• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • SRH కావ్యకు పెళ్లి ప్రపోజల్‌

  సన్‌ రైజర్స్ జట్టు ఓనర్‌ కావ్య మారన్‌కు ఫ్యాన్‌ బేస్‌ ఎక్కువే. సోషల్‌ మీడియాలో ఆమె ఫోటో వచ్చిందంటే చాలు వైరల్‌ అయిపోతుంది. అయితే ఈ అందాల సుందరికి గ్రౌండ్‌లో ఓ వ్యక్తి ప్రపోజ్ చేశాడు. “కావ్యా..నన్ను పెళ్లి చేసుకుంటావా?” అంటూ ప్లకార్డు పట్టుకుని కూర్చున్నాడు. SA20 లీగ్‌లో పార్ల్‌ రాయల్స్‌, సన్‌రైజర్స్‌ ఈస్టర్‌ కేప్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఈ దృశ్యం వెలుగుచూసింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది.

  SRH జట్టును నాశనం చేయకండి

  సన్‌ రైజర్స్‌పై అఫ్గానిస్తాన్‌ ఆల్‌రౌండర్‌ మహ్మద్‌ నబీ తీవ్ర విమర్శలు చేశాడు.“గత రెండేళ్లుగా ఎస్ఆర్‌హెచ్‌లో పరిస్థితులన్ని మారిపోయాయి. ఆ ఫ్రాంఛైజీకి ఆడేందుకు ఆటగాళ్లు ఇష్టపడటం లేదు. జట్టును నాశనం చేయడానికి బదులు పటిష్ఠం చేసేందుకు ప్రయత్నించండి. పేరున్న ఫ్రాంఛైజీగా మీరు చేయాల్సిన పని అది. ఐదేళ్లు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న రషీద్ వెళ్లిపోయేలా చేసుకున్నారు. టాప్‌ ప్లేయర్ల పట్ల కూడా ఇదే వైఖరి. అసలు వాళ్లకి ఏం కావాలో అర్థం అవుతుందా” అంటూ విమర్శించాడు.

  SRH తర్వాతి కెప్టెన్ ఇతడేనా..?

  సన్ రైజర్స్ హైదరాబాద్(SRH) జట్టు కెప్టెన్ వేటలో పడింది. గత సీజన్ వరకు సారథిగా వ్యవహరించిన విలియమ్సన్‌ని జట్టు వదులుకుంది. ఈ క్రమంలో జట్టు తర్వాతి కెప్టెన్‌గా పంజాబ్ ప్లేయర్ అభిషేక్ శర్మను తీసుకోవాలని యోచిస్తున్నట్లు సమాచారం. తాజాగా, అభిషేక్ శర్మ నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ‘వీర శూర’ అనే కామెంట్ కూడా జత చేయడంతో ఈ ఊహాగానాలకు ఊతమిచ్చినట్లు అయింది. గత సీజన్‌లో అభిషేక్ శర్మ ఇరగదీశాడు. 400కు పైగా పరుగులు చేశాడు. అమృత్‌సర్ … Read more

  కేన్‌ మామకు SRH గుడ్‌ బై

  ఐపీఎల్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ను ఫ్రాంచైజీ వదలుకోనున్నట్లు తెలుస్తోంది. సరైన ఫాంలో లేకపోవటంతో పాటు తరచూ గాయాల బెడద వేదిస్తుండటంతో ప్రత్యామ్నాయంగా దిశగా దృష్టి పెట్టారని సమాచారం. వచ్చే సీజన్‌లో హైదరాబాద్‌ జట్టులో చాలామార్పులు చేర్పులు చేసేందుకు సన్నాహాలు మెుదలుపెట్టారట. రొమారియో షెఫర్డ్‌కు కూడా ఉద్వాసన పలుకుతారని టాక్‌ నడుస్తోంది. అంతకు ముందు ఏడాది వార్నర్‌ను కూడా SRH ఇలాగే వదులుకుంది.

  సన్‌రైజర్స్‌ హెడ్‌కోచ్‌గా బ్రియాన్ లారా

  వెస్టిండీస్‌ క్రికెట్‌ దిగ్గజం బ్రియాన్‌ లారా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ హెడ్‌కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. ఇప్పటిదాకా హెడ్‌ కోచ్‌గా ఉన్న టామ్‌ మూడీకి శనివారం SRH గుడ్‌బై చెప్పింది. 2022 ఐపీఎల్‌లోనూ లారా SRH వ్యూహ నిర్మాతగా కొనసాగారు. టామ్‌ మూడీ గతేడాదే సన్‌రైజర్స్‌ బాధ్యతలు తీసుకున్నారు. 2021లో ట్రెవర్‌ బేలిస్‌ తీవ్రంగా నిరాశ పరిచిన వేళ మూడీకి తిరిగి బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం ఉమ్మడి ఒప్పందంతో మూడీ బాధ్యతల నుంచి తప్పుకున్నారు.

  ఒక్క దెబ్బకు రెండు పిట్టలు.. తడాఖా చూపించిన RCB

  గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచులో ఆర్సీబీ విజయం సాధించడంతో ప్లే ఆఫ్స్ కు వెళ్తామని ఇన్ని రోజులు ఆశలు పెట్టుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ జట్లకు పెద్ద షాక్ తగిలింది. ఆర్సీబీ గెలుపుతో వీరికి ప్లే ఆఫ్స్ వెళ్లే అవకాశం లేకుండా పోయింది. ఆర్సీబీ ప్రస్తుతం 14 మ్యాచులాడి ఎనిమిదింటిలో గెలిచింది. సన్ రైజర్స్ VS పంజాబ్ కింగ్స్ జట్లలో ఎవరు గెల్చినా కానీ పెద్దగా ప్రయోజనం లేదు. కేవలం ఢిల్లీకి మాత్రమే ప్లే ఆఫ్స్ వెళ్లేందుకు అవకాశం ఉంది. … Read more

  రెయిజ్ అయిన SRH.. బ్యాటింగ్.. ముంబై ముందు భారీ టార్గెట్

  ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచులో ఆరెంజ్ ఆర్మీ బ్యాటర్లు చెలరేగారు. కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఓపెనర్ గా రాణించడం లేదంటూ ఇంటా బయటా విమర్శలు రావడంతో ఈ రోజు ఆయన ఓపెనర్ గా రాలేదు. మిడిలార్డర్ బ్యాటర్ శశాంక్ సింగ్ ను పక్కన పెట్టి ప్రియం గార్గ్‌(42)ను తీసుకొచ్చారు. అతడు తృటిలో అర్ధ సెంచరీని చేజార్చుకున్నాడు. వన్ డౌన్ లో వచ్చిన రాహుల్ త్రిపాఠి (76) చెలరేగాడు. దీంతో ఆరెంజ్ ఆర్మీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు … Read more

  టాస్ ఓడిన SRH

  నేటి ఐపీఎల్ మ్యాచులో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన రోహిత్ మరో ఆలోచన లేకుండా బౌలింగ్ చేసేందుకే మొగ్గు చూపాడు. ఈ మ్యాచులో ఓడితే ఇక ఆరెంజ్ ఆర్మీకి ప్లే ఆఫ్స్ ఆశలు ఉండవు. మరి ఈ మ్యాచులో కేన్ సేన సత్తా చాటుతుందో లేదో చూడాలి. ఆరెంజ్ ఆర్మీ వరుసగా ఐదు మ్యాచుల్లో ఓడిపోయింది.

  నేడైనా ఆరెంజ్ ఆర్మీ నెగ్గేనా?

  సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు నేడైనా నెగ్గుతుందా అని క్రీడాభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వరుసగా ఐదు మ్యాచుల్లో ఓడిన కేన్ సేన నేడు టోర్నీ నుంచి ఇప్పటికే నిష్క్రమించిన రోహిత్ సేనతో తలపడేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్నా కానీ ఎక్కడో డై హార్డ్ ఫ్యాన్స్ కు చిన్న ఆశ ఉంది. కానీ ఈ రోజు మ్యాచ్ ఓడిపోతే మాత్రం ప్లే ఆఫ్స్ రేసు నుంచి పూర్తిగా తప్పుకోనుంది. మరి ఈ రోజటి మ్యాచులోనైనా ఆరెంజ్ ఆర్మ విజయం సాధిస్తుందో … Read more

  177 పరుగులు చేసిన కేకేఆర్.. రస్సెల్ మెరుపు ఇన్నింగ్స్

  సన్ రైజర్స్ తో జరుగుతున్న మ్యాచులో టాస్ గెలిచి మొదటి బ్యాటింగ్ తీసుకున్న శ్రేయస్ సేన నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి.. 177 పరుగులు చేసింది. కేకేఆర్ బ్యాటర్లను ఆరెంజ్ ఆర్మీ బౌలర్లు నిలువరించగలిగారు. సునామీ స్టార్ రస్సెల్ భయంకర ఇన్నింగ్స్ తో కేకేఆర్ జట్టు ఆ మాత్రమైనా స్కోరు చేయగలిగింది. SRH బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్ 3, జన్సెన్, నటరాజన్, భువనేశ్వర్ తలా ఒక వికెట్ తీసుకున్నారు. చివరి ఓవర్లో రస్సెల్(49*) మూడు సిక్సర్లు బాది 20 పరుగులు పిండుకున్నాడు.