SRH పేస్ సంచలనం ఉమ్రాన్ మాలిక్ రోజురోజుకూ రాటుదేలుతున్నాడు. మాజీ స్పీడ్ స్టర్, SRH బౌలింగ్ కోచ్ డేల్ స్టెయిన్ నాయకత్వంలో ఈ యంగ్ గన్ భయంకరంగా తయారవుతున్నాడు. నిన్నటి మ్యాచులో గుజరాత్ జట్టువి 5 వికెట్లు పడితే ఆ ఐదు కూడా ఉమ్రాన్ మాలికే తీయడం విశేషం. అతడు సాహాకు వేసిన బంతయితే మైండ్ బ్లోయింగ్. అతడి బుల్లెట్లకు ఔటైన గిల్, పాండ్యా, సాహా, మిల్లర్, మనోహర్ లలో కేవలం పాండ్యా మాత్రమే క్యాచ్ అవుట్ అయ్యాడు. మిగతా నలుగురు బ్యాటర్లు క్లీన్ బౌల్డ్ అయ్యారు. తుపాకి నుంచి దూసుకొస్తున్న బుల్లెట్లలా వస్తున్న ఉమ్రాన్ బంతులను చూసి గుజరాత్ బ్యాటర్లు బెంబేలెత్తిపోయారు. అతడు ఐపీఎల్ 5 వికెట్ హాల్ సంపాదించి అరుదైన రికార్డును తన పేర నమోదు చేసుకున్నాడు. ఉమ్రాన్ దెబ్బకు స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ ఉన్న గుజరాత్ టాప్ ఆర్డర్ కకావికలమైంది. తన కోటా 4 ఓవర్లు వేసిన ఉమ్రాన్ 5 వికెట్లు తీసి కేవలం 25 పరుగులు మాత్రమే ఇచ్చాడు. చివరికి SRH మ్యాచ్ ఓడిపోయినా కానీ.. ఉమ్రాన్ మాలిక్ మాత్రం మనసులను గెలిచాడనడంలో సందేహం లేదు.
https://youtube.com/watch?v=_UOuRnMbmlE
YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్