలువైన స్కోరును అందించాడు. ఇందులో 4 ఫోర్లు, 5 సిక్స్‌లు ఉన్నాయి. ఈ మ్యాచ్ ద్వారా నితీశ్ జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించింది. ఇది అతడి కెరీర్‌కు టర్నింగ్ పాయింట్‌గా చెప్పవచ్చు.
ఐపీఎల్ ప్రదర్శన
ఐపీఎల్‌లో ఇప్పటివరకూ 10 మ్యాచ్‌లు ఆడిన నితీశ్ (Nitish Kumar Reddy IPL Stats).. 47.80 సగటుతో 239 పరుగులు చేశాడు. స్ట్రైక్ రేటు 154.23గా ఉంది. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ గణంకాలు కూడా ఈ సీజన్‌లో వచ్చినవే. గత సీజన్‌లో రెండు మ్యాచ్‌లు ఆడినప్పటికీ నితీష్ బౌలింగ్‌కో పరిమితమయ్యాడు. ఇక ఐపీఎల్‌లో నితీష్ బౌలింగ్ గణాంకాలు పరిశీలిస్తే అతడు 9 మ్యాచుల్లో 3 వికెట్లు తీశాడు. మెుత్తం 73 పరుగులకు 124 పరుగులు సమర్పించాడు. 2/17.. అతడి బెస్ట్ బౌలింగ్ గణాంకాలుగా చెప్పవచ్చు.
ఫ్యూచర్ టీమిండియా ఆల్‌రౌండర్
టీమ్‌ఇండియాను పేస్ ఆల్‌రౌండర్ల (Telugu IPL Cricketers) కొరత ఎప్పుడూ వేధిస్తూనే ఉంటుంది. హార్దిక్ పాండ్యా తర్వాత సరైన పేస్ ఆల్‌రౌండర్ కోసం బీసీసీఐ అన్వేషిస్తోంది. నితీశ్ బ్యాటింగ్ స్టైల్, బౌలింగ్‌లో వైవిధ్యం, మెరుపు ఫీల్డింగ్ చూస్తుంటే ఆ స్థానానికి అతడు అర్హుడని క్రీడా నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ టోర్నీలో నిలకడగా రాణించడంతోపాటు ఫిట్‌నెస్‌నూ కాపాడుకుంటే టీమిండియా జెర్సీలో నితీష్‌ను చూసేందుకు ఎక్కువ రోజుల సమయం పట్టడని అభిప్రాయపడుతున్నారు. టీమిండియాకు ఫ్యూచర్ ఆల్‌రౌండర్‌గా నితీష్ ఎదుగుతాడని అంచనా వేస్తున్నారు.
Nitish Kumar Reddy Career Stats
Batting
Format | Matchs | Runs | HS | Average | SR | 100 | 50 | 4’s | 6’s |
List A | 22 | 403 | 60 | 36.63 | 95.27 | 4 | 25 | 21 | |
IPL | 9 | 219 | 76* | 54.75 | 154.23 | 2 | 10 | 17 | |
India Odi | |||||||||
India T20 |
Bowling
Format | Matches | Balls | Runs | Wkts | BBM | Ave | Econ | SR | 4W | 5W |
List A | 22 | 608 | 589 | 14 | 3/23 | 42.07 | 5.81 | 43.4 | – | – |
IPL | 9 | 43 | 70 | 3 | 2/17 | 23.33 | 9.77 | 14.33 | – | |
India Odi | ||||||||||
India T20 |
2. తిలక్ వర్మ (Tilak Varma)
క్రికెట్‌లో టీమిండియాకు ఆశాకిరణంగా కనిపిస్తోన్న మరో తెలుగు కుర్రాడు ‘తిలక్ వర్మ’. వీవీఎస్ లక్ష్మణ్ తర్వాత ఆ స్థాయిలో సత్తా చాటగల ఫుల్‌ప్లెడ్జ్ తెలుగు బ్యాట్స్‌మెన్ టీమిండియాలో లేడనే బాధ గతంలో అందరిలో ఉండేది. కానీ తిలక్ వర్మ (Telugu IPL Players) రాకతో అది తీరిపోయింది. ఈ యంగ్ క్రికెటర్ ఐపీఎల్‌తో పాటు టీమిండియా తరపున ఆడి తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. అటు అడపాదడపా బౌలింగ్ చేస్తూ కీలక సమయాల్లో వికెట్లు రాబడుతున్నాడు.
నేపథ్యం
హైదరాబాద్‌కు చెందిన తిలక్ వర్మ (Tilak Varma Early Life) .. 8 నవంబర్, 2002లో జన్మించాడు. అతడి తండ్రి నంబూరి నాగరాజు ఒక ఎలక్ట్రిషియన్. తల్లి గాయత్రి దేవి హౌస్ వైఫ్. నగరంలోని క్రిసెంట్ మోడల్ స్కూల్‌లో చదువుకున్న తిలక్.. లేపాక్షి జూనియర్ కాలేజీలో ఇంటర్ చేశాడు. ప్రస్తుతం ఆంధ్ర యూనివర్సిటీలో BBA చేస్తున్నాడు. తిలక్.. 11 ఏళ్ల నుంచే టెన్నిస్ బాల్‌తో క్రికెట్ ఆడటం ప్రారంభించాడు. లింగంపల్లిలోని లీగల క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందాడు.
ఫస్ట్ క్లాస్ క్రికెట్
2018–19 రంజీ ట్రోఫిలో హైదరాబాద్ జట్టు తరపున తొలిసారి (Telugu IPL Players) తిలక్ వర్మ బరిలోకి దిగాడు. ఆ టోర్నమెంట్‌లో (Tilak Varma First Class Career) మెుత్తం 7 మ్యాచ్‌లు ఆడిన తిలక్.. 147.26 స్ట్రైక్ రేట్‌తో 215 రన్స్ చేసి సత్తా చాటాడు. 2019–20 విజయ్ హజారే ట్రోఫిలో 5 మ్యాచ్‌లు ఆడిన తిలక్ 180 పరుగులతో రాణించాడు. ఆ తర్వాత 2020 అండర్ 19 వరల్డ్ కప్, 2021-22 విజయ్ హజారే ట్రోఫిలోనూ రాణించి ఐపీఎల్ ఫ్రాంచైజీల దృష్టిలో పడ్డాడు.
ఐపీఎల్ ప్రదర్శన
ఐపీఎల్ 2022 ఐపీఎల్ వేలంలో (Telugu IPL Cricketers) ముంబయి ఇండియన్స్ తిలక్ వర్మను కొనుగోలు చేసింది. అతడి కనీస ధర రూ.20 లక్షలు కాగా రూ.1.7 కోట్లు చెల్లించి మరి దక్కించుకుంది. ఆ సీజన్‌లో తన రెండో మ్యాచ్‌లోనే తిలక్ 31 బంతుల్లో 61 పరుగులు చేసి ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాడు. 2023 ఐపీఎల్ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో(Tilak varma IPL Stats) జరిగిన మ్యాచ్‌లో 46 బంతుల్లో 84 రన్స్ చేసి అదరగొట్టాడు. 2022 సీజన్‌లో 14 మ్యాచ్‌లు ఆడిన తిలక్.. 36.09 సగటుతో 397 రన్స్ చేశాడు. 2023 సీజన్‌లోనూ తన ఫామ్ కొనసాగించిన ఈ యువ క్రికెటర్ 11 మ్యాచుల్లో 42.88 సగటుతో 343 పరుగులు చేసి తను ఎంత విలువైన ఆటగాడో నిరూపించుకున్నాడు. ప్రస్తుత 17వ ఐపీఎల్ సీజన్‌లోనూ తిలక్ రాణిస్తున్నాడు. ఇప్పటివరకూ 11 మ్యాచ్‌లు ఆడిన అతడు 38.56 యావరేజ్‌తో 347 పరుగులు రాబట్టాడు. స్ట్రైక్ రేట్ 151.53గా ఉంది.
టీమిండియా ప్రదర్శన
2023 జులైలో జరిగిన వెస్టిండీస్ టీ20 సిరీస్ కోసం తిలక్ వర్మ (Tilak Varma Team India Stats) తొలిసారి భారత జట్టుకు ఎంపికయ్యాడు. తన తొలి మ్యాచ్‌లో 22 బంతులను ఎదుర్కొన్న తిలక్ 39 పరుగులు బాది టాప్ జట్టులో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. సెకండ్ టీ20లోనే అర్ధశతం బాది భారత్ తరపున తన తొలి హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఆ తర్వాత 2022లో ఐర్లాండ్ టూర్‌కు తిలక్ వర్మ ఎంపికయ్యాడు. ఆ ఏడాదే చైనాలో (Telugu IPL Players) జరిగిన ఆసియన్ గేమ్స్‌లో భారత జట్టు తరపున ప్రాతినిథ్యం వహించాడు. ఐపీఎల్‌లో ప్రదర్శన ఆధారంగా టీ20 వరల్డ్ కప్‌నకు సైతం తిలక్ వర్మ ఎంపికవుతాడని అంతా భావించారు. అయితే అతడికి అదృష్టం కలిసి రాలేదు.
Tilak Varma Career Stats
Batting
Format | Matchs | Runs | HS | Average | SR | 100 | 50 | 4’s | 6’s |
List A | 29 | 1304 | 156* | 52.16 | 97.67 | 5 | 6 | 101 | 49 |
IPL | 36 | 1087 | 84* | 38.82 | 146.69 | 6 | 79 | 57 | |
India Odi | 4 | 68 | 52 | 22.66 | 57.14 | 0 | 1 | 6 | 1 |
India T20 | 16 | 336 | 55* | 33.60 | 139.41 | 0 | 2 | 29 | 16 |
Bowling
Format | Matches | Balls | Runs | Wkts | BBM | Ave | Econ | SR | 4W | 5W |
List A | 29 | 272 | 214 | 8 | 4/23 | 26.75 | 4.72 | 34.0 | 1 | 0 |
IPL | 36 | 22 | 28 | 0 | 0/6 | – | 7.64 | – | 0 | 0 |
India Odi | 4 | 42 | 39 | 0 | 5.57 | 0 | 0 | 0 | ||
India T20 | 16 | 30 | 26 | 2 | 1/5 | 13.00 | 5.20 | 15.0 | 0 | 0 |
మహమ్మద్ సిరాజ్ (Mohammed Siraj)
తెలుగు రాష్ట్రాల నుండి టీమిండియాకు ప్రాతినిథ్యం వహిస్తున్న నిఖార్సైన ఫాస్ బౌలర్ మహమ్మద్ సిరాజ్. కెరీర్ ప్రారంభంలో ఎన్నో కష్టాలు అనుభవించిన సిరాజ్.. తన బౌలింగ్ టాలెంట్‌తో అతి కొద్ది కాలంలోనే టీమిండియా బౌలర్‌గా మారాడు. ప్రస్తుతం భారత జట్టులో జస్ప్రిత్ బుమ్రా తర్వాత ఆ స్థాయిలో ప్రదర్శన చేయగల పేసర్ సిరాజ్ అనడంలో అతిశయోక్తి లేదు. అందుకే త్వరలో జరగనున్న టీ 20 వరల్డ్ కప్‌నకు కూడా సిరాజ్ ఎంపికయ్యాడు.
నేపథ్యం
మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj Family).. హైదరాబాద్ టోలీచౌకిలోని ఓ సాధారణ కుటుంబంలో 1994 మార్చి 13న జన్మించాడు. అతడి తండ్రి మహమ్మద్ గౌస్ ఆటో నడిపేవారు. సిరాజ్.. తన బాల్యంలో ఎలాంటి కోచింగ్ తీసుకోలేదు. స్థానిక ఈద్గా మైదానంలో బౌలింగ్ ప్రాక్టిస్ చేసేవాడు. బౌలింగ్‌లో మంచి పేస్, స్వింగ్ ఉండటంతో HCA డివిజన్ లీగ్‌కు సెలక్ట్ అయ్యాడు. అక్కడ సత్తా చాటడంతో హైదరాబాద్ అండర్ 23కి సిరాజ్‌ను సెలక్ట్ చేశారు.
ఫస్ట్ క్లాస్ క్రికెట్
అండర్ – 23 కూడా సత్తా చాటిన సిరాజ్(Mohammed Siraj First Class Career).. హైదరాబాద్ రంజీ ట్రోఫీ జట్టుకు 2016లో ఎంపికయ్యాడు. ఆ టోర్నమెంట్‌లో సిరాజ్ విశ్వరూపం చూపించాడు. సహచరులతో కలిసి ప్రత్యర్థి బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. సిరాజ్ బౌలింగ్ ధాటికి గ్రూప్-సిలో ఉన్న హైదరాబాద్ జట్టు క్వార్టర్ ఫైనల్స్‌కు వెళ్లిపోయింది. అందులో టోర్నీలో 18.92 సగటుతో సిరాజ్ 41 వికెట్లు పడగొట్టడం విశేషం. ఈ ప్రదర్శన తో సిరాజ్.. ఇరానీ ట్రోఫీలో పాల్గొనే రెస్టాఫ్ ఇండియా జట్టుకు సైతం ఎంపికయ్యాడు.
ఐపీఎల్ ప్రదర్శన
రంజీ ట్రోఫీలో అదరగొడట్టంతో సిరాజ్(Mohammed Siraj IPL Stats)కు ఐపీఎల్ ఆడే అవకాశం దక్కింది. 2017లో జరిగిన ఐపీఎల్ వేలంలో సిరాజ్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు రూ.2.6 కోట్లకు కొనుగోలు చేసింది. ఆ సీజన్‌లో హైదరాబాద్ తరపున 9 మ్యాచుల్లో 41 వికెట్లు తీసి జట్టు తరపున హయేస్ట్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. 2017-18 సీజన్‌లో చెప్పుకోతగ్గ ప్రదర్శన సిరాజ్ చేయకపోవడంతో సన్‌రైజర్స్ (Telugu IPL Cricketers) అతడ్ని విడిచిపెట్టింది. దీంతో 2018 వేలంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు అతడ్ని రూ.2.20 కోట్లకు కొనుగోలు చేసింది. అప్పటి నుంచి సిరాజ్ ఆ జట్టులో కీలక బౌలర్‌గా వ్యవహరిస్తూ వస్తున్నాడు. ఐపీఎల్‌లో ఇప్పటివరకూ 89 మ్యాచ్‌లు ఆడిన సిరాజ్.. 8.63 ఎకనామీతో 86 వికెట్లు తీశాడు.
టీమిండియా ప్రదర్శన
ఐపీఎల్ అనంతరం నేరుగా ఇండియా-ఎ జట్టుకు (Telugu IPL Players) ఎంపికైన సిరాజ్‌ను కోచ్ రాహుల్ ద్రవిడ్ మరింత సానబెట్టాడు. సఫారీ పర్యటనలో దక్షిణాఫ్రికా-ఎతో జరిగిన ఏకైక అనధికారిక టెస్టులో ఐదు వికెట్లు (5/103) తీశాడు. వరుసగా దక్షిణాఫ్రికా-ఎ, అఫ్గానిస్థాన్-ఎ, న్యూజిలాండ్-ఎ జట్లతో జరిగిన మ్యాచ్‌ల్లో ఇండియా-ఎ తరఫున సిరాజ్ బరిలో దిగి ఆకట్టుకున్నాడు. దీంతో 2017లో న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ కోసం సిరాజ్ తొలిసారి టీమిండియాకు (Mohammed Siraj Team India Stats) సెలక్ట్ అయ్యాడు. టీమిండియా, శ్రీలంక జట్ల మధ్య 2023 సెప్టెంబరు 17న కొలంబోలో జరిగిన ఆసియా కప్ ఫైనల్లో మహమ్మద్ సిరాజ్ 16 బంతుల్లో 5 వికెట్లు తీసి సత్తా చాటాడు. శ్రీలంకా దిగ్గజ బౌలర్ చమిందా వాస్ రికార్డును సమం చేస్తూ వన్డేల్లో 6 వికెట్లు తీసిన ఫాస్టెస్ట్ బౌలర్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో ఒకే ఓవర్‌లో 4 వికెట్లు తీసి ఆ ఘనత సాధించిన తొలి భారత బౌలర్‌గా సిరాజ్ నిలిచాడు.
Mohammed Siraj Career Stats
Bowling
Format | Matches | Balls | Runs | Wkts | BBM | Ave | Econ | SR | 4W | 5W |
List A | 86 | 3907 | 3367 | 149 | 6/21 | 22.59 | 5.17 | 26.2 | 4 | 4 |
IPL | 89 | 1862 | 2679 | 86 | 4/21 | 31.15 | 8.63 | 21.65 | 2 | – |
India Odi | 41 | 1825 | 1550 | 68 | 6/21 | 22.79 | 5.09 | 26.8 | 2 | 1 |
India T20 | 10 | 228 | 334 | 12 | 4/17 | 27.83 | 8.78 | 19.0 | 1 | 0 |
India Tests | 27 | 3930 | 2197 | 74 | 6/15 | 29.68 | 3.35 | 53.1 | 5 | 3 |
షేక్ రషీద్ (Shaik Rasheed)
తెలుగు రాష్ట్రాల నుంచి టీమిండియా భవిష్యత్ ఆశాకిరణంగా కనిపిస్తున్న క్రికెటర్ ‘షేక్ రషీద్’. 2022లో అండర్-19 వరల్డ్ కప్ జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఎంపికై ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాడు. రైట్ హ్యాండ్ బ్యాటర్ అయిన రషీద్.. టోర్నీలో మంచి ప్రదర్శన చేసి మెప్పించాడు. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు సెలక్ట్ అయ్యి తను ఎంత ప్రతిభావంతుడినో అందరికీ తెలియజేశాడు.
నేపథ్యం
షేక్ రషీద్.. ఏపీలోని గుంటూరు జిల్లా పత్తిపాడు మండలం (Shaik Rasheed Early Life) పాతమల్లాయపాలెం గ్రామంలో 24, సెప్టెంబర్ 2004లో జన్మించాడు.షేక్ బాలీషా, జ్యోతి దంపతులకు రషీద్ రెండో కుమారుడు. తండ్రి వృత్తిరిత్యా ప్రైవేటు ఉద్యోగి. చిన్నప్పటి నుంచి రషీద్ క్రికెట్‌పై ఆసక్తి పెంచుకోవడంతో కుటుంబ సభ్యులు అతడ్ని ప్రోత్సహించారు. అతడు మంగళగిరి క్రికెట్ అకాడమీలో కోచ్ కృష్ణారావు వద్ద శిక్షణ పొందాడు.
క్రికెట్ కెరీర్
రషీద్.. తన తొమ్మిదే ఏటనే అండర్-14 క్రికెట్ జట్టుకు ఎంపికయ్యాడు. అంతర్ జిల్లాల పోటీల్లో భాగంగా శ్రీకాకుళం టీమ్‌పై ట్రిపుల్ సెంచరీ (Shaik Rasheed Cricket Career) బాదాడు. 2017లో అండర్-16 కెటగిరీలో 674 పరుగులు చేసి ఆ టోర్నీలోనే హయ్యెస్ట్ స్కోరర్‌గా నిలిచాడు. 2018లో అండర్-19కు ఎంపికై ఆ టోర్నీలో సత్తా చాటాడు. 680 రన్స్‌తో జాతీయ స్థాయిలో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. 2021లో వినూ మన్కడ్‌లో ఆరు మ్యాచ్‌లాడిన రషీద్ రెండు శతకాలు, రెండు హాఫ్ సెంచరీలతో 400కు పైగా పరుగులు చేసాడు. దీంతో 2022 అండర్ 19 వరల్డ్ కప్ కోసం రషీద్‌ను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేశారు.
ఐపీఎల్
దేశవాళి క్రికెట్‌లో రషీద్ (Shaik Rasheed IPL Stats) ప్రదర్శనకు ఇంప్రెస్ అయిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు.. 2023 ఐపీఎల్ వేలంలో అతడ్ని రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది. ప్రస్తుతం అతడు చెన్నై టీమ్‌తోనే కొనసాగుతున్నాడు. అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడు.
Shaik Rasheed Career Stats
Batting
Format | Matchs | Runs | HS | Average | SR | 100 | 50 | 4’s | 6’s |
List A | 8 | 62 | 31 | 8.85 | 105 | 0 | 0 | 5 | – |
IPL | |||||||||
India Odi | |||||||||
India T20 |
కే.ఎస్. భరత్ (K.S Bharat)
తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లి భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించిన క్రికెటర్లలో కే.ఎస్ భరత్ ఒకరు. బ్యాట్స్‌మెన్, వికెట్ కీపర్ అయిన భరత్.. రంజీ ట్రోఫీల్లో సత్తా చాటి టీమిండియాకు ఎంపికయ్యాడు. వికెట్ కీపర్‌గా భారత్ తరపున వరుసగా టెస్టు సిరీస్‌లు ఆడి అలరించాడు.
నేపథ్యం
ఏపీలోని రామచంద్రపురంలో 3 అక్టోబరు, 1993న కేఎస్ భరత్ (K.S Bharat Early Life) జన్మించాడు. అతడి తల్లిదండ్రులు శ్రీనివాసరావు, దేవి. తండ్రి విశాఖలో నావీ ఉద్యోగి కావడంతో భరత్ విద్యాభ్యాసం మెుత్తం అక్కడే జరిగింది. విశాఖపట్నంలోని బుల్లయ్య కాలేజ్ నుండి భరత్ ఎంబీఏ పూర్తి చేశాడు. భరత్.. 5 ఆగష్టు 2020న గాజువాకకి చెందిన అంజలిని పెళ్లి చేసుకున్నాడు.
ఫస్ట్ క్లాస్ క్రికెట్
కేఎస్ భరత్.. 2012లో ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లోకి (K.S Bharat First Class Cricket) అడుగుపెట్టాడు. ఆంధ్ర తరపున 78 మ్యాచ్‌లు ఆడిన అతడు 4,283 పరుగులు సాధించాడు. 2015లో గోవాతో జరిగిన రంజీ మ్యాచ్‌లో 308 పరుగులు చేసి రంజీల్లో ట్రిపుల్ సెంచరీ సాధించిన తొలి వికెట్ కీపర్‌గా నిలిచాడు.
ఐపీఎల్ కెరీర్
లిస్ట్ ఏ క్రికెట్‌లో విశేషంగా రాణిస్తున్న కే.ఎస్ భరత్ (K.S Bharat IPL Career)ను 2015 ఐపీఎల్ వేలంలో ఢిల్లీ డేర్ డెవిల్స్ (ప్రస్తుత ఢిల్లీ క్యాపిటల్స్) కొనుగోలు చేసింది. అయితే ఒక్క మ్యాచ్‌లో కూడా ఆడే అవకాశం దక్కలేదు. తిరిగి 2021లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు భరత్‌ను దక్కించుకుంది. ఆ సీజన్‌లో బ్యాటర్‌గా, వికెట్ కీపర్‌గా కేఎస్ భరత్ విశేషంగా రాణించాడు. 8 మ్యాచ్‌లు ఆడిన భరత్.. 38.20 సగటుతో 191 పరుగులు చేశాడు. ఇందులో 78* హై స్కోరుగా ఉంది. తిరిగి 2022లో ఢిల్లీ జట్టు అతడ్ని రూ. 2 కోట్లకు కొనుగోలు చేసింది. ఆ సీజన్‌లో రెండో మ్యాచ్‌లు ఆడిన భరత్.. 8 పరుగులు మాత్రమే చేశాడు. 2024 సీజన్‌లో భరత్ కోల్‌కత్తా నైట్ రైడర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.
టీమిండియా ప్రదర్శన
కేఎస్ భరత్ టీమిండియా (K.S Bharat Team India Stats) తరపున మెుత్తం ఏడు టెస్టులు ఆడాడు. వన్డే, టీ20లో ఆడలేదు. 9 ఫిబ్రవరి, 2023లో స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు ద్వారా తొలిసారి టీమిండియా జెర్సీని ధరించాడు. ఆ తర్వాత టీమిండియా ఆడిన చాల వరకూ టెస్టుల్లో కేఎస్ భరత్ వికెట్ కీపర్‌గా వ్యవహరించాడు.
KS Bharat Career Stats
Batting
Format | Matchs | Runs | HS | Average | SR | 100 | 50 | 4’s | 6’s |
List A | 69 | 2167 | 161* | 34.95 | 79.17 | 7 | 7 | 222 | 41 |
IPL | 10 | 199 | 78 | 28.43 | 122.09 | 0 | 1 | 12 | 8 |
India Odi | |||||||||
India T20 | |||||||||
India Test | 7 | 221 | 44 | 20.09 | 53.0 | 0 | 0 | 19 | 6 |
అంబటి రాయుడు (Ambati Rayudu)
వీవీఎస్ లక్ష్మణ్ తర్వాత ఆ స్థాయిలో తెలుగు క్రికెటర్ (Telugu IPL Players)గా గుర్తింపు పొందిన ప్లేయర్ అంబటి రాయుడు. తన ధనాధన్ పర్‌ఫార్మెన్స్‌తో రాయుడు.. ఐపీఎల్‌లో ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించాడు. తద్వారా టీమిండియాకు ఆడి తన సత్తా ఏంటో చూపించాడు. అయితే రాయుడు అన్ని ఫార్మెంట్లకు రిటైర్‌మెంట్ ప్రకటించాడు.
నేపథ్యం
సెప్టెంబర్ 23, 1985న ఏపీలోని గుంటూరులో (Ambati Rayudu Parents) సాంబశివరావు, విజయ లక్ష్మీ దంపతులకు అంబటి రాయుడు జన్మించాడు. అతడు తన విద్యాభ్యాసం అంతా హైదరాబాద్ సైనిక్‌పురిలో చేశాడు. క్రికెట్‌పై ఆసక్తితో బాల్యం నుంచే ఆ దిశగా రాయుడు అడుగులు వేశాడు.
ఫస్ట్ క్లాస్ క్రికెట్
2002 జనవరిలో రాయుడు హైదరాబాద్ జట్టు తరపున ఫస్ట్ క్లాస్ (Ambati Rayudu First Class Career) క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. అప్పుడు అతడి వయసు 16 సంవత్సరాలే. ఆ తర్వాత అండర్ -17 టీమ్‌కు కెప్టెన్ వ్యవహరించాడు. తర్వాత భారత్ తరపున అండర్ 19 టీమ్‌కు ఎంపికైన రాయుడు.. ఇంగ్లాండ్ పర్యటనలో అదరగొట్టాడు. ఓపెనర్‌గా దిగి మూడు మ్యాచుల్లో 291 పరుగులు చేశాడు. డొమెస్టిక్ క్రికెట్‌లో 2001–2005 మధ్య హైదరాబాద్ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన రాయుడు.. 2005–2006లో ఆంధ్రా జట్టుకు మారాడు. ఆ తర్వాత తిరిగి 2006–2010 మధ్య హైదరాబాద్‌కు టీమ్‌లో కొనసాగాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో మెుత్తం 97 మ్యాచ్‌లు ఆడిన రాయుడు.. 45.56 సగటుతో 6,151 పరుగులు చేశాడు. ఇందులో 210 టాప్ స్కోరుగా ఉంది.
టీమిండియా ప్రదర్శన
అంబటి రాయుడు.. భారత్ తరపున ఎన్నో మ్యాచ్‌లు ఆడి జట్టుకు చిరస్మరణీయ విజయాలను అందించాడు. జులై 24, 2013లో జింబాబ్వేతో జరిగిన వన్డే మ్యాచ్ ద్వారా రాయుడు తొలిసారి భారత జట్టు తరపున మైదానంలోకి దిగాడు. 2014లో ఇంగ్లాండ్‌పై మ్యాచ్ సందర్భంగా టీ20ల్లోకి అడుగుపెట్టాడు. రాయుడు.. భారత్ తరపున (Ambati Rayudu Team India Stats) 55 వన్డేలు, 6 టీ 20 మ్యాచ్‌లు ఆడాడు. టెస్టుల్లో అరంగేట్రం చేయలేదు.
ఐపీఎల్ కెరీర్
ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో రాయుడి (Ambati Rayudu IPL Career) అద్భుత ప్రదర్శన చూసిన ముంబయి జట్టు.. 2009 సీజన్‌కు గాను తొలిసారి అతడ్ని కొనుగోలు చేసింది. మిడిల్ ఆర్డర్ బ్యాటర్‌గా వికెట్ కీపర్‌గా రాయుడు ఆ జట్టుకు సేవలందించాడు. కీలక బ్యాటర్‌గా పరుగుల వరద పారించి ముంబయి మూడు సార్లు ఐపీఎల్ టైటిల్స్ గెలవడంలో తన వంతు పాత్ర పోషించాడు. 2018-19లో జరిగిన బహిరంగ వేలంలో రాయుడ్ని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కొనుగోలు చేసింది. ఆ తర్వాత చెన్నై గెలిచిన (2018, 2021, 2023) మూడు టైటిళ్ల వెనక అతడి భాగస్వామ్యం ఉంది. 2019లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ చెప్పిన రాయుడు, 2023లో ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పాడు.
Ambati Rayudu Career Stats
Batting
Format | Matchs | Runs | HS | Average | SR | 100 | 50 | 4’s | 6’s |
List A | 178 | 5607 | 124* | 39.48 | – | – | 5 | 40 | – |
IPL | 203 | 4348 | 100 | 28.05 | 127.54 | 1 | 22 | 359 | 173 |
India Odi | 55 | 1694 | 124 | 47.06 | 79.05 | 3 | 10 | 145 | 30 |
India T20 | 6 | 42 | 20 | 10.5 | 84.0 | 0 | 0 | 5 | 0 |
India Test |
ఎలకా వేణుగోపాలరావు (Venugopal Rao)
తెలుగు రాష్ట్రాల తరపున భారత్‌కు ప్రాతినిథ్యం వహించిన అతి కొద్ది మంది క్రికెటర్లలో ఎలకా వేణుగోపాలరావు ఒకరు. ఆయన ఏపీలోని వైజాగ్‌లో 26 ఫిబ్రవరి, 1982లో జన్మించాడు. ఐపీఎల్‌లోనూ తమ జట్టుకు చిరకాల విజయాలను అందించాడు.
ఫస్ట్ క్లాస్ కెరీర్
స్టీల్ సిటీ విశాఖపట్నంలోని ఓ దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వేణుగోపాలరావు (Venugopal Rao Early Life) తన నలుగురు సోదరులతో కలసి వివిధ ఏజ్ గ్రూపులలో ఆంధ్ర జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు జూనియర్ స్థాయి నుంచి సీనియర్ స్థాయి వరకూ నిలకడగా రాణించాడు. తన ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో ఇప్పటివరకూ ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఇప్పటివరకూ 121 మ్యాచ్‌లు ఆడిన వేణుగోపాలరావు 40.93 సగటుతో 7081 పరుగులు చేశాడు.
టీమిండియా ప్రదర్శన
దేశీయ క్రికెట్‌లో పరుగుల వరద పారింటిన వేణుగోపాలరావు (Venugopal Rao Team India Stats).. 2005 సీజన్ లో భారత వన్డే జట్టులో చోటు సంపాదించాడు. 16 వన్డేల్లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించాడు. 24.22 సగటుతో భారత్ తరపున 218 పరుగులు చేశాడు.
ఐపీఎల్ ప్రదర్శన
వేణుగోపాల రావు 2008 – 2014 మధ్య ఐపీఎల్ (Venugopal Rao IPL Career)లో ఆడాడు. డెక్కన్ చార్జర్స్, ఢిల్లీ డేర్ డెవిల్స్, హైదరాబాద్ సన్ రైజర్స్ జట్ల తరపున మొత్తం 65 మ్యాచులకు ప్రాతినిథ్యం వహించాడు. ఐపీఎల్ విజేతగా నిలిచిన డెక్కన్ చార్జర్స్ జట్టులో వేణుగోపాలరావు సభ్యుడిగా ఉన్నాడు. కొన్నేళ్ల క్రితమే క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన అతడు.. ప్రస్తుతం ఐపీఎల్‌లో తెలుగు కామెంటేటర్‌గా కొనసాగుతున్నాడు.
Venugopal Rao Career Stats
Batting
Format | Matchs | Runs | HS | Average | SR | 100 | 50 | 4’s | 6’s |
List A | 137 | 4110 | 115* | 38.77 | – | 11 | 25 | – | – |
IPL | 64 | 985 | 71* | 22.39 | 117.82 | 3 | 77 | 37 | |
India Odi | 16 | 218 | 61* | 24.22 | 60.05 | 0 | 1 | 16 | 3 |
India T20 | |||||||||
India Test |
వీవీఎస్ లక్ష్మణ్ (VVS Laxman)
తెలుగు రాష్ట్రాల నుంచి టీమిండియాకు ఆడిన దిగ్గజ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ (Telugu IPL Players).. అతడి పూర్తి పేరు వంగిపురపు వెంకట సాయి లక్ష్మణ్. నవంబరు 1, 1974లో హైదరాబాద్‌లో జన్మించాడు. తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన చాలా మంది క్రికెటర్లకు లక్ష్మణ్ ఎంతో ప్రేరణ.
ఫస్ట్ క్లాస్ కెరీర్
లక్షణ్ ఫస్ట్ క్లాస్ కెరీర్ (VVS Laxman First Class Career) అమోఘంగా ఉంది. ఆయన 1992–2012 మధ్య హైదరాబాద్ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. ఇంగ్లాండ్ దేశవాళి క్రికెట్‌లో లాంకషైర్ తరపున 2007–2009 మధ్య ఆడాడు. తన ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో 267 మ్యాచ్‌లు ఆడిన లక్ష్మణ్.. ఏకంగా 51.64 సగటుతో 19,730 రన్స్ చేశాడు.
టీమిండియా ప్రదర్శన
వీవీఎస్ లక్ష్మణ్ భారత్ (VVS Laxman India Stats) తరపున ఇప్పటివరకూ.. 134 టెస్టులు, 86 వన్డేలు ఆడాడు. నవంబర్ 20, 1996లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచ్‌తో లక్ష్మణ్ టీమిండియాలోకి అడుగుపెట్టాడు. ఏప్రిల్ 9, 1998లో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో వన్డేల్లోకి అడుగుపెట్టాడు.
ఐపీఎల్ కెరీర్
2008 ఐపీఎల్ ప్రారంభ సీజన్‌లో లక్ష్మణ్ (VVS Laxman IPL Career).. డెక్కన్ ఛార్జర్స్ టీమ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. అయితే దూకుడుగా ఆడకపోవడంతో సీజన్ ముగియకముందే అతడ్ని కెప్టెన్సీ నుంచి తప్పించారు. ఐపీఎల్‌లో 20 మ్యాచ్‌లు ఆడిన లక్ష్మణ్.. 282 పరుగులు చేశాడు. ఇందులో 52 హైస్కోర్ కాగా, స్టైక్ రేట్ 105.62గా ఉంది.
VVS Laxman Career Stats
Batting
Format | Matchs | Runs | HS | Average | SR | 100 | 200 | 50 | 4’s | 6’s |
List A | 173 | 5078 | 131 | 34.54 | 9 | 0 | 28 | |||
IPL | 20 | 282 | 52 | 14.84 | 105.62 | 0 | 0 | 1 | 33 | 5 |
India Odi | 86 | 2338 | 131 | 30.76 | 71.24 | 6 | 0 | 10 | 222 | 4 |
India T20 | ||||||||||
India Test | 134 | 8781 | 281 | 45.5 | 49.37 | 17 | 2 | 56 | 1135 | 5 |
Celebrities Featured Articles Movie News
Anasuya Bharadwaj: నా భర్త కోపరేట్ చేయట్లేదు.. ఆనసూయ హాట్ కామెంట్స్ వైరల్