• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • IPL 2024 Playoffs Probabilities: ఐపీఎల్‌లో ప్లే ఆఫ్స్‌కు వెళ్లే జట్లు ఇవే.. వాటికి మాత్రం ఇక చావో రేవో!

    ఐపీఎల్‌ 2024 సీజన్‌ తుది అంకానికి చేరుకుంటోంది. పది జట్లలో ప్రతీ టీమ్‌ ఇప్పటివరకూ కనీసం 11 మ్యాచ్‌లు ఆడాయి. గత సీజన్లలో ఈ పాటికే ప్లేఆఫ్స్‌ బెర్తులపై ఓ అంచనా వచ్చేది. అయితే ఈ సీజన్‌లో అలా లేదు. ప్రతీ మ్యాచ్‌కు పాయింట్స్‌ టేబుల్‌లో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దీంతో ఏ జట్టు ప్లేఆఫ్స్‌కు వెళ్తుందో ఊహించడం క్రీడా నిపుణులకు సైతం కష్టంగా మారుతోంది. ప్రస్తుతం టేబుల్లో టాప్ ఉన్న కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ జట్లు ప్లేఆఫ్స్‌ (IPL Playoffs 2024 Chances Percentage) బెర్తును దాదాపుగా ఖరారు చేసుకున్నాయి. ఇక మిగిలిన రెండు స్థానాల కోసం పోటీలో 8 టీమ్స్‌ ఉన్నాయి. వీటిలో ప్లేఆఫ్స్‌ ఛాన్స్‌ ఏ జట్లకు మెరుగ్గా ఉన్నాయి? వాటి సమీకరణాలు ఏంటి? ఈ కథనంలో చూద్దాం. 

    ఆ జట్లు ఎలా ఫిక్స్‌ అంటే!

    ఈ సీజన్‌లో ఇప్పటివరకూ 11 మ్యాచ్‌లు ఆడిన కోల్‌కత్తా నైట్‌ రైడర్స్ (Kolkata Knight Riders) జట్టు 8 విజయాలతో 16 పాయింట్లు సాధించి టేబుల్‌లో టాప్‌లో నిలిచింది. అటు రాజస్థాన్‌ రాయల్స్‌ (Rajasthan Royals) కూడా 11 మ్యాచ్‌ల్లో ఎనిమిదింట గెలిచి 16 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. నెట్‌ రన్‌రేట్‌ కారణంగా RR సెకండ్‌ పొజిషన్‌లో ఉంది. మిగిలిన మూడు మ్యాచుల్లో కనీసం ఒక్కటి గెలిచినా ఈ జట్లు ప్లేఆఫ్స్‌కి అర్హత సాధిస్తాయి. ఒకవేళ ఈ రెండు జట్లూ తమ మిగతా మ్యాచుల్లో ఓడిపోయినా ప్లేఆఫ్స్ అవకాశం ఉంటుంది. ఇతర జట్ల ఫలితాల ఆధారంగా రన్‌రేట్‌ను బేరీజు వేసుకుని వాటికి ప్లేఆఫ్స్‌ బెర్తు దక్కనుంది. 

    చెన్నై సూపర్‌ కింగ్స్‌ (Chennai Super Kings) 

    డిఫెండింగ్‌ ఛాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ (CSK) ఈ సీజన్‌లో కాస్త తడబడుతోంది. రెండు మ్యాచ్‌లు గెలిస్తే రెండు మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూస్తోంది. ఇటీవల పంజాబ్‌పై విజయం ద్వారా CSK ప్లేఆఫ్స్‌ రేసులోకి దూసుకొచ్చింది. ఈ సీజన్‌లో 11 మ్యాచ్‌లు ఆడిన చెన్నై ఆరు విజయాలతో 12 పాయింట్లు సాధించి టేబుల్‌లో మూడో స్థానంలో ఉంది. రుతురాజ్‌ సేన తన తర్వాతి మూడు మ్యాచ్‌లు గుజరాత్, రాజస్థాన్, బెంగళూరుతో ఆడాల్సి ఉంది. అన్నింట్లోనూ గెలిస్తే 18 పాయింట్లతో ఎలాంటి సమస్య లేకుండా నేరుగా నాకౌట్‌కు చేరుకుంటుంది. ఒక్క మ్యాచ్‌లో ఓడినా ప్లే ఆఫ్స్‌ అవకాశాలు సన్నగిల్లుతాయి. ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి వస్తుంది.

    సన్‌రైజర్స్ హైదరాబాద్‌ (Sunrisers Hyderabad)

    గత సీజన్లతో పోలిస్తే (IPL Playoffs 2024 Chances Percentage) ఈ ఏడాది సన్‌రైజర్స్ హైదరాబాద్‌ ప్రారంభ మ్యాచ్‌లలో మెరుగైన ప్రదర్శన చేసింది. ఆ జట్టు బ్యాటర్లు పరుగుల వరద పారించారు. అయితే గత ఐదు మ్యాచుల్లో ఆ దూకుడు తగ్గింది. ఫలితంగా ఐదింటిలో SRH రెండు మ్యాచ్‌లలో మాత్రమే గెలిచింది. ఇప్పటివరకూ 11 మ్యాచ్‌లు ఆడిన సన్‌రైజర్స్‌ ఆరు విజయాలతో 12 పాయింట్లు సాధించి నాలుగో స్థానంలో ఉంది. ప్లేఆఫ్స్‌కు వెళ్లాలంటే ఆ జట్టు మిగతా మూడు మ్యాచ్‌లలో  తప్పక గెలవాల్సి ఉంటుంది. అలా అయితేనే ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా SRH.. 18 పాయింట్లతో నాకౌట్‌కు వెళ్లగల్గుతుంది. ఏ ఒక్క మ్యాచ్‌ ఓడిన.. నెట్‌ రన్‌రేట్‌తో పాటు ఇతర జట్ల ప్రదర్శనపై ఆ జట్టు అవకాశాలు ఆధారపడతాయి. SRH.. తన తర్వాతి మ్యాచుల్లో LSG, GT, PBKS జట్లతో తలపడనుంది. మూడు మ్యాచ్‌లు హోమ్‌గ్రౌండ్‌లో జరగనుండటం సన్‌రైజర్స్‌కు కలిసి రానుంది. 

    లక్నో సూపర్‌ జెయింట్స్‌ (Lucknow Super Giants)

    కేఎల్‌ రాహుల్‌ నేతృత్వంలోనే లక్నో జట్టు.. ఈ సీజన్‌లో 6 విజయాలతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతోంది. కోల్‌కత్తాతో జరిగిన మ్యాచ్‌లో 98 పరుగుల తేడాతో ఘోర ఓటమిని చవి చూసిన LSG.. నెట్‌ రన్‌రేట్‌ పరంగా మైనస్‌లోకి వెళ్లిపోయింది. ఫలితంగా మిగిలిన మూడు మ్యాచుల్లోనూ గెలిస్తేనే లక్నోకు ప్లేఆఫ్స్ బెర్తు దక్కుతుంది. తన తర్వాత మ్యాచుల్లో హైదరాబాద్‌, దిల్లీ, ముంబయి వంటి బలమైన జట్లను లక్నో ఎదుర్కొవాల్సి ఉంటుంది. వీటిల్లో గెలిస్తే నేరుగా ఆ జట్టు నాకౌట్‌ దశకు చేరుకుంటుంది. ఏ మ్యాచ్‌లో ఓడినా ప్లేఆఫ్ అవకాశాలు సంక్లిష్టంగా మారతాయి. ఇతర జట్ల గెలుపోటములపై ఆధార పడాల్సి వస్తుంది. 

    ఢిల్లీ క్యాపిటల్స్‌ (Delhi Capitals)

    ఈ సీజన్‌లో వరుస ఓటములతో ఇబ్బంది పడ్డ ఢిల్లీ క్యాపిటల్స్ (IPL Playoffs 2024 Chances Percentage) గత ఐదు మ్యాచుల్లో మూడింట గెలిచి ప్లేఆఫ్‌ అవకాశాలను సంజీవంగా ఉంచుకుంది. ప్రస్తుతం ఈ జట్టు 12 మ్యాచుల్లో ఆరు విజయాలతో 12 పాయింట్లు సాధించి టేబుల్‌లో ఐదో స్థానంలో ఉంది. మిగిలిన రెండు మ్యాచుల్లో గెలిస్తే 16 పాయింట్లు వస్తాయి. అయినా ప్లేఆఫ్స్ బెర్తు దక్కుతుందనే నమ్మకం తక్కువే. చెన్నై, లక్నో, హైదరాబాద్‌ తమ మిగతా మ్యాచుల్లో ఓడిపోతేనే దిల్లీకి ఛాన్స్‌ ఉంటుంది. ఇక దిల్లీ తన తదుపరి మ్యాచుల్లో బెంగళూరు, లక్నోతో తలపడాల్సి ఉంది.

    ఇతర జట్లు (IPL Other Teams)

    రాయల్ ఛాలెంజర్‌ బెంగళూరు (Royal Challengers Bangalore), పంజాబ్‌ కింగ్స్‌ (Punjab Kings), ముంబయి ఇండియన్స్‌ (Mumbai Indians), గుజరాత్‌ టైటాన్స్‌ (Gujarat Titans) జట్ల ప్లేఆఫ్స్‌ తలుపులు పూర్తిగా మూసుకుపోయినట్లే. ఆర్సీబీ, పంజాబ్‌, గుజరాత్‌ జట్లు 11 మ్యాచులు ఆడి కేవలం నాలుగు విజయాలతో 8 పాయింట్లు సాధించాయి. అటు ముంబయి 12 మ్యాచ్‌లలో నాలుగు విజయాలతో టేబుల్‌లో చివరి నుంచి రెండు స్థానంలో ఉన్నాయి. ఈ జట్లు ప్లేఆఫ్స్‌కు వెళ్లాలంటే చెన్నై, లక్నో, సన్‌రైజర్స్‌, ఢిల్లీ జట్లు తమ తదుపరి అన్ని మ్యాచుల్లో ఓడిపోవాల్సి ఉంటుంది. ఇది సాధ్యపడే అవకాశం లేదు. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv