ఐపీఎల్-15వ సీజన్ దాదాపు తుది అంకానికి చేరుకుంది. మొత్తం 10 జట్ల మధ్య సాగిన పోరులో ప్లే ఆఫ్స్ భర్తీ కోసం దాదాపు 8 జట్లు పోరాడుతున్నాయి. ఇప్పటికే ముంబై జట్టు ప్లే ఆఫ్స్ నుంచి అధికారికంగా వైదొలిగినా చెన్నై కొద్దొగొప్పో ఆశలతో ఆడుతుంది. మిగతా ఎనిమిది జట్లతో అనధికారికంగా దాదాపు గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ మొదటి, రెండు స్థానాల కోసం పోటీపడుతూ ప్లే ఆఫ్స్ చేరుకున్నాయి. మిగతా రెండు స్థానాల కోసం రాజస్థాన్, బెంగళూరు, హైదరాబాద్, దిల్లీ, పంజాబ్, కోల్‌కత్తా తీవ్రంగా శ్రమిస్తున్నాయి.
సీజన్ ఆరంభంలో వరుసగా రెండు మ్యాచులు ఓడి, ఐదు మ్యాచులు గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ సులభంగా ప్లే ఆఫ్స్ చేరుతుందనుకున్నారు. కాని వరుసగా మళ్లీ నాలుగు మ్యాచులు ఓడి ప్లేఆఫ్స్ ఆశలను మరింత సంక్లిష్టం చేసుకోవడంతో అభిమానులు నిరాశలో ఉన్నారు. అసలు హైదరాబాద్ ప్లే ఆఫ్స్ చేరే అవకాశం ఉందా..? ఒకవేళ చేరాలంటే సమీకరణలు ఎలా ఉండాలి..? లాంటి అంశాలను ఓసారి పరిశీలిద్దాం.
ఛాన్స్ నెంబర్-1
హైదరాబాద్ జట్టు ఇప్పటివరకు 11 మ్యాచులు ఆడి ఐదిట్లో గెలిచి 10 పాయింట్లతో ఆరో స్థానంలో కొనసాగుతుంది. బెంగళూరుతో జరిగిన 54వ మ్యాచులో 67 పరుగుల భారీ తేడాతో ఓడిపోయి నెట్ రన్ రేట్ మైనస్‌లో పడింది. ఈ రన్‌రేట్ ప్లేస్ అయ్యేలా మిగతా మూడు మ్యాచుల్లో హైదరాబాద్ భారీ విజయాలు నమోదు చేసుకుంటే నాలుగో స్థానాన్ని కైవసం చేసుకోవచ్చు. ఆర్సీబీ వరుసగా రెండు మ్యాచులు గెలిచినా కూడ రన్‌రేట్ అధికంగా ఉంటే SRH ప్లేఆఫ్స్ చేరే అవకాశాలు ఉన్నాయి.
ఛాన్స్ నెంబర్-2
మూడు, నాలుగు స్థానాల కోసం రాజస్థాన్, బెంగళూరు, దిల్లీ, పంజాబ్, కలకత్తా పోటీ పడుతున్నాయి. ఈ జట్లని తదుపరి మ్యాచుల్లో కనీసం ఒక్క మ్యాచ్ ఓడినా హైదరాబాద్ జట్టుకు కొద్దీగా ప్లే ఆఫ్స్ చేరే అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. కాని SRH మాత్రం ఒక్క మ్యాచ్ ఓడినా దాదాపు ఇంటిబాట పట్టాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు. ఈ జట్టు తన తదుపరి మూడు మ్యాచులను కోల్‌కత్తా, పంజాబ్, ముంబైలతో ఆడనుంది. ముంబై తప్ప మిగిలిన రెండు జట్లు ప్లే ఆఫ్స్ రేసులో ఉన్నాయి.
మూడో స్థానం కూడ దాదాపు ఖరారు
ప్లే ఆఫ్స్ రేసులో మూడో స్థానం కూడ దాదాపు రాజస్థాన్ కైవసం చేసుకున్నట్లే కనిపిస్తుంది. ఈ జట్టు ఇప్పటి వరకు 11 మ్యాచులు ఆడి ఏడిట్లో గెలుపొంది 14 పాయింట్లు సాధించింది. రన్‌రేట్ కూడ ప్లస్‌లో ఉండటంతో మూడో స్థానంలో కొనసాగుతుంది. బెంగళూరు మాత్రం 12 మ్యాచులు ఆడి ఏడిట్లో నెగ్గి మైనస్ రన్‌రేట్‌తో నాలుగో స్థానంలో కొనసాగుతుంది. ఇంకో రెండు వారాల్లో ముగిసే ఈ లీగ్ దశలో ఏ జట్టు ప్లే ఆఫ్స్‌లో అడుగుపెడుతుందో వేచి చూడాలి.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!