• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Yuvraj Singh Biopic: యువరాజ్‌ సింగ్‌ బయోపిక్‌కు రంగం సిద్ధం.. మరి హీరో ఎవరు?

    భారతీయ చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం బయోపిక్‌ల హవా నడుస్తోంది. క్రీడలతో పాటు వివిధ రంగాల్లో విశేషంగా రాణించిన వ్యక్తుల జీవిత గాథలు వెండితెరపై ఆవిష్కతమవుతున్నాయి. ఈ క్రమంలోనే టీమిండియా పెను సంచలనం యువరాజ్‌ సింగ్‌ (Yuvraj Singh) బయోపిక్‌కు కూడా రంగం సిద్ధమైంది. ఒకే ఓవర్‌లో ఆరు సిక్స్‌లు కొట్టి ప్రత్యర్థులకు చుక్కలు చూపించిన యువరాజ్‌ సింగ్‌ వృతి, వ్యక్తిగత జీవితాల్లో ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. అటువంటి వ్యక్తిపై బయోపిక్‌ వస్తుడటం దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావడంతో క్రికెట్‌ లవర్స్‌తో పాటు, సినీ అభిమానులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

    యువీ బయోపిక్ లోడింగ్‌!

    బాలీవుడ్‌ ప్రముఖ నిర్మాణసంస్థ టీ సిరీస్‌ (T Series) యువీ బయోపిక్‌ను రూపొందించనుంది. నిర్మాతలు భూషణ్‌ కుమార్‌, రవిభాగ్ చందక్‌ ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. ఈ బయోపిక్‌కు సంబంధించి యువరాజ్‌తో చర్చించిన అనంతరం ఈ విషయాన్ని ధ్రువీకరించారు. అతడితో దిగిన ఫొటోలను నిర్మాతలు ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పంచుకున్నారు. త్వరలోనే యువీ బయోపిక్‌కు సంబంధించి మరిన్ని వివరాలను ప్రకటించనున్నట్లు తెలిపారు. అయితే ఇందులో హీరోగా ఎవరు కనిపిస్తారు అన్న విషయంపై స్పష్టత ఇవ్వలేదు. దీంతో యువీ పాత్రను ఎవరు పోషిస్తారా? అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. బాలీవుడ్‌కు చెందిన యంగ్‌ హీరోల పేర్లను యువీ పాత్ర కోసం పరిశీలిస్తున్నట్లు సమాచారం. కాగా, ఇప్పటికే క్రీడా రంగానికి చెందిన ప్రముఖుల బయోపిక్‌లు విడుదలై ఆకట్టుకున్నాయి. ఇప్పుడు వాటి సరసన యువీ బయోపిక్‌ కూడా చేరనుండటంతో క్రికెట్‌ లవర్స్‌ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

    బయోపిక్‌లో ఏం ఉండొచ్చు? 

    యువరాజ్‌ సింగ్‌ను ఓ పోరాట యోధుడిగా అతడి సన్నిహితులు చెబుతుంటారు. కెరీర్‌ పీక్స్‌లో ఉన్న సమయంలో అతడు క్యాన్సర్‌ బారిన పడ్డాడు. కఠిన పరిస్థితులను ఎదుర్కొని దాని నుంచి బయటపడ్డారు. తద్వారా ఎంతోమందికి మనోధైర్యాన్ని నింపారు. క్యాన్సర్‌కు ముందు క్రికెట్‌లో గొప్పగా రాణించిన యువీ పునరాగమనంలోనూ అదే స్థాయిలో ఇంపాక్ట్‌ చూపించారు. అయితే ఈ బయోపిక్‌లో కేవలం క్రికెట్‌ సంబంధించిన అంశాలే చూపుతారా? లేదా క్యాన్సర్‌పై అతడు చేసిన పోరాటాన్ని కూడా కళ్లకు కడతారా? అన్నది తెలియాల్సి ఉంది. అయితే యువరాజ్‌ సింగ్‌ వ్యక్తిగత, వృత్తిపర జీవితంలో చోటుచేసుకున్న కీలక సంఘటనలు ఈ బయోపిక్‌లో చూపించే అవకాశం ఉందని బాలీవుడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

    యువరాజ్‌ క్రికెట్‌ కెరీర్‌

    టీమిండియా క్రికెట్‌ చరిత్రలోనే కాక వరల్డ్‌ కప్‌ క్రికెట్‌లోనూ యువరాజ్‌ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించాడు. అద్భుతమైన ఇన్నింగ్స్‌లతో భారత్‌కు ఎన్నో తిరుగులేని విజయాలను అందించాడు. మరీ ముఖ్యంగా టీమిండియా 2011 వన్డే వరల్డ్ కప్ గెలవడంలో యువీది కీలక పాత్ర. ఇక ఇంగ్లండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో ఆరు బంతులకు ఆరు సిక్సర్లు కొట్టి ప్రపంచ రికార్డును నమోదు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌లోకి 2000లో అడుగుపెట్టిన యువరాజ్‌ దాదాపు 17 ఏళ్లపాటు భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 2007 టీ20 ప్రపంచకప్‌, 2011 వన్డే ప్రపంచకప్‌ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. 2019లో ఇంటర్నేషనల్‌ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 40 టెస్టుల్లో 1900 పరుగులు, 304 వన్డేల్లో 8,701 పరుగులు, 58 టీ20ల్లో 1,177 పరుగులు చేశాడు. మూడు ఫార్మాట్లలో కలిపి 148 వికెట్లు పడగొట్టాడు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv