• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అనుకున్నదేదీ వెంటనే జరిగిపోదు: రోహిత్ శర్మ

    భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ ఓ ఆంగ్ల వెబ్‌సైట్ ఇంటర్య్వూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తనకు కెప్టెన్‌ అవకాశం 26 లేదా 27 ఏళ్ల వయసులో వచ్చి ఉంటే బాగుండేదన్నారు. ‘జీవితంలో అనుకున్నదేది వెంటనే జరిగిపోదు. జట్టులో చాలా మంది విన్నర్లుగా ఉన్నా వారి కెప్టెన్సీ అవకాశం అందలేదు. గతంలో గౌతమ్ గంభీర్, సెహ్వాగ్, యువరాజ్ సింగ్ లాంటి స్టార్లు ఆడారు. కానీ వారు ఎప్పుడూ కెప్టెన్సీ చేపట్టలేదు. ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది. అదెంతో ఆనందంగా ఉంది’ అని రోహిత్ చెప్పుకొచ్చాడు.

    అతడి బౌలింగ్ కఠినమైనది: రోహిత్

    దక్షిణాఫ్రికాకు చెందిన డేల్‌ స్టెయిన్‌ బౌలింగ్‌ కఠినమైనదని రోహిత్ అన్నాడు. అతడి బౌలింగ్‌ సవాల్‌ విసురుతుందని తెలిపాడు. ‘నాకు ఏ బౌలరైనా సవాల్‌ విసిరాడంటే అది డేల్‌ స్టెయిన్‌ మాత్రమే. అతడి బౌలింగ్‌ నైపుణ్యాలు అద్భుతం. ]ఫాస్ట్‌ బౌలింగ్‌లో స్వింగ్‌ చేయగల సమర్థుడు. వేగంతో బంతిని విసిరి కూడా స్వింగ్‌ రాబట్టగల అతికొద్దీమంది బౌలర్లలో స్టెయిన్‌ ఉంటాడు. నిలకడగా అదే స్పీడ్‌తో బంతులను సంధిస్తాడు’’ అని రోహిత్ చెప్పుకొచ్చాడు.

    గిల్‌పై యువరాజ్ ప్రశంసలు

    శుభ్‌మన్ గిల్‌పై మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ప్రశంసలు కురిపించాడు. ఈ తరం అత్యుత్తమ ఆడగాడు గిల్ అని కొనియాడాడు. ‘అతడి సత్తాను బ్యాటింగ్ గణాంకాలే చెబుతాయి. గిల్ ఆటతీరు ,చూస్తుంటే ముచ్చటేస్తుంది. గత నాలుగైదు ఏళ్లుగా అతడి ఆలోచనా దృక్పథం అత్యున్నత స్థాయిలో ఉంది. గిల్ కేవలం భారత్‌లోనే కాకుండా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ వంటి మైదానాల్లో భారీగా పరుగులు చేయగలడు’ అని యువీ తెలిపాడు.

    శ్రీవారి సేవలో గంభీర్ దంపతులు

    మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ దంపతులు తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్నారు. సుప్రభాత సేవలో పాల్గొన్న గంభీర్‌కు పూజర్లు స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరల్డ్‌కప్‌లో భారత్ అద్భుత ప్రదర్శన చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈసారి భారత్ ప్రపంచకప్ తప్పకుండా గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. https://x.com/PTI_News/status/1707226914069340552?s=20

    KL Rahul & Athiya Shetty: మా ఆయన బంగారం.. రాహుల్‌ భార్య క్రేజీ పోస్టు.!

    ఆసియా కప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన సూపర్‌-4 మ్యాచ్‌లో టీమ్‌ఇండియా ఘన విజయం సాధించింది. కే.ఎల్‌ రాహుల్‌ (KL Rahul) తన కమ్‌బ్యాక్‌ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగాడు. 111 పరుగులతో నాటౌట్‌గా నిలిచి తన సత్తా ఏంటో మరోమారు నిరూపించుకున్నాడు. దీనిపై అతడి భార్య అతియా శెట్టి ప్రశంసలు కురిపించింది.  అతియా తన ఇన్‌స్టాగ్రామ్‌లో రాహుల్‌ను అభినందిస్తూ ఆసక్తిక పోస్టు పెట్టింది. ‘చీకటి కూడా రాత్రి వరకు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత ముగుస్తుంది. సూర్యుడు తప్పకుండా మళ్లీ ఉదయిస్తాడు. మీరే నాకు సర్వస్వం, … Read more

    MSD And Trump: ధోనికి డొనాల్డ్‌ ట్రంప్‌ నుంచి ఆహ్వానం.. అసలు ఏం జరిగిందంటే?

    టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్ ఎం.ఎస్.ధోనీ (M.S. Dhoni) ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్నారు. యూఎస్ ఓపెన్‌ (US Open)లో సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో ప్రపంచ నెంబర్ వన్ ప్లేయర్ కార్లోస్ అల్కరాజ్ (Carlos Alcaraz), అలెగ్జాండర్ జ్వెరెవ్ మధ్య జరిగిన మ్యాచ్ వీక్షించిన ధోనీ.. మరుసటి రోజు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో కనిపించాడు. ట్రంప్‌తో కలిసి బెడ్‌మిన్‌స్టర్‌లోని ట్రంప్ నేషనల్ గోల్ఫ్ క్లబ్‌లో  ధోనీ గోల్ఫ్ ఆడాడు. గోల్ఫ్ ఆడేందుకు ధోనిని స్వయంగా ఆహ్వానించిన ట్రంప్.. ఆ తర్వాత అతిథ్యం సైతం ఇచ్చారు. … Read more

    Shubman Gill: తెలుగు హీరోయిన్‌కు డేటింగ్ ఆఫర్ చేసిన శుభమన్ గిల్… హీరోయిన్ రియాక్షన్ ఇదే!

    క్రికెట్‌కు సినిమాకు మనదేశంలో అవినావభావ సంబంధం ఉందన్న సంగతి చాలా మందికి తెలిసిందే. ముఖ్యంగా క్రికెటర్లకు సినిమా హీరోయిన్లకు వీడదీయరాని బంధం ఉందని చెప్పవచ్చు. వీరి గురించి ఎప్పుడూ ఏదొక గాసిప్ ప్రచారంలో ఉంటూనే ఉంటుంది. రీసెంట్‌గా టీమిండియా క్రికెటర్ శుభమన్ గిల్ ఓ పంజాబీ టీవీ షోలో పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో నటి సోనమ్ బజ్వా, గిల్‌ పరస్పరం పలు ప్రశ్నలు సంధించుకున్నారు. ఈ క్రమంలో శుభమన్ గిల్.. సోనమ్ బజ్వాను ఎప్పుడైన క్రికెటర్లతో డేటింగ్ చేశారా? అని సరదాగా ప్రశ్నించాడు. దీంతో … Read more

    మందు కొడుతున్న ధోనీ: వీడియో వైరల్

    భారత క్రికెట్ దిగ్గజం మహేంద్రసింగ్ ధోనికి సంబంధించిన ఓ పాత వీడియో ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోలో ధోని తన స్నేహితులతో కలసి మద్యం తాగుతుండడం విశేషం. ధోని కెరీర్ ఆరంభంలో ఈ వీడియో తీసినట్లుగా కనిపిస్తోంది. ఈ వీడియోలో మద్యం తాగుతూ.. ఫోన్ మాట్లాడుతూ ధోని కనిపించాడు. తన స్నేహితులు కూడా వైన్ సేవిస్తున్నారు. ఓ చిన్న గదిలో కింద కూర్చుని సాదాసీదాగా మహీ ఉన్నాడు. ఇది ఎక్కడ జరిగిందనేది క్లారిటీ లేదు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. … Read more

    కోహ్లీ నుంచి చాలా నేర్చుకున్నా: బాబర్‌

    గతంలో విరాట్ కోహ్లీ తనను ప్రశంసిస్తూ చేసిన కామెంట్లపై బాబర్ అజామ్‌ తాజాగా స్పందించాడు. ఆ వీడియోను స్టార్‌ స్పోర్ట్స్‌ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది. ‘ఎవరి దగ్గరి నుంచైనా పాజిటివ్‌ కామెంట్లు వస్తే చాలా ఆనందంగా ఉంటుంది. ఇక ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాటర్‌ విరాట్ కోహ్లీ నుంచి ఇలాంటివి లభిస్తే మాత్రం ఎంతో గర్వకారణంగా ఉంటుంది. కోహ్లీ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నా. కెరీర్‌లో అవి చాలా ఉపయోగపడ్డాయి. 2019లో కోహ్లీని తొలిసారి కలిసినప్పుడు అతడి మాటతీరు ఆకట్టుకుంది’ అని బాబర్‌ … Read more

    చరిత్ర సృష్టించిన నీరజ్‌ చోప్రా

    భారత జావెలిన్‌ త్రో అథ్లెట్‌ నీరజ్‌ చోప్రా రికార్డు సృష్టించాడు. ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్స్‌ ఫైనల్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చి బంగారు పతకం సాధించాడు. హంగేరిలోని బుడాపెస్ట్‌ వేదికగా జరిగిన ఫైనల్స్‌లో జావెలిన్‌ను 88.17 మీటర్లు విసిరి అదరగొట్టాడు. దీంతో ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్స్‌ స్వర్ణ పతకం సాధించిన తొలి భారతీయ ఆటగాడిగా నీరజ్‌ చరిత్ర సృష్టించాడు. పాక్‌ క్రీడాకారుడు అర్షద్‌ నదీమ్‌ 87.82 మీటర్లు విసిరి రజతం అందుకోగా చెక్‌ రిపబ్లిక్‌కు చెందిన జాకబ్‌ వడ్లెచ్‌ 86.67 మీటర్ల విసిరి కాంస్యం గెలుచుకున్నాడు. … Read more