IPLలో ఉప్పల్ రాజీవ్ గాంధీ స్టేడియం వేదికగా హైదరాబాద్-ముంబయి మధ్య రసవత్తర పోరు జరిగింది. ఈ సందర్భంగా ముంబయి జట్టు హైదరాబాద్ వచ్చిన వేళ… భాగ్యనగరంలో అడుగుపెట్టగానే రోహిత్ తెలుగులో మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచాడు. “ MI ఫ్యాన్స్ మేం వచ్చేశాం. పదండి ఉప్పల్‌కు” అంటూ ముంబయి జట్టు అభిమానులకు పిలుపునిచ్చాడు.
రోహిత్ శర్మకు హైదరాబాద్‌తో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభించిన ఏడాది 2008లో హిట్ మ్యాన్‌ను డెక్కన్ ఛార్జర్స్ హైదరాబాద్ వేలంలో కొనుగోలు చేసింది. అప్పట్నుంచి దాదాపు మూడు సంవత్సరాల పాటు డీసీ జట్టుకు సేవలందించాడు రోహిత్. 2009లో గిల్ క్రిస్ట్ సారథిగా ఉన్నప్పుడు డెక్కన్ ఛార్జర్స్ ఐపీఎల్ ట్రోఫీ సాధించింది. అప్పుడు రోహిత్ శర్మ జట్టులోనే ఉన్నాడు.
ఇక చాలాసార్లు క్రికెటర్లు తెలుగులో మాట్లాడటం మనకు తెలుసు. అంబటి రాయుడు, తిలక్ వర్మ, సిరాజ్ లాంటి వాళ్లు హైదరాబాద్ నుంచే దేశవాలీ క్రికెట్‌లోకి వెళ్లారు. దినేశ్ కార్తీక్, రవిచంద్రన్ అశ్విన్ ఓ ఇంటర్వూలో తెలుగులో మాట్లాడటం చూశాం. ఓ మ్యాచ్‌లో భాగంగా అంపైర్‌ను వైడ్ కాదా అంటే కాదు అని బదులివ్వడం అప్పట్లో ట్రెండ్ అయ్యింది. ఇలా చాలామంది క్రికెటర్లకు తెలుగు భాషపై ప్రత్యేకమైన అభిమానం ఉందని చెప్పవచ్చు.
Celebrities Featured Articles Movie News
Anasuya Bharadwaj: రౌడీ బాయ్‌ను మళ్లీ గెలికిన అనసూయ! దూరపు కొండలు అంటూ..