• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ప్రతిక్షణం మెరుగయ్యేందుకే యత్నిస్తా: కోహ్లీ

    ప్రతిక్షణం మరింత మెరుగయ్యేందుకు ప్రయత్నిస్తుంటానని భారత స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి అన్నాడు. అందుకోసం నిరంతరం శ్రమిస్తుంటానని తెలిపాడు. ‘ప్రదర్శన మాత్రమే లక్ష్యమైతే కొంతకాలం తర్వాత సంతృప్తి చెందొచ్చు. ఆటపై పనిచేయడం మానేయొచ్చు. కానీ నేను ఎప్పుడూ నైపుణ్యం మెరుగుపరుచుకోడానికే ప్రయత్నిస్తుంటా. దానికి హద్దు లేదన్నది నా నమ్మకం. కాబట్టే సుదీర్ఘ కాలం ఆడుతూ ఉత్తమ ప్రదర్శనలు ఇవ్వగలుగుతున్నా’ అని కోహ్లి పేర్కొన్నాడు. కాగా, ప్రస్తుత వరల్డ్‌కప్‌లో కోహ్లీ 118 సగటుతో 354 పరుగులు చేశాడు.

    రోహిత్ శర్మ అరుదైన ఘనత

    న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఓ అరుదైన ఘనతను నమోదు చేశాడు. కివీస్‌తో మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ .4 ఫోర్లు, 4 సిక్స్‌లు కొట్టాడు. ఈ క్రమంలో అంతర్జాతీయ వన్డేల్లో ఒక క్యాలెండర్ ఇయర్‌లో 50 లేదా అంతకంటే ఎక్కువ సిక్స్‌లు కొట్టిన ఆటగాడిగా రోహిత్ నిలిచాడు. రోహిత్‌ ఈ ఏడాదిలో ఇప్పటివరకు 53 సిక్స్‌లు కొట్టాడు. ఈ ఘనత సాధించిన జాబితాలో రోహిత్‌ మూడో స్ధానంలో నిలిచాడు. అతనికంటే ముందు ఏబీ డివిలియర్స్‌(58 సిక్స్‌లు) తొలి స్ధానంలో ఉండగా.. క్రిస్‌ … Read more

    కోహ్లీపై యువరాజ్ ప్రశంసలు

    టీమిండియా క్రికెటర్‌ కోహ్లీపై మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ప్రశంసలు కురిపించాడు. కివీస్‌తో మ్యాచ్‌లో కోహ్లీ అద్భత ఇన్నింగ్స్ ఆడాడంటూ కొనియాడాడు. ‘అతడు సంచరీ చేయకపోయినా అంతకంటే విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. తీవ్ర ఒత్తిడిని అధిగమించి ఇలాంటి ఆటతీరును ప్రదర్శించడం అద్భుతం అందుకే నువ్వు G.O.A.T (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైమ్) కోహ్లీతో పాటు రవీంద్ర జడేజా మంచి భాగస్వామ్యం అందించాడు. చివరి వరకు గ్రీజ్‌లో ఉండి జట్టును గెలిపించాడు. షమీ సూపర్ స్పెల్‌తో అదరగొట్టాడు’. అని యువీ చెప్పుకొచ్చాడు.

    హార్థిక్ స్థానంలో అతడే బెటర్: హర్భజన్

    బంగ్లాదేశ్‌ మ్యాచ్‌లో గాయం కారణంగా టీమిండియా ఆల్‌రౌండర్ హార్థిక్ పాండ్యా రేపటి మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో అతడి స్థానంలో ఎవరిని ఆడించాలన్న దానిపై బీసీసీఐకు తల నొప్పిగా మారింది. తాజాగా ఇదే విషయంలో భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. ధర్మశాలలో బంతి ఎక్కువ స్వింగ్ అయ్యే అవకాశం ఉంది. అందుకే ఫేసర్ మహ్మద్ షమీని జట్టులోకి తీసుకోవడం మంచిది. అదే విధంగా హార్థిక్ స్థానంలో సూర్యకుమార్‌కు అవకాశం ఇవ్వడం మంచిది’. అని హర్భజన్ సలహా ఇచ్చాడు.

    Virat Kohli: ప్రపంచ రికార్డుకు 2 సెంచరీల దూరంలో కింగ్‌ కోహ్లీ.. క్రికెట్‌లో అత్యధిక శతకాలు బాదింది వీరే!

    ప్రపంచకప్‌ 2023లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమ్‌ఇండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ అదరగొట్టాడు. సెంచరీతో ప్రత్యర్థి బౌలర్లను ఉతికారేశాడు. గురువారం (అక్టోబర్‌ 19) జరిగిన ఈ మ్యాచ్‌లో కోహ్లీ 97 బంతుల్లో 103 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ సెంచరీతో కోహ్లీ వన్డేల్లో తన 48వ శతకాన్ని నమోదు చేశాడు. సచిన్‌ పేరిట ఉన్న వన్డే శతకాల రికార్డు (49)కు కోహ్లీ మరింత చేరువయ్యాడు. ఇంకో రెండు సెంచరీలు చేస్తే విరాట్‌ వన్డేల్లో అత్యధిక శతకాలు బాదిన తొలి ఆటగాడిగా … Read more

    రోహిత్ అంత స్పీడు వెళ్లలేదు: హైవే పోలీసులు

    టీమిండిమా కెప్టెన్ రోహిత్ శర్మ ఓవర్ స్పీడుతో కారు నడిపాడని వస్తున్న వార్తలపై హైవే పోలీసులు స్పందించారు. రోహిత్ గంటకు 215 కి. మీ స్పీడుతో నడిపాడని వచ్చిన ప్రచారంలో నిజం లేదన్నారు. అతడు గంటకు 105 నుంచి 117 కి, మీ వేగంతోనే ప్రయాణించాడని తెలిపారు. దీంతో రోహిత్‌కు రూ.2000 చెప్పున రెండు సార్లు ఫైన్ విధించామని పేర్కొన్నారు. ఈ మొత్తాన్ని రోహిత్ చెల్లించాడని చెప్పారు. హైవేపై కేవలం 100 కి, మీ వేగంతోనే ప్రయాణించాలని పోలీసులు వివరించారు.

    పాక్ మాజీ కెప్టెన్ ఇంట్లో విషాదం

    పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది ఇంట్రో తీవ్ర విషాదం నెలకొంది. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోదరి ఆసుపత్రిలో చికిత్స పొందుతు తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్నిఅఫ్రిది సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ‘మా సోదరి మమ్మల్ని విడిచి దేవుడి దగ్గరకు వెళ్లిపోయింది. ఈ విషయాన్ని బరువెక్కిన హృదయాలతో తెలియజేస్తున్నాము. ఆమె అంత్యక్రియలు ఇవాళ జరుగుతాయి’. అని అఫ్రిది ట్వీట్ చేశారు.

    భారత్‌ను ఓడించడం కష్టమే: రికీ పాంటింగ్

    ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వరల్డ్ కప్‌లో భారత్‌ను ఓడించడం చాలా కష్టమని తెలిపారు. ‘బౌలింగ్, బ్యాటింగ్ అన్ని విభాగాల్లోనూ టీమిండియా పటిష్టంగా ఉంది. ఫాస్ట్, స్పిన్ బౌలింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక టాప్ మిడిలార్డర్ బ్యాటింగ్ బలంగా ఉంది. అందుకే భారత్‌ను ఎదుర్కోవడం కత్తిమీద సామే.. అయితే ఒత్తిడిని తట్టుకుని భారత్ ఇదే ఊపును ఎలా కొనసాగిస్తుందో చూడాలి’ అని పాంటింగ్ చెప్పుకొచ్చారు. రోహిత్ ఆడుతున్న తీరు చూస్తుంటే అతడు ఎంత బలంగా మారాడో అర్థమైపోతుందని … Read more

    టీమిండియా చరిత్ర తిరగరాస్తోంది: అక్తర్

    పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ టీమిండియాపై ప్రశంసలు కురిపించాడు. 2011 ప్రపంచకప్ చరిత్రను భారత్ తిరగ రాస్తుందన్నాడు. ‘2023 వన్డే వరల్డ్ కప్‌లో టీమిండియా సరైన మార్గంలో పయనిస్తోంది. వారు సెమీఫైన‌ల్లో తడబడకపోతే భారత్ నిజంగా వరల్డ్ కప్‌ గెలుస్తోంది. టీమిండియా అద్భతంగా ఆడుతోంది. పాక్‌ది చాలా నిరుత్సాహపరిచే ప్రదర్శన భారత్ పాక్‌ను పూర్తిగా చిత్తు చేసింది’ అని అక్తర్ పేర్కొన్నాడు.

    వారితో అలా ప్రవర్తించకండి: గంభీర్

    వన్డే ప్రపంచకప్‌లో భాగంగా నేడు భారత్ – పాకిస్థాన్‌ మ్యాచ్ జరుగుతోంది. నరేంద్ర మోదీ స్టేడియంలో మ్యాచ్‌ను వీక్షించేందుకు భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. ఈ క్రమంలో మ్యాచ్‌ సందర్భంగా టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్‌ కీలక సూచనలు చేశాడు. భారత అభిమానులు ఎవరూ ప్రత్యర్థి పాక్‌ను అసభ్యకర రీతిలో వ్యాఖ్యలు చేయొద్దని కోరాడు. అతిథిగా వచ్చినవారి పట్ల గౌరవభావం చూపించాలని తెలిపారు.