• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పాక్ మాజీ కెప్టెన్ ఇంట్లో విషాదం

    పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది ఇంట్రో తీవ్ర విషాదం నెలకొంది. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోదరి ఆసుపత్రిలో చికిత్స పొందుతు తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్నిఅఫ్రిది సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ‘మా సోదరి మమ్మల్ని విడిచి దేవుడి దగ్గరకు వెళ్లిపోయింది. ఈ విషయాన్ని బరువెక్కిన హృదయాలతో తెలియజేస్తున్నాము. ఆమె అంత్యక్రియలు ఇవాళ జరుగుతాయి’. అని అఫ్రిది ట్వీట్ చేశారు.

    భారత్‌ను ఓడించడం కష్టమే: రికీ పాంటింగ్

    ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వరల్డ్ కప్‌లో భారత్‌ను ఓడించడం చాలా కష్టమని తెలిపారు. ‘బౌలింగ్, బ్యాటింగ్ అన్ని విభాగాల్లోనూ టీమిండియా పటిష్టంగా ఉంది. ఫాస్ట్, స్పిన్ బౌలింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక టాప్ మిడిలార్డర్ బ్యాటింగ్ బలంగా ఉంది. అందుకే భారత్‌ను ఎదుర్కోవడం కత్తిమీద సామే.. అయితే ఒత్తిడిని తట్టుకుని భారత్ ఇదే ఊపును ఎలా కొనసాగిస్తుందో చూడాలి’ అని పాంటింగ్ చెప్పుకొచ్చారు. రోహిత్ ఆడుతున్న తీరు చూస్తుంటే అతడు ఎంత బలంగా మారాడో అర్థమైపోతుందని … Read more

    టీమిండియా చరిత్ర తిరగరాస్తోంది: అక్తర్

    పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ టీమిండియాపై ప్రశంసలు కురిపించాడు. 2011 ప్రపంచకప్ చరిత్రను భారత్ తిరగ రాస్తుందన్నాడు. ‘2023 వన్డే వరల్డ్ కప్‌లో టీమిండియా సరైన మార్గంలో పయనిస్తోంది. వారు సెమీఫైన‌ల్లో తడబడకపోతే భారత్ నిజంగా వరల్డ్ కప్‌ గెలుస్తోంది. టీమిండియా అద్భతంగా ఆడుతోంది. పాక్‌ది చాలా నిరుత్సాహపరిచే ప్రదర్శన భారత్ పాక్‌ను పూర్తిగా చిత్తు చేసింది’ అని అక్తర్ పేర్కొన్నాడు.

    వారితో అలా ప్రవర్తించకండి: గంభీర్

    వన్డే ప్రపంచకప్‌లో భాగంగా నేడు భారత్ – పాకిస్థాన్‌ మ్యాచ్ జరుగుతోంది. నరేంద్ర మోదీ స్టేడియంలో మ్యాచ్‌ను వీక్షించేందుకు భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. ఈ క్రమంలో మ్యాచ్‌ సందర్భంగా టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్‌ కీలక సూచనలు చేశాడు. భారత అభిమానులు ఎవరూ ప్రత్యర్థి పాక్‌ను అసభ్యకర రీతిలో వ్యాఖ్యలు చేయొద్దని కోరాడు. అతిథిగా వచ్చినవారి పట్ల గౌరవభావం చూపించాలని తెలిపారు.

    సన్నద్ధతపైనే నా దృష్టి: బుమ్రా

    రేపు భారత్ – పాకిస్థాన్‌ మ్యాచ్‌ జరగనుంది. ఇప్పటికే ఇరు జట్లు ప్రాక్టీస్‌ను మొదలుపెట్టేశాయి. ఈ నేపథ్యంలో భారత బౌలర్ బుమ్రా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ..’ ఏ మ్యాచ్‌కు ముందు అయినా సరే బయట ఏం జరుగుతుందనేది పట్టించుకోను నా సన్నద్ధత ఎలా ఉందనేదానిపై దృష్టిసారిస్తా. నా నైపుణ్యాలను మరింత మెరుగుపర్చుకోవడానికి ఏం చేయాలనే దానిపై కసరత్తు చేస్తా. దిల్లీ పిచ్‌ బ్యాటింగ్‌కు సహకారం ఇస్తుంది. అయితే, కాస్త స్వింగ్‌ రావడంతో దానిని ఉపయోగించుకొని వికెట్లను తీయగలిగాం’ అని బుమ్రా చెప్పుకొచ్చాడు.

    రోహిత్ డేంజర్‌ బ్యాటర్‌: మాజీ క్రికెటర్

    టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా రోహిత్ శర్మపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వన్డే క్రికెట్‌లో అత్యుత్తమ ఆటగాళ్లలో రోహిత్ శర్మ ఒకడని కొనియాడారు. 50 ఓవర్ల ఫార్మాట్‌లో హిట్‌మ్యాన్‌ ఎన్నో ఘనతలు సాధించినా అతనికి తగిన గుర్తింపు దక్కడం లేదన్నారు. ‘రోహిత్ శర్మ ప్రపంచ కప్‌లో ఏడు సెంచరీలు సాధించాడు. అతను సిక్సర్లను చాలా అలవోకగా బాదతాడు. అతడికి మనం తగినంత గుర్తింపు ఇవ్వకపోవడం దురదృష్టకరం. రోహిత్ శర్మ వన్డేల్లో డేంజర్‌ బ్యాటర్‌’ అని చోప్రా పేర్కొన్నాడు.

    క్రికెటర్ రషీద్ ఖాన్ మంచి మనసు

    ఆఫ్గానిస్థాన్ స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్ మంచి మనసు చాటుకున్నాడు. ఆఫ్గాన్ భూకంప బాధితులకు తన వన్డే వరల్డ్ కప్ మ్యాచ్ ఫీజును విరాళంగా ప్రకటించాడు. రషీద్ మాట్లాడుతూ.. ‘ఆఫ్ఘనిస్తాన్‌లోని హెరాత్, ఫరా, బాద్గీస్‌ ప్రాంతాల్లో సంభవించిన భూకంపం తీవ్రవిషాదం మిగిల్చింది. తాను ప్రపంచ కప్ 2023 కోసం మొత్తం ఫీజును కష్టాల్లో ఉన్న ప్రజలకు విరాళంగా ఇస్తున్నాను. భూకంపంలో దాదాపు 2400 పైగా మృతి చెందడం బాధను కలిగించింది’. అని రషీద్ పేర్కొన్నాడు.

    ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన గిల్

    డెంగీ జ్వరంతో బాధపడుతున్న టీమిండియా బ్యాటర్ శుభ్‌మన్ కొలుకున్నాడు. తాజాగా అతడు ఆస్పత్రి నుంచి కూడా డిశ్చార్జి అయ్యాడు. ఈ నేపథ్యంలో రేపు ఆఫ్గానిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో గిల్ అందుబాటులో ఉండటం లేదు. ఆఫ్గన్‌తో మ్యాచ్ కోసం అతడు ఢిల్లీ వెళ్లలేదని బీసీసీఐ పేర్కొంది. గిల్ ఆరోగ్య పరిస్థితిని బీసీసీఐ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. అక్టోబర్ 14 భారత్, పాక్ మ్యాచ్‌కు కూడా గిల్ దూరమయ్యే అవకాశాలున్నాయి తెలుస్తోంది.

    Shikhar Dhawan Divorce: పాపం ధావన్.. భార్య వేధింపులు తట్టుకోలేకే విడాకులు.. ఏమైందంటే?

    టీమిండియా సీనియర్‌ క్రికెటర్ శిఖర్ ధావన్‌ (Shikhar Dhawan)కు విడాకులు మంజూరు అయ్యాయి. ధావన్‌, అతడి మాజీ భార్య ఆయేషా ముఖర్జీ (Ayesha Mukherjee)కి ఢిల్లీ కోర్టు బుధవారం (సెప్టెంబర్‌ 5) విడాకులు మంజూరు చేసింది. ఆయేషా ముఖర్జీ కారణంగా ధావన్‌ మానసిక వేదనకు గురయ్యాడని ఢిల్లీలోని పాటియాలా హౌస్‌ కాంప్లెక్స్‌లోని ఫ్యామిలీ కోర్టు నిర్ధారించింది. ఈ మేరకు కోర్టు వారి విడాకులను ఆమోదించింది. ఇక తన కుమారుడిని కలవడానికి ధావన్‌కు కోర్టు అనుమతి ఇచ్చింది. గత రెండేళ్లుగా ఆయేషా ముఖర్జీకి శిఖర్ ధావన్‌ … Read more

    World Cup: వన్డే ప్రపంచకప్‌లో భారత ప్లేయర్ల రికార్డులు.. ఓ లుక్కేయండి!

    క్రికెట్‌ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వన్డే ప్రపంచకప్‌ గురువారం ప్రారంభం కానుంది.  అక్టోబర్ 5న ప్రారంభంకానున్న ఈ మెగా టోర్నీ నవంబర్‌ 19 వరకు 46 రోజుల పాటు సాగనుంది. 2020-2023 వరల్డ్‌ కప్‌ సూపర్‌ లీగ్‌లో తొలి ఎనిమిది స్థానాల్లో నిలిచిన భారత్‌, ఆస్ట్రేలియా, అఫ్గానిస్థాన్‌, ఇంగ్లాండ్‌, బంగ్లాదేశ్, న్యూజిలాండ్‌, పాకిస్థాన్‌, దక్షిణాఫ్రికా నేరుగా వన్డే ప్రపంచకప్‌నకు అర్హత సాధించాయి. క్వాలిఫయింగ్‌ పోటీల్లో సత్తా చాటిన శ్రీలంక, నెదర్లాండ్స్‌ ఈ మహా సమరంలో చేరాయి. ఇదిలా ఉంటే ఇప్పటివరకూ జరిగిన వన్డే … Read more