• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • డెంగీ తర్వాత నాలుగు కేజీలు తగ్గా: గిల్

    టీమిండియా స్టార్ బ్యాటర్ శుభమన్‌గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను డెంగీ నుంచి కోలుకుని వచ్చాక పూర్తిస్థాయిలో ఫిట్‌గా లేనని తెలిపాడు. డెంగీ తర్వాత నాలుగు కేజీల బరువు తగ్గినట్లు తెలిపాడు. ‘వరల్డ్‌కప్‌లో మా బౌలర్లు బౌలింగ్‌ చేస్తున్న తీరు అద్భుతం. బుమ్రా, షమీ దెబ్బకు మా విజయం సులభం అవుతోంది. నేను మొదట్లో ఆచితూచి ఆడాల్సి వచ్చింది. బౌలర్లపై ఒత్తిడి తీసుకు రావాల్సి వచ్చింది. అందుకే, స్ట్రైక్‌ను రొటేట్‌ చేయడంపై దృష్టిసారించాం’. అని గిల్ చెప్పుకొచ్చాడు.

    ముందే సెమీస్‌కు చేరడం ఆనందం: రోహిత్

    వన్డే ప్రపంచకప్‌లో ముందే సెమీస్‌కు చేరడం ఆనందంగా ఉందని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. తమ తొలి లక్ష్యం పూర్తయిందని తెలిపాడు.. ‘ఇక ముందున్న సవాళ్లకు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. జట్టులో ప్రతి ఒక్కరూ తమ పాత్రను గొప్పగా పోషిస్తున్నారు. వరల్డ్‌ కప్‌లో మా ఆటతీరు పట్ల గర్వంగా ఉంది. ఇప్పుడు అధికారికంగా సెమీస్‌కు చేరుకోవడం ఇంకా ఆనందాన్ని కలిగించింది. ఇక ఫైనల్స్‌పైనే గురి పెడతాం’. అని రోహిత్ చెప్పుకొచ్చాడు.

    అది కేవలం నా ఒక్కడి ఆలోచన కాదు: రోహిత్

    టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఓ ఇంటర్య్వూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. మ్యాచ్‌లో పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ నిర్ణయాలు తీసుకుంటానని చెప్పారు. ‘విశ్లేషణ చేసి అందుకు తగ్గట్టుగా ప్రణాళికల్లో మార్పులు చేసుకోవాలి. జట్టు నిర్ణయాలకు కట్టుబడి మ్యాచ్‌ను ముందుకు తీసుకెళ్లేది వారే. ఇది కేవలం కెప్టెన్‌గా నా ఒక్కడి ఆలోచనే కాదు. ఎల్లవేళలా నా బ్యాటింగ్‌ను ఆస్వాదిస్తా అయితే, పరిస్థితులకు తగ్గట్టుగా ఆడాల్సిన అవసరమూ ఉంది. అంతేకానీ, ఇష్టమొచ్చినట్లు బ్యాటింగ్‌ చేయలేను’. రోహిత్ చెప్పుకొచ్చాడు.

    ‘కలలు కన్నా..కానీ ఇది ఊహించలేదు’

    టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కెరీర్‌ ప్రారంభింలో తాను ఇన్ని సెంచరీలు, పరుగులు చేస్తానని అనుకోలేదని చెప్పారు. ‘సుదీర్ఘ కెరీర్‌, ప్రదర్శనలతో ఇన్ని సాధిస్తానని అనుకోలేదు. బాగా ఆడాలని ఎప్పుడూ కలలు కన్నాను. అలాగే జరుగుతుందని ఊహించలేదు. 12 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో ఇన్ని సెంచరీలు, పరుగులు సాధిస్తానని అనుకోలేదు. క్లిష్ట పరిస్థితుల్లో విజయాలు అందించాలని భావించా. అందుకోసం కమ్రశిక్షణ, జీవనశైలికి సంబంధించి కొన్ని మార్పులు చేసుకున్నా’’ అని కోహ్లి చెప్పుకొచ్చాడు.

    నా కెరీర్ ముగిసిందనుకున్నారు: బుమ్రా

    టీమిండియా బౌలర్ బుమ్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రపంచకప్‌ ముందు చాలా కాలం జట్టుకు దూరమైయ్యానని తెలిపాడు. ‘ఆ సమయంలో ఇక తన కెరీర్‌ ముగిసినట్లేనని పలువురు భావించారు. నా భార్య స్పోర్ట్స్‌ మీడియాలో పనిచేస్తోంది. అందువల్ల.. నా కెరీర్‌పై వ్యక్తమైన అనేక అనుమానాలు నాకు తెలిశాయి. అయితే వాటిని నేను పట్టించుకోలేదు. గాయం నుంచి కోలుకుని తిరిగి వచ్చినప్పుడు నాకు జట్టులో మంచి అవకాశాలు లభించాయి. సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతున్నాను’ అని బుమ్రా చెప్పుకొచ్చాడు.

    ఇంగ్లాండ్ ఆటగాళ్లపై గంభీర్ విమర్శలు

    ఇంగ్లండ్‌ జట్టుపై టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ విమర్శల చేశారు. జట్టులో చాలా మంది ఆటగాళ్లు తమ పరువు కోసం ఆడుతున్నారని అభిప్రాయపడ్డారు. జో రూట్ అవుట్ అయిన తర్వాత చాలా చెత్త షాట్లు ఆడి వికెట్‌ను పారేసుకున్నారని తెలిపారు. శ్రీలంక మాత్రం అద్భుతంగా బౌలింగ్‌ చేసింది. అందుకే వారు విజయం సాధించారు” అని స్టార్‌ స్పోర్ట్స్‌ షోలో గంభీర్‌ పేర్కొన్నాడు.

    వరల్డ్‌కప్‌లో కోహ్లీ ఆహారం ఇదే..!

    ప్రపంచకప్‌లో విరాట్‌ కోహ్లీ ఆహార నియమాల గురించి ఆయన బస చేసిన హోటల్‌ చెఫ్‌ అనుష్మాన్‌ బాలి వెల్లడించాడు. విరాట్‌ శాఖాహారి కాబట్టి ఉడకబెట్టిన పదార్థాలను ఎక్కువగా తీసుకుంటున్నట్లు తెలిపారు. ‘విరాట్ ఆవిరితో ఉడికించిన ఆహార పదార్థాలు తీసుకుంటున్నారు. డిమ్‌ సమ్స్‌, సోయా, మాక్‌ మీట్‌, టోఫూ, లీన్‌ వంటి ప్రోటీన్‌ ఆధారిత ఆహారాన్ని ఫుడ్‌ మెనూగా ఎంచుకుంటున్నారు’ అని చెప్పారు. అటు చాలా మంది ఆటగాళ్లు అధిక ప్రోటీన్‌లు ఉన్న ఆహారాన్ని తీసుకుంటున్నట్లు బాలి వెల్లడించారు.

    కష్టాల్లో టీమిండియా మాజీ కోచ్‌

    టీమిండియా మాజీ కోచ్‌ గ్రెగ్‌ ఛాపెల్‌ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో ఆదుకునేందుకు ఆయన స్నేహితులు ముందుకు వచ్చారు. ఆన్‌లైన్‌లో విరాళాల సేకరణ చేపట్టారు. ఈ విషయాన్ని ఛాపెల్‌ స్వయంగా ధృవీకరించారు. మెల్‌బోర్న్‌ క్రికెట్ గ్రౌండ్‌లో సమావేశమైన ఛాపెల్‌ స్నేహితులు ‘గో ఫండ్‌ మీ’ ద్వారా విరాళల సేకరణ చేపట్టారు. ఇందుకు అయిష్టంగానే ఛాపెల్‌ అంగీకరించినట్లు సమాచారం. అయితే తాను ఆర్థికంగా అంత దారుణంగా ఏమీ దెబ్బతినలేదని ఛాపెల్‌ తెలిపారు.

    టీమిండియా కోచ్‌గా వీవీఎస్‌ లక్ష్మణ్‌!

    వరల్డ్‌కప్‌ తర్వాత ఆసీస్‌తో జరిగే టీ20 సిరీస్‌కు టీమ్‌ఇండియా కోచ్‌గా V.V.S లక్ష్మణ్‌ వ్యవహిరించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత కోచ్‌ ద్రవిడ్‌ పదవికాలం వరల్డ్‌కప్‌తో ముగియనుంది. నిబంధనల ప్రకారం చీఫ్‌ కోచ్‌ పదవి కోసం బీసీసీఐ దరఖాస్తుల్ని ఆహ్వానిస్తుంది. అయితే తీవ్ర ఒత్తిడితో కూడుకున్న చీఫ్‌ కోచ్‌ పదవికి 51 ఏళ్ల ద్రవిడ్ మళ్లీ దరఖాస్తు చేస్తారా? లేదా? అన్నది ప్రశ్నార్థకమే. ఈ నేపథ్యంలోనే లక్ష్మణ్‌ ఆసీస్‌తో సిరీస్‌కు కోచ్‌గా వ్యవహరించే ఛాన్స్ ఉన్నట్లు క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి.

    ప్రతిక్షణం మెరుగయ్యేందుకే యత్నిస్తా: కోహ్లీ

    ప్రతిక్షణం మరింత మెరుగయ్యేందుకు ప్రయత్నిస్తుంటానని భారత స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి అన్నాడు. అందుకోసం నిరంతరం శ్రమిస్తుంటానని తెలిపాడు. ‘ప్రదర్శన మాత్రమే లక్ష్యమైతే కొంతకాలం తర్వాత సంతృప్తి చెందొచ్చు. ఆటపై పనిచేయడం మానేయొచ్చు. కానీ నేను ఎప్పుడూ నైపుణ్యం మెరుగుపరుచుకోడానికే ప్రయత్నిస్తుంటా. దానికి హద్దు లేదన్నది నా నమ్మకం. కాబట్టే సుదీర్ఘ కాలం ఆడుతూ ఉత్తమ ప్రదర్శనలు ఇవ్వగలుగుతున్నా’ అని కోహ్లి పేర్కొన్నాడు. కాగా, ప్రస్తుత వరల్డ్‌కప్‌లో కోహ్లీ 118 సగటుతో 354 పరుగులు చేశాడు.