• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ఐపీఎల్‌లో ఎంతో నేర్చుకున్నా: వార్నర్‌

  నేర్చుకునేందుకు ఐపీఎల్‌ ఓ మంచి వేదిక అని ఆస్ట్రేలియా స్టార్‌ బ్యాటర్‌ డేవిడ్ వార్నర్ అన్నాడు. ఇన్నింగ్స్‌ వేగాన్ని క్రమంగా పెంచే విషయంలో IPL లీగ్‌ ఉపయోగపడిందని పేర్కొన్నారు. ‘టీ20 క్రికెట్లోనే గేర్లు మార్చడం నేర్చుకున్నా. ఇందుకు ఐపీఎల్‌ ఎంతో ఉపయోగపడింది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ఆడేటప్పుడు చాలా విషయాలు నేర్చుకున్నా. తొలి 10 ఓవర్లలో కొత్త బంతిని గౌరవించాలి. అక్కడి నుంచి మన బలాన్ని చాటాలి. క్రీజులో కుదురుకునేందుకు సమయం తీసుకుంటే భారీ స్కోరు సాధించొచ్చు’ అని వార్నర్‌ చెప్పాడు.

  India Lost ICC Trophies: నాకౌట్స్‌లో టీమిండియా చెత్త రికార్డు.. పదేళ్లలో 8 ట్రోఫీలు ఫసక్..!

  2013 తర్వాత టీమిండియా ఏకంగా 8 ఐసీసీ ట్రోఫీలను నాకౌట్స్‌లో కోల్పోయింది. కొన్నింట్లో తుది వరకు వచ్చి ఓడిపోతే, మరికొన్నింట్లో మొదట్లోనే చేతులెత్తేసింది. 2014లో టీ20 వరల్డ్‌కప్‌‌లో మొదలైన పరాభవ ప్రస్థానం.. నిన్న మొన్నటి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ వరకు కొనసాగింది. నాకౌట్స్‌లో పేలవ ఆట తీరుతో టీమిండియా అభిమానులకు నిరాశే మిగుల్చుతోంది. 2013 తర్వాత భారత్ ఇప్పటివరకు కోల్పోయిన ఐసీసీ ట్రోఫీలేంటో చూద్దాం. 2014 టీ20 వరల్డ్‌కప్.. గ్రూప్ దశలో ఓటమే ఎరుగకుండా నాకౌట్స్‌లోకి ప్రవేశించింది భారత్. సెమీఫైనల్‌లో సౌతాఫ్రికాను మట్టికరిపించి … Read more

  భావోద్వేగానికి లోనైన బ్రావో

  సీఎస్‌కే బౌలింగ్ కోచ్, వెస్టీండీస్ క్రికెటర్ డ్వేన్ బ్రావో ఇన్‌స్టా వేధికగా భావోద్వేగానికి లోనయ్యారు. IPL‌లో రిటైర్మెంట్ ప్రకటించడం తన జీవితంలో విచారకరమైన సమయం అన్నారు. ధోని వల్లే తాను IPLల్లో సీఎస్‌కేకు బౌలింగ్ కోచ్‌‌గా కొనసాగుతున్నానని చెప్పుకొచ్చారు. దేవుడు క్రికెటర్‌గా తనకు ప్రసాధించిన నైపుణ్యాలను ఇకపై ఎలా కొనసాగించాలా అని ఆలోచిస్తున్న సమయంలో బౌలింగ్ కోచ్‌గా అవతారం ఎత్తడం తన జీవితంలో ఒక అద్భుతమని బ్రావో భావోద్వేగానికి లోనయ్యారు. https://www.instagram.com/reel/Cs3bJdPuO3m/?utm_source=ig_web_copy_link

  అనుజ్ రావత్ ధోని స్టైల్ ఫీల్డింగ్

  రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో ఆర్సీబీ ఆటగాడు అనుజ్ రావత్ అద్బుతంగా రాణించాడు. చివర్లో బ్యాటింగ్‌తోనే కాదు కీపింగ్‌లోనూ అదరగొట్టాడు. ఈ మ్యాచ్‌లో ధోనిని గుర్తు చేశాడు అనుజ్. సూపర్ ఫీల్డింగ్‌తో వికెట్లను చూడకుండా రనౌట్ చేశాడు. ఈ ఫీట్‌కు రాజస్థాన్ బ్యాటర్‌ అశ్విన్ రనౌట్‌గా వెనుదిరిగాల్సి వచ్చింది. మ్యాచ్‌లో 59 పరుగులకే ఆర్‌ఆర్‌ ఆలౌట్‌ అయిన సంగతి తెలిసిందే. ఆర్సీబీ ప్లే ఆఫ్ ఆశలు సజీవంగానే ఉన్నాయి. ?? ??? ????! The Anuj Rawat direct-hit that left everyone in disbelief … Read more

  ముంబై ఘన విజయం

  ఐపీఎల్ 2023లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది. 6 వికెట్ల తేడాతో బెంగళూరును చిత్తు చేసింది.. 200 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై 16.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. జట్టులో సూర్యకుమార్ యాదవ్(83) చెలరేగి ఆడాడు. ఏమాత్రం కనికరం చూపకుండా బెంగళూరు బౌలర్లపై సూర్య ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ఇషాన్ కిషన్(42), నేహాల్ వధేరా(52)లు రాణించారు. హసరంగ, వైశాఖ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. సూర్య ధనాధన్‌ ఇన్నింగ్స్‌ భారీ లక్ష్య ఛేదనలో … Read more

  హమ్మయ్యా.. ధోని రిటైర్మెంట్ లేనట్లే!

  సీఎస్కే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి ఐపీఎల్ 2023 సీజన్ చివరిదని అందరూ అనుకుంటుటున్నారు. ఈ క్రమంలోనే ధోని ఆటను ఆస్వాదించడానికి అభిమానులు స్టేడియాలకు పోటెత్తుతున్నారు. అతడు రెండు బంతులాడినా అదే మాకు మహాప్రసాదం అన్నట్లుగా ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. ఈ క్రమంలో లక్నోతో మ్యాచ్‌లో టాస్ సందర్భంగా కామెంటేటర్ డానీ మారిసన్ ‘‘ఇదే నీకు చివరి ఐపీఎల్ అవుతుందా.. అందుకే ఇంతమంది ప్రేక్షకులు స్టేడియానికి వచ్చారా’’ అంటూ ధోనిని ప్రశ్నించాడు. ‘‘ఇదే నా చివరి ఐపీఎల్ అని మీరే డిసైడ్ అయ్యారు.. నేను కాదు.’’ … Read more

  ఐపీఎల్‌లో అర్జున్ తొలి సిక్సర్: చూశారా?

  ఐపీఎల్ సీజన్ 16లో భాగంగా ముంబై ఇండియన్స్‌పై గుజరాత్ టైటాన్స్ 55 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ సాధించింది. కాగా ఈ మ్యాచ్‌లో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు, ముంబై ఆల్‌రౌండర్ అర్జున్ టెండూల్కర్ 13 పరుగులు చేశాడు. ఈ క్రమంలో ఐపీఎల్‌లో తన తొలి సిక్సర్ కొట్టాడు. తొమ్మిది నెంబర్ ఆటగాడిగా వచ్చి చివరి ఓవర్లో మోహిత్ శర్మ బౌలింగ్‌లో భారీ సిక్సర్ కొట్టాడు. అటు బౌలింగ్‌లో ఓ వికెట్.. ఇటు బ్యాటింగ్‌లో ఓ భారీ సిక్సర్ బాదడంతో సచిన్ ఫ్యాన్స్ … Read more

  తిలక్ వర్మ తెలుగు ఇంటర్వ్యూ; చూశారా?

  ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్, తెలుగు కుర్రాడు తిలక్ వర్మ ఐపీఎల్‌లో అదరగొడుతున్నాడు. రోహిత్, సూర్య, ఇషాన్ వంటి హేమాహేమీలు తడబడుతున్న తరుణంలో తిలక్ సిక్సర్లతో రెచ్చిపోతున్నాడు. అలవోకగా బౌండరీలు బాదీ జట్టు భారీ స్కోరుకు దోహదపడుతున్నాడు. కాగా హైదరాబాద్‌తో మ్యాచ్ సందర్భంగా తిలక్ తెలుగులో మాట్లాడి అలరించాడు. యాంకర్, కామేంటేటర్స్ ప్రశ్నలకు తెలుగులో జవాబిచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హైదరాబాద్ లో అదరగొట్టిన మన తెలుగు కుర్రాడు @TilakV9 ??? మ్యాచ్ తర్వాత #StarSportsTelugu తో #Exclusive … Read more

  కేఎల్ రాహుల్ మరో రికార్డ్

  లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ మరో అరుదైన రికార్డు నెలకొల్పాడు. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అర్ధసెంచరీతో రాణించాడు. ఈ క్రమంలో ఐపీఎల్‌లో అత్యంత వేగంగా 4000 పరుగులు పూర్తి చేసుకున్న బ్యాటర్‌గా నిలిచాడు. కేవలం 105 ఇన్నింగ్స్‌ల్లోనే 4 వేల రన్స్ పూర్తి చేసుకున్న ఆటగాడిగా రాహుల్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్‌లో గేల్(112), వార్నర్(114), కోహ్లీ(128), డివిలియర్స్(131) లాంటి ఆటగాళ్లకు సాధ్యం కాని రికార్డుతో రాహుల్ మెరిశాడు. గత కొంతకాలంగా రాహుల్‌ సరైన ఫామ్‌లో లేడు. ఈ సీజన్‌ ఐపీఎల్‌లోనూ … Read more

  హ్యారీ బ్రూక్ సెంచరీ: గర్ల్‌ఫ్రెండ్ చూస్తుండగా!

  కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ సెంచరీతో చెలరేగిన సంగతి తెలిసిందే. వరుస వైఫల్యాల నుంచి బయటపడి శతకంతో సత్తాచాటాడు. ఈ సెంచరీని తన గర్ల్‌ఫ్రెండ్ లూసీ లైల్స్ చూస్తుండగా బాదడం విశేషం. ఆమెను ఇంప్రెస్ చేయడం కోసం బ్రూక్ కోల్‌కతా బౌలర్లపై కనికరం లేకుండా చెలరేగిపోయాడు. కాగా బ్రూక్ రెండేళ్లుగా లూసీతో డేటింగ్ చేస్తున్నాడు. అమ్మాయిలను ఇంప్రెస్ చేయడానికి అబ్బాయిలు ఏమైనా చేస్తారని నెటిజన్లు అంటున్నారు. పాకిస్థాన్ ప్రీమియర్ లీగ్‌తో పాటు అంతర్జాతీయ క్రికెట్‌లో ఇరగదీసిన బ్రూక్‌ను సన్‌ రైజర్స్ … Read more