• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • Maldives Row: మాల్దీవులు VS లక్షద్వీప్‌ వివాదం.. రంగంలోకి బాలీవుడ్‌ ప్రముఖులు!

  ప్రధాని మోదీ లక్షద్వీప్‌లో పర్యటించడంపై కొంతమంది మాల్దీవుల (Maldives Row) నేతలు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. భారత్‌కు వ్యతిరేకంగా మాల్దీవుల మంత్రులు చేసిన కామెంట్లను సినీ, క్రీడా రంగ ప్రముఖులు ఖండిస్తున్నారు.  భారత్‌లోనూ మాల్దీవులకు మించిన ఎన్నో అందమైన పర్యాటక ప్రదేశాలు ఉన్నాయని, మన పర్యాటక రంగానికి మద్దతు తెలపాల్సిన అవసరం ఏర్పడిందని సోషల్‌ మీడియా వేదికగా పిలుపునిస్తున్నారు ఈ క్రమంలోనే టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎం.ఎస్‌. ధోని భారత పర్యాటకంపై మాట్లాడిన ఓ పాత వీడియో తాజాగా వైరల్ అవుతోంది. … Read more

  మనకు మంచే జరుగుతుంది: ధోని

  వరల్డ్‌కప్‌లో టీమిండియా ప్రదర్శనపై మాజీ కెప్టెన్‌ ఎం.ఎస్‌ ధోని తొలిసారి స్పందించాడు. ‘ఇప్పుడు వరల్డ్‌ కప్‌లో ఆడుతున్న టీమ్‌ఇండియా బాగుంది. అన్ని విభాగాలూ సమతూకంగా, పటిష్ఠంగా ఉన్నాయి. ఆటగాళ్లు కూడా అద్భుతంగా రాణిస్తున్నారు. ప్రతి మ్యాచ్‌నూ గెలుచుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇంతకంటే నేను ఎక్కువగా చెప్పను. కచ్చితంగా మనకు శుభం జరుగుతుందనే నమ్మకం ఉంది. 2019లో కొద్దిలో ఓడిపోయి సెమీస్‌లోనే ఇంటిముఖం పట్టడం బాధించింది’ అని అన్నాడు.

  World Cup: వన్డే ప్రపంచకప్‌లో భారత ప్లేయర్ల రికార్డులు.. ఓ లుక్కేయండి!

  క్రికెట్‌ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వన్డే ప్రపంచకప్‌ గురువారం ప్రారంభం కానుంది.  అక్టోబర్ 5న ప్రారంభంకానున్న ఈ మెగా టోర్నీ నవంబర్‌ 19 వరకు 46 రోజుల పాటు సాగనుంది. 2020-2023 వరల్డ్‌ కప్‌ సూపర్‌ లీగ్‌లో తొలి ఎనిమిది స్థానాల్లో నిలిచిన భారత్‌, ఆస్ట్రేలియా, అఫ్గానిస్థాన్‌, ఇంగ్లాండ్‌, బంగ్లాదేశ్, న్యూజిలాండ్‌, పాకిస్థాన్‌, దక్షిణాఫ్రికా నేరుగా వన్డే ప్రపంచకప్‌నకు అర్హత సాధించాయి. క్వాలిఫయింగ్‌ పోటీల్లో సత్తా చాటిన శ్రీలంక, నెదర్లాండ్స్‌ ఈ మహా సమరంలో చేరాయి. ఇదిలా ఉంటే ఇప్పటివరకూ జరిగిన వన్డే … Read more

  MSD And Trump: ధోనికి డొనాల్డ్‌ ట్రంప్‌ నుంచి ఆహ్వానం.. అసలు ఏం జరిగిందంటే?

  టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్ ఎం.ఎస్.ధోనీ (M.S. Dhoni) ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్నారు. యూఎస్ ఓపెన్‌ (US Open)లో సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో ప్రపంచ నెంబర్ వన్ ప్లేయర్ కార్లోస్ అల్కరాజ్ (Carlos Alcaraz), అలెగ్జాండర్ జ్వెరెవ్ మధ్య జరిగిన మ్యాచ్ వీక్షించిన ధోనీ.. మరుసటి రోజు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో కనిపించాడు. ట్రంప్‌తో కలిసి బెడ్‌మిన్‌స్టర్‌లోని ట్రంప్ నేషనల్ గోల్ఫ్ క్లబ్‌లో  ధోనీ గోల్ఫ్ ఆడాడు. గోల్ఫ్ ఆడేందుకు ధోనిని స్వయంగా ఆహ్వానించిన ట్రంప్.. ఆ తర్వాత అతిథ్యం సైతం ఇచ్చారు. … Read more

  బైక్‌పై ధోని రైడ్‌.. వీడియో వైరల్

  క్రికెట‌ర్ ఎం.ఎస్ ధోనీ.. రాంచీలో రైడింగ్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇటీవ‌ల వింటేజ్ కార్ల‌లో తిరుగుతున్న‌ట్లు క‌నిపించిన అత‌డు.. తాజాగా హోండా రెప్సాల్ 150 మోట‌ర్ బైక్‌లో రైడింగ్ చేశాడు. త‌న ఇంటి వ‌ద్దకు చేరుకున్న స‌మ‌యంలో ఓ అభిమాని త‌న మొబైల్ ఫోన్‌తో వీడియో షూట్ చేశాడు. ఓ ఫోటో దిగేందుకు ఛాన్స్ ఇవ్వాలంటూ అభిమానులు వేడుకున్నారు. కానీ ధోనీ త‌న బైక్‌తో ఇంట్లోకి వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అయితే రాంచీలో ఉన్న ఫామ్‌హౌజ్‌లో ధోనీకి చాలా బైక్‌లు … Read more

  బైకర్స్‌ను అడ్రస్‌ అడిగిన ధోని

  మహేంద్ర సింగ్ ధోని తన స్నేహితుడితో కలిసి రాంచీ వెళ్తూ ఓ వ్యక్తిని అడ్రస్‌ అడిగాడు. అతడి ఫ్రెండ్ వాహనం నడుపుతుండగా మహీ ముందు సీట్లో కూర్చొని ఉన్నాడు. తాను వెళ్లాల్సిన మార్గం గురించి బైకర్స్‌ను అడిగి తెలుసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అడ్రస్‌ తెలుసుకున్న అనంతరం ధోని భైకర్స్‌కు సెల్ఫీ ఇచ్చాడు. ఆపై కరచాలనం చేసి అక్కడ్నుంచి వెళ్లిపోయాడు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ధోనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ధోని సింప్లిసిటీని మెచ్చుకుంటున్నారు. This man is so … Read more

  1980 మోడల్‌ కారుతో ధోని చక్కర్లు

  టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనికి కార్లు, బైక్‌లు అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాజాగా ధోనీ 1980 మోడల్‌ బ్లూ కలర్ రోల్స్ రాయిస్‌ కారులో రాంచీ రోడ్లపై ప్రయాణించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 43 ఏళ్ల క్రితంనాటి కారును ధోని స్వయంగా డ్రైవ్‌ చేస్తూ వెళ్లాడు. పక్క సీట్లో కూతురు జీవా కూర్చుని ఉంది. ఈ వీడియాపై నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. ధోని స్టైలే వేరు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. https://www.instagram.com/reel/CvHTnFeJxpu/?utm_source=ig_embed&ig_rid=8dd9f46c-e554-4356-8ed9-a8434dcdf446

  ఆసక్తిగా ధోనీ ‘LGM’ ట్రైలర్

  భారత క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ నిర్మిస్తోన్న ‘LGM’ (లెట్స్ గెట్ మ్యారీడ్) మూవీ ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్ వేడుకను చెన్నైలో గ్రాండ్‌గా జరిపారు. ఈ ఈవెంట్‌లో ధోనీ, ఆయన సతీమణి సాక్షి మెరిశారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటోంది. ట్రైలర్‌ను బట్టి చూస్తే ఈ సినిమా ప్రేమ కథా చిత్రంగా అనిపిస్తోంది. ఈ సినిమాలో హరీశ్ కళ్యాణ్ హీరోగా, ఇవానా హీరోయిన్‌గా నటించింది. రమేశ్ తమిళమణి ఈ మూవీకి దర్శకత్వం వహించారు. నదియా కీలకపాత్రలో నటించింది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కానుంది.

  ధోని మంచి మనసు.. వీడియో వైరల్

  భారత మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోని మరోమారు తన మంచి మనసును చాటుకున్నాడు. తన విల్లాలో పనిచేసే సెక్యూరిటీ గార్డుకు సాయం చేశాడు. గార్డు డ్యూటీకి వస్తుండగా ధోని అతడ్ని చూశాడు. విల్లా చాలా దూరం ఉండటంతో గార్డును బైక్‌ ఎక్కించుకొని గేటు వద్ద వదిలిపెట్టాడు. సెక్యూరిటీ గార్డును దించాక మహీ వారికి హలో కూడా చెప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు మహీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. Dhoni dropping his security in gate??❤️@MSDhoni #MSDhoni … Read more

  ధోని స్కెచ్‌కు హార్దిక్‌ బలి!

  IPL: మైదానంలో ధోని వ్యూహాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బ్యాటర్ బలహీనతలకు తగ్గట్లు ధోని ఫీల్డ్‌ సెట్‌ చేస్తుంటాడు. ఈ ఎత్తుగడతోనే నిన్నటి మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ కెప్టెన్ హార్దిక్‌ పాండ్యను ధోని ఔట్‌ చేయించాడు. ఫోర్‌ కొట్టి ఊపుమీదున్న హార్దిక్‌కు చెక్‌ పెట్టేందుకు జడేజాను కుడివైపునకు రప్పించి ఫీల్డింగ్‌లో మార్పు చేశాడు. వ్యూహాంలో భాగంగా బౌలర్‌ తర్వాత బంతిని ఆఫ్‌ సైడ్‌ వేయగా హార్దిక్‌ బంతిని జడేజాకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ? … Read more