• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Top Searches 2023: ఈ ఏడాది గూగుల్‌లో భారతీయులు అత్యధికంగా వెతికిన టాపిక్స్ ఇవే!

    ఈ ఏడాది ముగింపునకు వచ్చేసింది. కొత్త ఏడాదికి స్వాగతం పలికేందుకు ప్రపంచం సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో గూగుల్‌.. సెర్చ్‌ ట్రెండ్స్‌ నివేదికను విడుదల చేసింది. ఈ ఏడాదిలో భారతీయులు ఎక్కువగా సెర్చ్‌ టాసిన టాపిక్స్‌ను అందులో ప్రకటించింది. వివిధ విభాగాల వారీగా టాప్‌ సెర్చ్‌ అంశాలను నివేదిక ద్వారా రివీల్‌ చేసింది. మరి భారతీయులు ఎక్కువగా తెలుసుకోవాలనుకున్న న్యూస్‌ కంటెంట్‌ ఏంటి? క్రీడల్లో దేని గురించి వారు ఎక్కువగా వెతికారు? ఏ అంశాల గురించి వారు తెలుసుకోవాలని అనుకున్నారు? ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. 

    టాప్‌ 5 న్యూస్ ఈవెంట్స్‌

    చంద్రయాన్-3

    జాబిల్లిపై ప్రయోగం కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన అత్యంత ప్రతిష్ఠాత్మకమైన మిషన్‌ ‘చంద్రయాన్-3’ (Chandrayaan-3). ఈ మిషన్ విజయవంతం అవ్వడంతో దీని గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు భారీఎత్తున గూగుల్‌లో సెర్చ్‌ చేశారు.

    కర్ణాటక ఎన్నికల ఫలితాలు

    ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికల ఫలితాల (Karnataka Election Result) గురించి ఎక్కువమంది భారతీయులు నెట్టింట శోధించారు. మెుత్తం 224 స్థానాలకు గాను కాంగ్రెస్‌ 135 సీట్లు గెలుచుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. భాజాపా 66, జేడీఎస్‌ 19 స్థానాలతో సరిపెట్టుకున్నాయి.

    ఇజ్రాయిల్‌ వార్తలు (Israel News)

    ఇజ్రాయెల్‌ – హమాస్‌ మిలిటెంట్ల మధ్య చోటుచేసుకున్న భీకరపోరు యావత్‌ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఇజ్రాయెల్‌ జరిపిన దాడుల్లో దాదాపు 20 వేల మంది పాలిస్తీనియన్లు చనిపోయినట్లు గాజా హెల్త్ డిపార్ట్‌మెంట్‌ తాజాగా ప్రకటించింది. మెుత్తం మీద ఇజ్రాయెల్‌-హమాస్ ఉద్రిక్తతల గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు ఆసక్తి కనబరిచారు. 

    సతీశ్‌ కౌశీక్‌

    ఈ ఏడాది మార్చిలో జరిగిన బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు సతీశ్‌ కౌశీక్‌ మరణం పలు అనుమానాలు రేకెత్తించింది. సతీశ్‌ను తన భర్తే హత్య చేశాడంటూ ఓ బిజినెస్‌ మ్యాన్‌ భార్య ప్రకటించడం అప్పట్లో సంచలనం సృష్టించింది. దీంతో ఈ సతీశ్‌ కౌషిక్‌ మరణానికి సంబంధించిన వార్తలు తెలుసుకునేందుకు నెటిజన్లు గూగుల్‌లో అధికంగా సెర్చ్ చేశారు.

    బడ్జెట్‌ 2023

    ఈ ఏడాది కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌-2023 గురించి తెలుసుకునేందుకు ఎక్కువ మంది ఆసక్తికనబరిచారు. బడ్జెట్‌ కేటాయింపులు, వివిధ రంగాల్లో ప్రభుత్వ ఆదాయం గురించి తెలుసుకునేందుకు శోధించారు. 

    క్రీడల్లో టాప్‌ సెర్చ్‌ టాపిక్స్‌

    ఇండియన్‌ ప్రీమియర్ లీగ్ (IPL)

    క్రీడల విషయానికి వస్తే ఈ ఏడాది భారతీయులు ఎక్కువగా IPL 2023 గురించి సెర్చ్ చేశారు. తమ ఫేవరెట్‌ జట్ల ఆటగాళ్లు, మ్యాచ్‌ విజయాలు, పాయింట్ల పట్టికలో తమ టీమ్ స్థానం వంటి వివరాల కోసం గూగుల్‌లో ఎక్కువగా సెర్చ్ చేశారు. 

    క్రికెట్‌ వరల్డ్‌ కప్‌

    ఈ ఏడాది జరిగిన వన్డే వరల్డ్‌కప్‌ కూడా గూగుల్‌లో ఎక్కువగా శోధించబడింది. టీమిండియా ప్రదర్శన గురించి తెలుసుకునేందుకు భారతీయులు విపరీతంగా శోధించారు. ఇదిలాఉంటే ఒక్క పరాజయం లేకుండా టోర్నీలో ఫైనల్స్‌కు చేరిన భారత జట్టు.. తుదిపోరులో ఆస్ట్రేలియా చేతిలో ఓడి వరల్డ్‌కప్‌ను చేజార్చుకుంది. 

    ఆసియా కప్‌

    భారతీయులు క్రీడల్లో ఎక్కువగా ఆసియా కప్‌ గురించి వెతికారు. వరల్డ్‌కప్‌నకు ముందు ఈ టోర్నీ జరగడంతో అందరి దృష్టి దీనిపై పడింది. ఫైనల్లో శ్రీలంకపై గెలిచి భారత్‌ ఆసియా విజేతగా నిలిచింది.

    ఉమెన్స్‌ ప్రీమియర్ లీగ్

    ఈ ఏడాదే కొత్త మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (WPL)కు బీసీసీఐ అంకురార్పణ చేసింది. మెుత్తం ఐదు జట్లు (అహ్మదాబాద్‌, ముంబయి, బెంగళూరు, ఢిల్లీ, లఖ్‌నవూ) టోర్నీలో తలపడగా.. చివరికి ముంబయి కప్‌ ఎగరేసుకుపోయింది. అయితే WPL గురించి కూడా ఎక్కువ మంది నెటిజన్లు శోధించినట్లు గూగుల్‌ తెలిపింది. 

    ఏసియన్‌ గేమ్స్‌

    ఈ ఏడాదిలోనే ఆసియా క్రీడలు జరగడంతో దాని పేరు తరచూ ట్రెండింగ్‌ అయ్యింది. దీంతో ఆసియా క్రీడల్లో ఆటగాళ్ల ప్రదర్శన, పతకాలు, రికార్డులు వంటి విశేషాలను తెలుసుకునేందుకు ఎక్కువ ఆసక్తికనబరిచారు. 

    ‘ఎలా చేయాలి’ టాప్‌-5 సెర్చెస్‌

    చర్మం – జుట్టు సంరక్షణ?

    భానుడి భగభగల నుంచి వంటింటి చిట్కాల ద్వారా చర్మం, జుట్టును ఎలా కాపాడుకోవాలి అనే అంశంపై భారతీయులు ఎక్కువగా శోదించినట్లు గూగుల్‌ తన నివేదికలో తెలిపింది. 

    వేగంగా 5 వేల ఫాలోవర్లు?

    యూట్యూబ్‌లో వేగంగా 5వేల ఫాలోవర్లను సంపాదించుకునేందుకు ఏం చేయాలి అనే దానిపై నెటిజన్లు గూగుల్‌లో ఎక్కువగా సెర్చ్‌ చేశారు. గూగుల్‌ సలహాలను పొందారు.

    కబడ్డీలో ఎలా రాణించాలి?

    కబడ్డీలో రాణించడానికి అవసరమైన నైపుణ్యాలు, మెళుకువల గురించి గూగుల్‌లో ఎక్కువమంది సెర్చ్‌ చేశారు. 

    కారు మైలేజీ ఎలా పెంచుకోవాలి?

    కారు వినియోగదారులను ప్రధానంగా వేధించే సమస్య మైలేజీ. పెరిగిన ఇంధన ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగా మైలేజీని ఎలా పెంచుకోవాలి అన్న దానిపై ఎక్కువ మంది నెటిజన్లు గూగుల్‌లో శోధించారట. 

    చెస్‌ గ్రాండ్‌మాస్టర్‌గా ఎలా మారాలి?

    చెస్‌ అంటే చాలామందికి ఆసక్తి ఉంటుంది. అయితే ఇందులో గ్రాండ్‌మాస్టర్‌గా ఎదిగేందుకు ఎలాంటి నైపుణ్యాలు అలవరుచుకోవాలనే అంశంపై ఎక్కువ మంది సెర్చ్‌ చేసినట్లు గూగుల్‌ తెలిపింది. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv