• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కీరవాణితో ఆర్జీవీ ఇంటర్వ్యూ

    ఆస్కార్ అవార్డ్‌ విన్నర్‌ కీరవాణితో సంచలన దర్శకుడు రామ్ గోపాల్‌ వర్మ ఇంటర్వ్యూ వీడియో ఇవాళ సాయంత్రం 7 గంటలకు రానుంది. RGV కొత్త యూట్యూబ్‌ చానల్‌ ‘నిజం’లో ఇది విడుదల కాబోతోంది.

    ఫర్హానా టీజర్‌కు 5 మిలియన్‌ వ్యూస్‌

    ఐశ్వర్య రాజేశ్ ప్రధాన పాత్రలో వస్తున్న సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ఫర్హానా. నెల్సన్‌ వెంకటేశన్‌ దర్శకత్వంలో వస్తున్న ఈ సనిమాను తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. మే 12న విడుదల కానున్న సినిమాకు సంబంధించిన టీజర్‌ ఇటీవల విడుదల చేయగా 5 మిలియన్ వ్యూస్ సాధించింది.

    అల్లరి నరేశ్‌ ‘ఉగ్రం’ ట్రైలర్‌ వచ్చేసింది

    విజయ్‌ కనకమేడల- అల్లరి నరేశ్ కాంబినేషన్‌లో వస్తున్న మరో సీరియస్‌ మూవీ ఉగ్రం. అల్లరి నరేశ్ మునుపెన్నడూ లేని రీతిలో ఓ సీరియస్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపించబోతున్నారు. మే 5న థియేటర్లలో విడుదల కాబోతున్న ఈ సినిమా ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది.

    ‘రామబాణం’ ట్రైలర్‌ వచ్చేసింది

    శ్రీవాస్ దర్శకత్వంలో గోపీచంద్‌ హీరోగా వస్తున్న మాస్‌ ఎంటర్‌టైనర్‌ ‘రామబాణం’. మే 5న థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ సందర్బంగా చిత్రబృందం ట్రైలర్‌ను విడుదల చేసింది. మాస్‌ లుక్‌లో గోపీచంద్‌ ఆకట్టుకుంటున్నాడు.

    ఉగ్రం: గాలి శీను, CI శివ కుమార్‌ను కలిస్తే..!

    విజయ్‌ కనక మేడల, అల్లరి నరేశ్‌ నుంచి వస్తున్న రెండో చిత్రం ‘ఉగ్రం’. నాంది వంటి సూపర్‌ హిట్‌ తర్వాత మే 5న ఈ సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతోంది. ఈ సందర్భంగా ట్రైలర్‌ రిలీజ్‌ డేట్‌ను చిత్రబృందం ఫన్నీగా అనౌన్స్‌ చేసింది. అల్లరి నరేశ్‌ సూపర్‌హిట్‌ పాత్ర ‘గాలి శీను’ ఉగ్రంలోని సీఐ శివకుమార్‌తో వీడియో కాల్‌లో మాట్లాడుతున్నట్లు ఈ వీడియో ఉంది. రేపు సాయంత్రం 6.03కు ట్రైలర్‌ను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు.

    8 బ్యాంకుల లైసెన్స్‌ రద్దు చేసిన RBI

    నిబంధనలు పాటించని 8 రకాల బ్యాంకులపై ఆర్బీఐ కొరఢా ఝులిపించింది. 8 సహకార బ్యాంకుల లైసెన్స్‌లను రద్దుచేసింది. తగినంత మూలధనం లేకపోవడం, బ్యాంకింగ్ నియంత్రణ చట్టాన్ని పాటించకపోవడం, భవిష్యత్‌లో నష్టాల బాట పట్టే ప్రమాదం ఉండటంతో RBI వీటి లైసెన్స్‌లు రద్దు చేసింది. లైసెన్స్‌ కోల్పోయిన బ్యాంకులు.1. ముధోల కో-ఆపరేటివ్ బ్యాంక్2. మిలాత్ కో-ఆపరేటివ్ బ్యాంక్3. శ్రీ ఆనంద్ కో-ఆపరేటివ్ బ్యాంక్4. రూపి కో-ఆపరేటివ్ బ్యాంక్5. దక్కన్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్6. లక్ష్మీ కో-ఆపరేటివ్ బ్యాంక్7. సేవా వికాస్ కో-ఆపరేటివ్ బ్యాంక్ బ్యాంక్ 2022-23 … Read more

    రూపాయి కాయిన్లతో MLAగా నామినేషన్‌

    [VIDEO](url):కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో యెంకప్ప అనే వ్యక్తి… పూర్తిగా రూపాయి నాణేలతో ఎమ్మెల్యేగా నామినేషన్‌ వేశాడు. నామపత్ర డిపాజిట్‌ రూ.10000లను పూర్తిగా రూపాయి నాణేల్లోనే చెల్లించాడు. యాద్గిర్‌ నియోజకవర్గం నుంచి యెంకప్ప స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధమయ్యాడు. మే 10న జరగబోయే ఎన్నికల్లో పోటీ చేసేందుకు అతడు నియోజకవర్గంలోని ప్రజల నుంచి రూపాయి రూపాయి సేకరించి నామినేషన్‌ వేశాడు. “స్వామి వివేకానంద సిద్ధాంతాలే నాకు స్ఫూర్తి. నా జీవితాన్ని నా ఊరి ప్రజలకు అంకితం చేస్తాను” అని యెంకప్ప అన్నాడు. #WATCH | … Read more

    హీరో చివరి సినిమా రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

    దివంగత నటుడు ఇర్ఫాన్‌ ఖాన్ చివరి సినిమా రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ అయింది. ఆయన నటించిన చివరి సినిమా ‘సాంగ్‌ ఆఫ్‌ ది స్కార్పియన్స్‌’ ఏప్రిల్‌ 28న ప్రేక్షకులను పలకరించనుంది. స్విస్‌-ఫ్రెంచ్‌-సింగపూర్‌-రాజస్థానీ భాషల్లో వస్తున్న ఈ సినిమా విడుదల చాలా రోజులుగా వాయిదా పడుతూ వస్తోంది. ఆగస్ట్‌ 2017లోనే ఈ సినిమా స్విట్జర్లాండ్‌లో జరిగిన లోకార్నో ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ప్రదర్శితమైంది. అనూప్‌ సింగ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా కథ ఓ ఒంటెల వర్తకుడు, ఓ గిరిజన యువతి ప్రేమ చుట్టూ తిరుగుతుంది.

    అఖిల్‌ “ ఏజెంట్” ట్రైలర్ వచ్చేసింది

    స్టైలిష్‌ డైరెక్టర్‌ సురేందర్‌ రెడ్డి, అక్కినేని అఖిల్‌ కాంబినేషన్‌లో వస్తున్న ‘ఏజెంట్‌’ సినిమా ట్రైలర్‌ విడుదలైంది. ఈ సినిమాతో అఖిల్‌ రేంజ్‌ పాన్‌ ఇండియాకు వెళ్తుందని చిత్రబృందం పక్కా ధీమాతో ఉంది. మరి ట్రైలర్‌ చూశాక మీకు అదే అనిపిస్తే కామెంట్‌ చేయండి. 2020లో అఖిల్ ఏజెంట్ సినిమా చేస్తున్నట్లు ప్రకటించాడు. కరోనా కారణంగా ఏడాది ఆలస్యం అయ్యింది. 2021లో చిత్రాన్ని ప్రారంభించారు. అప్పట్నుంచి షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా కాస్త ఆలస్యంగానే విడుదలవుతుంది. సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ … Read more

    తెలుగులో మాట్లాడిన రోహిత్‌ శర్మ

    IPLలో ఉప్పల్‌ రాజీవ్‌ గాంధీ స్టేడియం వేదికగా హైదరాబాద్‌-ముంబయి మధ్య రసవత్తర పోరు జరిగింది. ఈ సందర్భంగా ముంబయి జట్టు హైదరాబాద్ వచ్చిన వేళ… భాగ్యనగరంలో అడుగుపెట్టగానే రోహిత్‌ తెలుగులో మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచాడు. “ MI ఫ్యాన్స్ మేం వచ్చేశాం. పదండి ఉప్పల్‌కు” అంటూ ముంబయి జట్టు అభిమానులకు పిలుపునిచ్చాడు. రోహిత్ శర్మకు హైదరాబాద్‌తో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభించిన ఏడాది 2008లో హిట్ మ్యాన్‌ను డెక్కన్ ఛార్జర్స్ హైదరాబాద్‌ వేలంలో కొనుగోలు చేసింది. అప్పట్నుంచి దాదాపు మూడు … Read more