ఐపీఎల్ 17వ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) జట్టు తొలి విజయాన్ని నమోదు చేసింది. ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ముంబయిని 31పరుగుల తేడాతో ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ ఏకంగా 277/3 స్కోర్ చేసి ఐపీఎల్‌లో సహా ఇతర అంతర్జాతీయ టీ20 ఫార్మెట్స్‌లో అత్యధిక రన్స్ చేసిన జట్టుగా రికార్డ్ సృష్టించింది. భారీ హిట్టింగ్స్‌తో హైదరాబాద్ బ్యాటర్లు పరుగుల వరద పారిస్తున్న క్రమంలో ఆ జట్టు యజమాని ‘కావ్యా మారన్’ (Kavya Maran) ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఎప్పుడు గ్రౌండ్‌లో నిరాశగా కనిపించే ఆమె ముఖం నిన్నటి మ్యాచ్ సందర్భంగా నవ్వుతూ ఎంతో సంతోషంతో వెలిగిపోయింది. దీంతో ఆమెకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. వాటిపై ఓ లుక్కేద్దాం.
సన్‌రైజర్స్ జట్టును కావ్యా మారన్ (Kavya Maran) చప్పట్లు కొడుతూ చాలా సంతోషంగా ఎంకరేజ్ చేయడం ఈ వీడియోలో చూడవచ్చు.
మ్యాచ్ విన్నింగ్ అనంతరం కావ్య మారన్ సంతోషంతో ఎగిరి గంతేసిన విజువల్స్ కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈమెను ఇంత సంతోషంగా ఎప్పుడు చూడలేదని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
ముంబయి-సన్‌రైజర్స్ మ్యాచ్ సందర్భంగా కావ్యా మారన్‌పైనే కెమెరామెన్ ఫోకస్ ఎక్కువగా ఉంది. మ్యాచ్ జరుగుతున్న క్రమంలో తరచూ ఆమెనూ చూపించడం జరిగింది. ఓ అభిమాని వాటికి సంబంధించిన ఫొటోలు ట్విటర్‌లో షేర్ చేశాడు.
గతంలో కావ్యా మారన్ (Kavya Maran) పై రజనీకాంత్ (Rajinikanth) చేసిన వ్యాఖ్యలు కూడా ప్రస్తుతం ట్రెండింగ్‌లోకి వచ్చాయి. సన్‌రైజర్స్ జట్టు ఓడినప్పుడల్లా కావ్యా పడే బాధను తాను చూడలేకపోతున్నట్లు రజనీ వ్యాఖ్యానించాడు. ఈ సీజన్‌కైనా మంచి ప్లేయర్స్‌ను తీసుకోవాలని సూచించాడు.
ముంబయిపై గెలుపు అనంతరం కావ్యా మారన్ చేసిన వ్యాఖ్యలు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి. రెండు వరుస మ్యాచుల్లో తమ జట్టు 200లకు పైగా రన్స్ చేయడం చాలా సంతోషంగా ఉందని ఆమె చెప్పారు. ఈ వీడియోను కూడా సన్‌రైజర్స్ ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు.
వాస్తవానికి సన్‌రైజర్స్ అసలు ఓనర్ సన్ గ్రూప్ సంస్థల చైర్మన్ కళానిధి మారన్. అయితే కావ్య మారన్ ఆయన కూతురు కావడంతో పాటు క్రికెట్‌పై ఆసక్తి ఉండటంతో ఫ్రాంచైజీ బాధ్యతలను ఆమె దగ్గరుండి చూసుకుంటున్నారు.
ప్రతీ వేలంలో పాల్గొంటూ కీలక ఆటగాళ్ల కొనుగోళ్లలో ఆమె చాలా చురుగ్గా వ్యవహరిస్తున్నారు. గత కొద్ది సీజన్ల నుంచి సన్‌రైజర్స్ హైదరాబాద్ వరుసగా విఫలమవుతున్నప్పటికీ కావ్య నిరాశ చెందడం లేదు.
ప్రతీ సీజన్‌లో SRHకు అత్యుత్తమ ఆటగాళ్లను తీసుకొస్తూ బలమైన జట్టుగా తీర్చిదిద్దుతోంది. ఈ సారి ఆసీస్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్ రూ.20 కోట్లకు పైగా వెచ్చించి కొనుగోలు చేసింది. ప్రస్తుతం అతడే సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టును నడిపిస్తున్నాడు.
గత సీజన్లతో పోలిస్తే ఈసారి సన్‌రైజర్స్ బ్యాటింగ్ దుర్భేద్యంగా ఉంది. ట్రావిస్ హెడ్, మార్క్‌రమ్, హెన్‌రిచ్ క్లాసెన్, అభిషేక్ శర్మ, మయాంక్ అగర్వాల్‌తో చాలా బలంగా కనిపిస్తోంది. అటు ప్యాట్ కమ్మిన్స్, భువనేశ్వర్, జయదేవ్ ఉనాద్కట్, నటరాజ్, మయాంక్ మార్కండేతో బౌలింగ్ కూడా అదే స్థాయిలో స్ట్రాంగ్‌గా ఉంది.
సన్‌రైజర్స్ టీమ్‌ను ఇంత బలంగో గతంలో ఎప్పుడు చూడలేదని ఫ్యాన్స్ కూడా అంటున్నారు. మున్ముందు మ్యాచుల్లో బౌలర్లు పరుగులను కట్టడి చేయగల్గితే ఈ సారి సన్‌రైజర్స్ కప్ కూడా సాధించే అవకాశముందని కామెంట్స్ చేస్తున్నారు.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!