• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • OSCAR AWARDS: ఎవ్రీథింగ్ ఎవ్రీ వేర్ ఆల్ ఎట్‌ వన్స్ చిత్రానికి అత్యధిక ఆస్కార్స్… ఏకంగా 7 పురస్కారాలు
    H3N2: దేశంలో కొత్త వైరస్ లక్షణాలు, వ్యాప్తి, జాగ్రత్తలపై.. ICMR కీలక సూచనలు
    Amitabh Bachchan: ప్రాజెక్ట్ కె షూటింగ్‌లో అమితాబ్‌ బచ్చన్‌కు ప్రమాదం
    Penis Transplantation: 72ఏళ్ల వృద్ధుడికి అంగ మార్పిడి.. జైపుర్‌లో సర్జరీ సక్సెస్
    See More

    అమ్మాయిలతో యువకుడు బైక్‌ స్టంట్‌.. వీడియో వైరల్‌

    [VIDEO](url): ముంబయిలో ఓ యువకుడు ఇద్దరు అమ్మాయిలను బైక్‌పై కూర్చోపెట్టుకొని స్టంట్స్‌ చేశాడు. ముందు, వెనకా అమ్మాయిలు ఉండగా ఫ్రంట్‌ టైర్‌ లేపి మరీ బైక్‌ను పోనిచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ముంబయి ట్రాఫిక్‌ పోలీసులు ట్విటర్‌లో పోస్టు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని యువకుడి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌ అవుతోంది. dangerous Stunt with 2 pillion rider one in front & one at rear, no helmet & doing … Read more

    వావ్.. నీతా అంబానీ ఇంత టాలెంటా?

    ప్రముఖ వ్యాపార దిగ్గజం ముఖేశ్ అంబానీ సతీమణి నీతా అంబానీ శాస్త్రీయ నృత్యంతో అలరించారు. ‘రఘుపతి రాఘవ రాజారాం పతితపావన సీతారాం’ పాటకు డ్యాన్స్ చేశారు. నీతా- ముకేశ్ అంబానీ కల్చరల్ సెంటర్‌ సాంస్కృతిక కార్యక్రమాల్లో ఆమె ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా వైరల్‌గా మారింది. శాస్త్రియ నృత్యంపై ఆమెకున్న పట్టును నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. వీడియో చూసేందుకు పైన Watch Onపై క్లిక్ చేయండి. #WATCH | Mumbai: Nita Ambani gracefully dances on 'Raghupati Raghava Raja … Read more

    3 నిమిషాల్లోనే కాపాడిన కానిస్టేబుల్

    TS: శాంతి భద్రతలను పర్యవేక్షించడంతో పాటు ప్రజలను ఆపద నుంచి గట్టెక్కించడంలో తెలంగాణ పోలీసులు ముందుంటున్నారు. తాజాగా డయల్ 100కు కాల్ వచ్చిన మూడు నిమిషాల్లోనే సమస్య పరిష్కారం చేశాడో కానిస్టేబుల్. హైదరాబాద్ పరిధిలోని అల్వాల్ పీఎస్‌కు కాల్ వచ్చింది. ఓ యువతి ఆత్మహత్య చేసుకుంటోందన్నది కాల్ సారాంశం. దీంతో ఫోన్ కాల్ ఆధారంగా 3 నిమిషాల్లోనే కానిస్టేబుల్ భాస్కర్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం ఉరివేసుకుంటున్న వివాహితను తలుపులు పగలగొట్టి కాపాడారు. దీంతో కానిస్టేబుల్‌ని ప్రశంసిస్తున్నారు.

    సీఎంపై పోస్టులు; ఎన్నారై అరెస్ట్

    ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు వ్యతిరేకంగా పోస్టులు పెట్టిన ఓ ఎన్నారైను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎన్నారై పొందూరు కోటిరత్న అంజన్‌ను గన్నవరం పోలీసులు అరెస్ట్ చేసి జూనియర్ సివిల్ జడ్జి శిరీష ఎదుట హాజరుపరిచారు. అంజన్.. యువగళం అనే ట్విటర్ ఖాతా ద్వారా సీఎంకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు. స్థానిక నేతల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అమెరికా నుంచి వచ్చిన అంజన్‌ను పోలీసులు.. జడ్జి ముందు హాజరు పరచగా అతడిని స్టేషన్ బెయిల్‌పై విడుదల చేశారు.

    సర్‌ప్రైజ్‌ అని చెప్పి కత్తితో పొడిచారు

    గుజరాత్‌ అహ్మదాబాద్‌లో భార్యను వేధిస్తున్నాడనే కోపంతో ఓ వ్యక్తి స్నేహితుడిని చంపేశాడు. బాపునగర్‌లో నివసించే మీరజ్‌, ఇమ్రాన్‌ స్నేహితులు. ఇమ్రాన్‌ భార్యను మీరజ్‌ తరచూ వేధించడంతో అతడిపై కక్ష పెంచుకున్నాడు. మీరజ్‌ను ఇంటికి పిలిచి సర్‌ప్రైజ్‌ అంటూ అతడి కళ్లకు గంతలు కట్టారు. ఆ తర్వాత మీరజ్ దంపతులు అతడిని కత్తితో బలంగా పొడిచి చంపారు. ఆ తర్వాత శరీరాన్ని ముక్కలుగా చేసి చెత్తకుప్పలో పారేశారు. పోలీసుల విచారణలో అసలు నిజం ఒప్పుకున్నారు

    రూ.6 లక్షల ఇడ్లీలు తినేశాడు!

    హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి ఒకే ఏడాదిలో రూ.6 లక్షల విలువ చేసే ఇడ్లీలు ఆర్డర్ చేశాడు. ఈ విషయాన్ని ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ బయటపెట్టింది. ఏడాదిలో ఇతగాడు 8,428 ప్లేట్లను ఆర్డర్ చేసినట్లు పేర్కొంది. కాగా ఇడ్లీలు ఎక్కువగా ఆర్డర్ చేసే సిటీగా బెంగళూరు మొదటిస్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో హైదరాబాద్, చెన్నై నిలిచాయి. కాగా హైదరాబాద్‌లోని వరలక్ష్మి టిఫిన్స్, ఉడిపి ఉపాహార్ హోటళ్ల నుంచి జనాలు ఎక్కువగా ఇడ్లీని ఆర్డర్ చేస్తున్నట్లు తెలిపింది.

    పేకాటలో డబ్బులు పోగొట్టుకున్న స్టార్ ఫుట్‌బాలర్

    [వీడియో;](url) బ్రెజిల్ స్టార్ ఫుట్‌బాలర్ జూనియర్ నెయ్‌మర్ పేకాటలో డబ్బులు పోగొట్టుకున్నాడు. ఆన్‌లైన్‌లో పోకర్ ఆడి దాదాపు రూ.9 కోట్లు కోల్పోయాడు. దీంతో తన డబ్బులు పోవడంతో గుక్కపట్టి ఏడ్చాడు. అతడు ఏడుస్తుండగా వెనకాల టైటానిక్ సినిమా బీజీఎమ్ కూడా వినిపిస్తుంది. ఇంతలో ఏడుపు మొహం నుంచి నవ్వు మొహంలోకి మారి అందరినీ ఆశ్చర్యపరిచాడు. కాగా ఆ తర్వాత గేమ్‌లో నెయ్‌మర్ తాను పోగొట్టుకున్న డబ్బులన్నీ తిరిగి గెలుచుకున్నాడు. Neymar é o rei do entretenimento até fazendo live slk, o … Read more

    కాంతారా సీన్ రిపీట్; డ్యాన్స్ చేస్తూ..

    కర్నాటకలో కాంతారా సీన్ రిపీట్ అయింది. ఓ వ్యక్తి డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిపోయాడు. ఈ ఘటన దక్షిణ కర్నాటకలోని దోల్పాడి గ్రామంలో చోటుచేసుకుంది. కంటు అజిలా మూలాంగిరి(55)కి డివైన్ డ్యాన్సర్‌గా ఆ ప్రాంతంలో మంచి పేరుంది. ఈ క్రమంలో వందలాదిమంది సమక్షంలో శిరడీ నృత్యం చేస్తుండగా ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. అదే అతడికి ఆఖరి ప్రదర్శనగా నిలిచిపోయింది. దైవసేవలో ఉండగానే దేవుడిలో లీనమయ్యాడని.. అతడి జన్మ ధన్యమైందని అనుకుంటున్నారు.

    రూ.3 వేలతో అయోధ్య హెలికాప్టర్ రైడ్

    శ్రీరామనవమి సందర్భంగా భక్తులకు యూపీ ప్రభుత్వం ఊహించని కానుక అందజేస్తోంది. శ్రీరాముడి పవిత్ర నగరమైన అయోధ్యకు భక్తులు, పర్యాటకులను హెలికాప్టర్‌లో తీసుకెళ్లనుంది. ఈ రైడ్‌కు ఒక్కొక్కరికి రూ.3 వేలుగా నిర్ణయించారు. మొత్తం 8 నిమిషాలపాటు కొనసాగే ఈ రైడ్‌లో అయోధ్యలోని సరయూ నది, రామజన్మభూమి, హనుమాన్ గర్హి తదితర ప్రదేశాలను చూడవచ్చు. ఈ హెలికాప్టర్ రైడ్ 15 రోజులపాటు అందుబాటులో ఉంటుంది. హెలికాప్టర్‌లో ఒకేసారి ఏడుగురు ప్రయాణించవచ్చు.

    19 కిలోల బంగారంతో ‘రామాయణం’

    శ్రీరామనవమి సందర్భంగా బంగారు రామాయణ గ్రంథం భక్తులకు కనువిందు చేస్తోంది. గుజరాత్‌లోని సూరత్‌లో ఉన్న ఓ ఆలయంలో 19 కిలోల బరువుండే రామాయణ గ్రంథాన్ని బంగారం, వెండి, వజ్రాలు, కెంపులు, పచ్చలతో తయారు చేశారు. దీని ఖరీదు ఇప్పుడు రూ.కోట్లలో ఉంటుంది. దీనికి 1981లో రామ్‌భాయ్ అనే భక్తుడు శ్రీకారం చుట్టారు. అనంతరం మరో 12 మంది భక్తులు సహకరించి ఈ రామాయణం పూర్తి చేశారు. 530 పేజీలుండే ఈ రామాయణం రాయడానికి 9 నెలల 9 గంటల సమయం పట్టింది.