టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్ ఎం.ఎస్.ధోనీ (M.S. Dhoni) ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్నారు. యూఎస్ ఓపెన్ (US Open)లో సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో ప్రపంచ నెంబర్ వన్ ప్లేయర్ కార్లోస్ అల్కరాజ్ (Carlos Alcaraz), అలెగ్జాండర్ జ్వెరెవ్ మధ్య జరిగిన మ్యాచ్ వీక్షించిన ధోనీ.. మరుసటి రోజు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో కనిపించాడు. ట్రంప్‌తో కలిసి బెడ్‌మిన్‌స్టర్‌లోని ట్రంప్ నేషనల్ గోల్ఫ్ క్లబ్‌లో ధోనీ గోల్ఫ్ ఆడాడు. గోల్ఫ్ ఆడేందుకు ధోనిని స్వయంగా ఆహ్వానించిన ట్రంప్.. ఆ తర్వాత అతిథ్యం సైతం ఇచ్చారు. దీంతో ఎం.ఎస్.ధోనీ, డొనాల్డ్ ట్రంప్ గోల్ఫ్ ఆడుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఎక్కడున్నా ధోని కింగే..!
ధోనీ కోసం ట్రంప్ ప్రత్యేకంగా గోల్ఫ్ గేమ్ ఏర్పాటు చేసినట్లు కొన్ని మీడియా కథనాలు పేర్కొన్నాయి. దుబాయి వ్యాపారవేత్త, ధోనీ స్నేహితుడు హితేశ్ సంఘ్వీ తొలుత ఓ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. కొద్దిసేపటికే ట్రంప్‌తో ధోనీ గోల్ఫ్ ఆడుతున్న వీడియో ఒకటి బయటికొచ్చింది. ఇందులో ధోనీ, ట్రంప్ ఇద్దరూ కలిసి గోల్ప్ ఆడుతున్నట్లు చూడొచ్చు. ధోనీ బ్లూ టీషర్ట్ వేసుకొని ఉండగా, ట్రంప్ వైట్ టీషర్ట్ ధరించి గోల్ఫ్ ఆడుతూ కనిపించారు. ఈ వీడియో చూసిన ధోనీ అభిమానులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ రీ పోస్టులు చేస్తున్నారు. ధోనీ ఎక్కడున్నా కింగే అంటూ కొందరు నెటిజన్లు పేర్కొనగా.. తలైవా నువ్వు సూపర్ అంటూ మరికొందరు నెటిజన్లు రాశారు.
ధోనితో ట్రంప్ ముచ్చట్లు
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు కూడా మహీ అంటే ఇష్టమేనట. అందుకే ధోనీ అమెరికాలోనే ఉన్నాడని తెలుసుకుని అతడిని ప్రత్యేకంగా ఆహ్వానించినట్లు తెలుస్తోంది. అయితే ధోనీ కోసం ట్రంప్ ప్రత్యేకంగా ఈ గోల్ఫ్ గేమ్ ఏర్పాటు చేసినట్లు కొన్ని మీడియా కథనాలు పేర్కొన్నాయి. ధోనితో కలిసి గోల్ఫ్ ఆడిన తర్వాత ట్రంప్ కొద్దిసేపు కెప్టెన్ కూల్‌తో ముచ్చటించినట్లు తెలుస్తోంది. క్రికెట్ సంబంధించిన సమాచారం అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆ ఫొటోలు కూడా నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నాయి.
ఫ్యాన్స్‌కు పండగే..!
అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ధోనీ ప్రస్తుతం కెరీర్లో ఐపీఎల్ మాత్రమే ఆడుతున్న అందరికీ సంగతి తెలిసిందే. ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ సారథిగా కొనసాగుతున్న ఆయన ఐపీఎల్-2023లో ఆ జట్టును విజేతగా నిలిపాడు. మ్యాచ్ సమయంలోనే మోకాలి గాయంతో బాధపడ్డ ధోనీ ఆ తర్వాత శస్త్రచికిత్స చేయించుకుని కోలుకున్నాడు. ప్రస్తుతం తన కుటుంబం, స్నేహితులతో సమయాన్ని గడుపుతూ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఐపీఎల్-2024 సీజన్‌లోనూ ధోని CSK తరపున బరిలోకి దిగనున్నట్లు తెలిసింది. అదే జరిగితే MSD ఫ్యాన్స్‌కు పండగే అని చెప్పవచ్చు.
Celebrities Featured Articles Hot Actress
Arrchita Agarwaal: శరీరం అలా ఉంటేనే ఇండస్ట్రీలోకి రావాలి: బాలీవుడ్ నటి