• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ఈ వారం(sep 29, 30) థియేటర్‌/OTTలో వస్తున్న తెలుగు సినిమాలు

  తెలుగు రాష్ట్రాల్లో వచ్చేవారం దసరా సందడి మొదలుకానుండగా ఈ వారం బాక్సాఫీస్‌ వద్ద పెద్ద సినిమాలేవీ తలపడటం లేదు. దసరాకు గాడ్‌ఫాదర్‌, ది ఘోస్ట్ వంటి స్టార్ల సినిమాలు వస్తుండగా, ఈ వారం డబ్బింగ్‌ సినిమాల హవానే ఉంది. పొన్నియన్‌ సెల్వన్‌ లాంటి భారీ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ గురు, శుక్ర వారాల్లో తెలుగులో వస్తున్న సినిమాలేంటో ఓసారి చూద్దాం. నేనే వస్తున్నా ధనుష్‌ డ్యూయల్‌ రోల్‌లో వస్తున్న సస్పెన్స్‌ థ్రిల్లర్‌ చిత్రం నేనే వస్తున్నా. ధనుష్‌, ఇలి అవ్రామ్‌, ఇందుజా, … Read more

  దారుణం.. 9 ఏళ్ల దత్త పుత్రికపై దంపుతుల చిత్రహింస

  మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జిల్లాకు చెందిన ఓ జంట తమ 9 ఏళ్ల దత్త పుత్రికపై కిరాతకంగా వ్యవహరించారు. ఆమెను దారుణంగా కొట్టడంతో పాటు.. కాళ్లు, ప్రైవేట్ భాగాలపై వాతలు పెట్టారు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో వారు దంపతులపై కేసు నమోదు చేసి.. బాలికను ఆసుపత్రికి తరలించారు. కాగా ఆ బాలికకు, ఆ దంపతులకు దగ్గరి బంధుత్వ సంబంధం ఉంది. కరోనా కారణంగా ఆ బాలిక తల్లిదండ్రులు మృతి చెందడంతో ఆమెను ఆ దంపతులు దత్తత తీసుకున్నారు.

  సినిమా నిర్మాణ రంగంలోకి ఆనంద్ మహింద్రా!

  టెక్ మహీంద్రా నిర్వహించిన ఓ ప్రత్యేక సెలబ్రేటింగ్ రైజ్‌ కార్యక్రమానికి సినీ ప్రముఖులు, తదితరులు హాజరయ్యారు. ఆనంద్ మహీంద్రా ఆహ్వానం మేరకు హీరో అడివి శేష్, డైరెక్టర్లు నాగ్ అశ్విన్, బోయపాటి శ్రీను, బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపిచంద్, మిథాలీ రాజ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సినిమాలపై తనకున్న ఆసక్తి గురించి ఆనంద్ మహీంద్రా వెల్లడించారు. మరోవైపు చిత్ర నిర్మాణంలోకి అడుగుపెట్టాలని యోచిస్తున్నట్లు వెల్లడించారు. Actor @AdiviSesh, Directors #BoyapatiSreenu & @nagashwin7 got a special invitation to Celebrating Rise … Read more

  నేడు మరో సారి ఈడీ ముందుకు సోనియా గాంధీ

  కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ నేడు మరోసారి ఈడీ అధికారుల విచారణకు హాజరుకానున్నారు. నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో ఆమెను ప్రశ్నించనున్నారు. ఇప్పటికే సోనియాను మొదటిసారిగా రెండు గంటలకు పైగా ప్రశ్నించారు. నేషనల్‌ హెరాల్డ్‌ జర్నల్స్‌ లిమిటెడ్‌కు ఉన్న రూ.90కోట్ల అప్పును యంగ్‌ ఇండియాకు బదలాయించడంపై ఆమె ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొన్నారు. యంగ్‌ ఇండియా బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టరుగా ఉన్న సోనియాకు 38 శాతం వాటా ఎలా వచ్చిందన్న దానిపైనా ఆరా తీయనున్నారు.

  టీ స్టాల్‌లో గంజాయి.. షాక్ అయిన పోలీసులు

  తమిళనాడులోని కోయంబత్తూరులో సిటీ పోలీసులు.. పలు దుకాణాలు, పాన్ డబ్బాలు, టీ షాపుల్లో తనిఖీలు నిర్వహించారు. ఆ తనిఖీల్లో వారికి గంజాయి పట్టుబడింది. చాక్లెట్‌ల రూపంలో గంజాయిని అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు. సుమారు 40 కిలోల ‘వీడ్ చాక్లెట్’గా పిలువబడే మత్తుపదార్థాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం టీ స్టాల్ నిర్వహిస్తున్న రాజస్థాన్‌కు చెందిన కేతన్ కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు.

  నేడు కడెం ప్రాజెక్టు ఏరియల్ సర్వేకు సీఎం కేసీఆర్

  తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు కడెం ప్రాజెక్టును పరిశీలించనున్నారు. ఈ ప్రాజెక్టుతోపాటు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేయనున్నారు. SRSP, కడెం, కాళేశ్వరం ప్రాజెక్టులు పరిశీలించిన తర్వాత వరద ప్రభావిత ప్రజలతో మాట్లాడనున్నారు. ఈ నెల 18న ఏరియల్ సర్వే చేయాల్సి ఉండగా, వర్షాలు సహా పలు కారణాలతో సీఎం ప్రాజెక్టు పర్యటనకు వెళ్లలేదు.

  ఆధార్-ఓట‌ర్ ఐడీ అనుసంధానంపై నేడు విచార‌ణ‌

  ఆధార్, ఓట‌ర్ ఐడీ కార్డు అనుసంధానంపై నేడు సుప్రీంకోర్టులో విచార‌ణ జ‌ర‌గ‌నుంది. ఈ వివాదాస్ప‌ద చ‌ట్టాన్ని ర‌ద్దు చేయాలంటూ కాంగ్రెస్ సీనియ‌ర్ నేత రణదీప్​ సుర్జేవాలా పిటిష‌న్ దాఖ‌లు చేశారు. ఇది వ్య‌క్తుల గోప్య‌త‌ను, వారి వ్య‌క్తిగ‌త హ‌క్కుల‌ను ఉల్లంఘ‌న అవుతుంద‌ని ఆయ‌న పేర్కొన్నారు. దీనిపై పార్ల‌మెంట్‌లో ఎటువంటి చ‌ర్చ జ‌ర‌గ‌కుండానే బిల్లును పాస్ చేశార‌ని తెలిపారు. ఆధార్, ఓట‌ర్ ఐడీ లింక్ చేస్తే ఇండియ‌న్ సిటిజ‌న్స్ కానివాళ్లు కూడా ఓటు వేసే అవ‌కాశ‌ముంద‌ని ఆరోపించారు. దీనిపిఐ సుప్రీంకోర్టు తీర్పుపై ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

  ఎక్స్‌ప్రెస్‌వేపై రెండు బస్సులు ఢీ..8 మంది మృతి

  ఉత్తరప్రదేశ్ పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర ప్రమాదం జరిగింది. రెండు బస్సులు ఢీకొన్న ఘటనలో ఎనిమిది మంది మృతి చెందగా, మరో 20 మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. రెండు బస్సులు బీహార్‌లోని సీతామర్హి, సుపాల్‌ నుంచి ఢిల్లీకి వెళ్తున్నాయని తెలిసింది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాద వివరాలను ఆరా తీస్తున్నారు.

  ‘విముక్తి కోసం భారత్ వైపు చూస్తున్న పీఓకే ప్రజలు’

  పాక్‌ ఆక్రమిత జమ్మూకశ్మీర్‌లో ప్రజలు విముక్తి కోసం భారత్‌ వైపు చూస్తున్నారని ఆర్‌ఎస్‌ఎస్‌ సీనియర్‌ నేత దత్తాత్రేయ హోసబాలే అన్నారు. జమ్ముకాశ్మీర్‌లో కార్గిల్ విజయ్ దివస్ స్మారక కార్యక్రమంలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి దేశాన్ని అస్థిరపరిచేందుకు పాకిస్థాన్ తీవ్రవాదం, వేర్పాటువాదాన్ని వ్యాపింప జేస్తోందని విమర్శించారు. దీనిలో పాక్ ఆక్రమిత కశ్మీర్‌ ప్రజలే తొలి బాధితులని, వారికి పూర్తి న్యాయం జరగాలని అభిప్రాయం వ్యక్తం చేశారు.

  పాపకు పాలిస్తూ తల్లి మృతి

  ఓ తల్లి తన రెండు నెలల పసిపాపకు పాలిస్తూ ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాదకర సంఘటన నాగర్ కర్నూల్ జిల్లా నేరళ్లపల్లిలో జరిగింది. తిర్మలాపూర్ కు చెందిన జయశ్రీ(25) గుండె వాల్వ్ సమస్యతో బాధపడుతోంది. మహబూబ్ నగర్లో శనివారం ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చూపించుకోగా మందులు వాడితే తగ్గిపోతుందని వైద్యులు చెప్పారు. కానీ ఆదివారం ఉదయం పాపకు పాలిస్తుండగా ఆకస్మాత్తుగా మరణించింది. దీంతో ఆ గ్రామంలో ఒక్కసారిగా విషాద చాయల అలుముకున్నాయి.