• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • డిసెంబర్ 19న ఐపీఎల్‌ వేలం

  ఐపీఎల్‌ 2024 సీజన్‌కు సంబంధించి డిసెంబర్‌ 19న వేలం నిర్వహించనున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. దుబాయ్‌ వేదికగా ఈ వేలం ఉంటుందని స్పష్టం చేసింది. నవంబర్ 26లోగా ప్రతీ ఫ్రాంఛైజీ తాము రిటైన్ చేసుకుంటున్న ప్లేయర్లు, వేలానికి వదిలేసిన ఆటగాళ్ల వివరాలను తెలియజేయాలని సూచించింది. ఈసారి ఐపీఎల్ 2024 వేలంలో ప్రతీ ఫ్రాంఛైజీ రూ.100 కోట్ల పర్సు వాల్యూను కలిగి ఉండనున్నాయి. గతంలో ఫ్రాంఛైజీల పర్సు వాల్యూ రూ.95 కోట్లు ఉండగా ఈసారి రూ.5 కోట్లు పెరిగింది.

  IPL Brand Value: దిమ్మతిరిగేలా చేస్తున్న ఐపీఎల్‌ జట్ల బ్రాండ్ వాల్యూ.. ఏ జట్టుకు ఎంత ఆదాయం అంటే?

  ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (IPL).. దీనికున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వరల్డ్​ వైడ్​గా ఈ లీగ్​కు ఉన్నంత క్రేజ్ ఇతర ఏ క్రికెట్ లీగ్​కు లేదు.​ 2008లో ప్రారంభమైన ఈ లీగ్​ ప్రతీ ఏడాది విశేష ఆదరణ, ఆదాయాన్ని అందుకుంటూ ముందుకెళ్తోంది. ఈ ఏడాది ఐపీఎల్‌ బ్రాండ్‌ విలువ ఏకంగా 3.2 బిలియన్‌ అమెరికా డాలర్లకు చేరింది. అంటే భారత కరెన్సీలో రూ.26,432 కోట్లు. అమెరికాకు చెందిన బహుళజాతి స్వతంత్ర పెట్టుబడి బ్యాంకు, ఆర్థిక సేవల సంస్థ హౌలిహన్‌ లోకీ తన నివేదికలో … Read more

  IPL 2023 Records: ఐపీఎల్‌లో బద్దలైన రికార్డులు.. ఈ సీజన్‌లో ఇంత విధ్వంసం జరిగిందా?

  ఐపీఎల్‌-2023 సీజన్‌ క్రికెట్‌ అభిమానులను ఎంతగానో అలరించింది. ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లతో పూర్తి వినోదాన్ని పంచింది. ఫలితం కోసం చివరి బంతి వరకూ వెళ్లిన మ్యాచ్‌లు ఈ సీజన్‌లో ఎన్నో ఉన్నాయి. రూ.కోట్లు కుమ్మరించి కొనుక్కున్న స్టార్‌ ఆటగాళ్లు ఈ ఏడాది విఫలం కాగా, సరిగ్గా పేరు కూడా తెలియని యంగ్‌స్టర్స్ ధూమ్‌ ధామ్‌ ఇన్నింగ్స్‌లతో చెలరేగి ఆడారు. తమ ధనాధన్‌ బ్యాటింగ్‌తో క్రికెట్ అభిమానులను కట్టిపడేశారు. గత సీజన్లతో పోలిస్తే ఈ ఐపీఎల్‌లో పరుగుల వరద పారింది. పలు రికార్డులు సైతం బద్దలయ్యాయి. … Read more

  Most Matches Played in IPL: ఐపీఎల్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్లు వీరే! 

  ఐపీఎల్‌-2023 సీజన్‌ ఎన్నో రికార్డులకు వేదికైంది. అత్యధిక సెంచరీలు, హై స్కోరింగ్‌ మ్యాచ్‌లు, చివరి బాల్‌ విన్స్‌ ఇలా ఎన్నో మరుపురాని గుర్తులతో ఈ సీజన్‌ ముగిసింది. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన తుదిపోరులో చెన్నై విజయం సాధించగా.. ఈ మ్యాచ్‌ ద్వారా  ఐపీఎల్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా ధోని నిలిచాడు. ఈ నేపథ్యంలో ధోని తర్వాత అత్యధిక మ్యాచ్‌లు ఆడింది ఎవరు? వారి రన్స్ ఎలా ఉన్నాయి? హై స్కోర్‌ ఎంత? ఇప్పుడు తెలుసుకుందాం 1. ఎం.ఎస్‌ ధోని ఐపీఎల్‌లో 250 మ్యాచ్‌లు … Read more

  IPL 2023 Winning Moments: ధోని కంట తడి.. అంబటి రాయుడికి ట్రోఫీ.. వాహ్.. క్రేజీ విన్నింగ్‌ మూమెంట్స్‌!

  ఐపీఎల్‌-2023 టైటిల్‌ను చెన్నై సూపర్‌ కింగ్స్‌ కైవసం చేసుకుంది. డిఫెండింగ్‌ ఛాంపియన్ గుజరాత్‌ టైటాన్స్‌ను ఓడించి ఐదోసారి టైటిల్‌ విజేతగా అవతరించింది. చివరి రెండు బంతులకు 10 పరుగులు కావాల్సిన సమయంలో జడేజా సిక్స్‌, ఫోర్‌గా మలచడంతో చెన్నై శిబిరం సంబరాల్లో మునిగితేలింది.  ఎప్పుడు కూల్‌గా ఉంటూ హావభావాలను ప్రదర్శించని ధోని.. చెన్నై విజయంతో తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. చివరి రెండు బంతుల సమయంలో కళ్లు మూసుకుని ఉండడం కెమెరాల్లో కనిపించింది. జడేజా తనదైన ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ను గెలిపించడంతో ధోనీ సంతోషానికి అవదులు లేకుండా … Read more

  చెన్నై మ్యాచ్ విన్నింగ్ క్షణాలు.. గూస్ బంప్స్

  చివరి బంతి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో చెన్నె గెలిచిన క్షణాలు గూస్ బంప్స్ తెప్పించాయి. ముఖ్యంగా ధోని మోములో ఆనందం, ఉబికి వస్తున్న అతని కంటతడి ప్రతి చెన్నై అభిమానిని కన్నీళ్లు పెట్టించింది. చివరి బంతికి ఫోర్ కొట్టి మ్యాచ్‌ను గెలిపించిన జడేజాను ధోని అమాంతం హత్తుకుని కంటతడి పెట్టాడు. గ్రౌండ్‌లో తిరుగుతూ ప్రేక్షకులకు విజయానందాన్ని పంచాడు. అనంతరం గుజరాత్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యాను హత్తుకుని ఓదార్చాడు. మరోవైపు గ్రౌండ్‌లో చిన్న పిల్లల మాదిరి చెన్నై ప్లేయర్లు ఆనందంతో కేరింతలు కొట్టారు. … Read more

  Ambati Rayudu: ఐపీఎల్‌లో రాయుడి విధ్వంసం.. టాప్‌-5 బెస్ట్ ఇన్నింగ్స్ ఇవే!

  తెలుగు తేజం, చెన్నై సూపర్‌ కింగ్స్‌ స్టార్‌ బ్యాటర్‌ అంబటి రాయుడు ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. నేడు గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగే ఐపీఎల్‌ ఫైనల్‌ మ్యాచే అతడి కెరీర్‌లో చివరిది.  2010లో ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన రాయుడు.. ముంబయి ఇండియన్స్‌, చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఇప్పటివరకు 203 మ్యాచ్‌లు ఆడిన రాయుడు 28.29 సగటుతో 4,329 పరుగులు సాధించాడు. ఐపీఎల్‌లో 4 వేల పరుగుల మార్క్‌ను అందుకున్న టాప్‌-10 ఇండియన్‌ బ్యాటర్లలో ఒకడిగా నిలిచాడు.  2010-2017 మధ్య ముంబయి ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం … Read more

  టాస్ గెలిస్తే చెన్నై బ్యాటింగ్?

  ఐపీఎల్ ఫైనల్‌ సన్నద్ధతపై చెన్నై కోచ్ స్టిఫెన్ ఫ్లేమింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఫైనల్ ఎప్పుడూ ప్రత్యేకమే. ఫైనల్స్‌లో మా రికార్డు 50శాతంగా ఉంది. శుభ్‌మన్‌ గిల్ అద్భుతంగా ఆడుతున్నాడు. గిల్‌ను త్వరగా ఔట్‌ చేయాల్సి ఉంది. గత మ్యాచ్‌లో త్వరగా వికెట్లను తీయడం వల్ల GT పైచేయి సాధించగలిగాం. తొలి క్వాలిఫయర్‌లో తొలుత మేం బౌలింగ్‌ చేయాలని భావించాం. కానీ ఫస్ట్‌ బ్యాటింగ్‌ చేయడం సరైందేనని తేలింది. ఈసారి టాస్ కీలకం. మాకున్న అనుభవంతో ఫైనల్‌ మ్యాచ్‌లో కచ్చితంగా విజయం సాధిస్తాం’ అని … Read more

  IPL 2023: ఆట మాత్రమే కాదు.. ఈ సీజన్‌లో ఇన్ని జరిగాయా?

  ఐపీఎల్‌కు భారత్‌లో ఎంత క్రేజ్‌ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఐపీఎల్‌ అంటే భారత క్రీడాభిమానులకు ఓ క్రికెట్‌ పండగ లాంటిది. సాయంత్రమైతే చాలు క్రికెట్‌ లవర్స్‌ టీవీలకు అతుక్కుపోతుంటారు. ఉత్కంఠరేపే మ్యాచ్‌లనూ చూస్తూ తెగ ఎంజాయ్ చేస్తుంటారు. అంతటి ఖ్యాతి కలిగిన ఐపీఎల్‌లో ఏ చిన్న విషయం జరిగినా ప్రత్యేకంగా నిలుస్తుంది. ఇందుకు అనుగుణంగానే ఇప్పటివరకూ జరిగిన ప్రతీ ఐపీఎల్‌ సీజన్‌ చాలా మెమోరీలను ప్రేక్షకులకు అందించాయి. తాజాగా ఈ సీజన్‌లోనూ కొన్ని ఆసక్తికర ఘటనలు చోటుచేసుకున్నాయి. ఆవేంటో ఇప్పుడు చూద్దాం.  ధోని … Read more

  IPL 2023 Final: ముంబయి vs చెన్నై తలపడితే టైటిల్‌ ఎవరికి? గణంకాలు ఏం చెబుతున్నాయి..!

  ఐపీఎల్‌-2023 తుది దశకు చేరుకుంది. ఈ సీజన్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన చెన్నై, గుజరాత్‌, ముంబయి జట్లు టైటిల్‌ రేసులో నిలిచాయి. ధోని నేతృత్వంలోని చెన్నై సూపర్‌ కింగ్స్ ఇప్పటికే ఫైనల్‌ చేరింది. గుజరాత్‌-ముంబయి మధ్య జరిగే ఎలిమినేటర్ మ్యాచ్‌లో గెలిచిన జట్టు తుదిపోరులో చైన్నెతో తలపడుతుంది. అయితే ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన జట్లుగా ముంబయి, చెన్నైకి పేరుంది. టైటిల్‌ పోరు మరింత రసవత్తరంగా మారాలంటే పైనల్స్‌ ముంబయి వెళ్లాల్సిందేనని ఐపీఎల్‌ అభిమానులు కోరుకుంటున్నారు. అశ్విన్‌ వంటి స్టార్‌ క్రికెటర్లు సైతం బహిరంగంగా ఇదే … Read more