• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • హైదరాబాద్‌లో మోదీ రోడ్‌ షో

  తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. వరుసగా మూడు రోజుల పాటు ఆయన రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈనెల 25న కరీంనగర్, 26న నిర్మల్ సభల్లో పాల్గొననున్నారు. చివరిగా 27న మోదీ హైదరాబాద్‌లో రోడ్ షో చేపట్టనున్నారు.

  చుక్కలు చూపిస్తున్న ఉల్లి ధరలు

  ఉల్లి ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. నెల క్రితం వరకు రూ.100కు 6 కేజీల వరకు దొరికిన ఉల్లి ఇప్పుడు వందకు కేజీన్నరకు పడిపోయింది. హైదరాబాద్‌ మార్కెట్లలో కిలో ఉల్లిని రూ.60-70కి విక్రయిస్తున్నారు. దీపావళి పండగ సీజన్‌ కావడంతో మున్ముందు ఈ ధరలు మరింత పెరగవచ్చనే అంచనాలు ఉన్నాయి. గత 15 రోజులుగా ఉల్లిపాయల రాకపోకలు దాదాపు 40% పడిపోయాయని మార్కెట్‌ వర్గాలు తెలిపాయి. నవంబరు రెండో వారం వరకూ ఈ పరిస్థితులు ఉండొచ్చని అభిప్రాయపడ్డాయి.

  పనిచేస్తున్న బడికే కన్నం వేసిన టీచర్

  HYD: ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న ఓ వ్యక్తి తన మిత్రుడితో కలిసి పనిచేస్తున్న పాఠశాలలోనే చోరీ చేశాడు. బోరబండ ప్రాంతానికి చెందిన సంతోష్‌ (34) వివేకానంద నగర్‌లోని ఓ స్కూల్లో టీచర్‌గా పనిచేస్తున్నాడు. ఫీజుల రూపంలో వచ్చే డబ్బును కొట్టేద్దామని సంతోష్ తన స్నేహితుడైన ఇసాక్‌ అహ్మద్‌ (27)కు చెప్పాడు. ఈ నెల 17న ఇద్దరూ కలిసి స్కూల్‌లోని రూ.11.50లక్షల నగదు ఎత్తుకెళ్లారు. కేసు నమోదు చేసిన పోలీసులు అనుమానస్పదంగా ఉన్న సంతోష్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో అసలు విషయం బయటకొచ్చింది.

  ఘనంగా దుర్గదేవి నిమజ్జనోత్సవం

  TG: హైదరాబాద్‌లో దుర్గామాత విగ్రహాల నిమజ్జనోత్సవం కొనసాగుతోంది. దేవీ శరన్న నవరాత్రుల సందర్భంగా వివిధ ప్రాంతాల్లో నెలకొల్పిన దుర్గామాత విగ్రహాలు భారీ వాహనాల్లో ఎన్టీఆర్‌ మార్గ్‌ వద్దకు చేరుకుంటున్నాయి. దీంతో ట్యాంక్‌బండ్‌పై భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. దీంతో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు అమలు చేస్తున్నారు. మరోవైపు దుర్గాదేవి నిమజ్జనోత్సవాలను తిలకించేందుకు పెద్దఎత్తున భక్తులు ట్యాంక్‌బండ్‌ వద్దకు తరలివస్తున్నారు.

  ఇద్దరు కుమార్తెలతో సహా తండ్రి సూసైడ్

  హైదరాబాద్ నగరంలోని బోయిన్‌పల్లిలో ఓ వ్యక్తి ఇద్దరు కుమార్తెలతో సహా ఆత్మహత్య చేసుకున్నాడు. మృతులు శ్రీకాంత్ చారి(42), స్రవంతి(8), శ్రావ్య(7)గా గుర్తించారు. మృతదేహాల పక్కన నిద్ర మాత్రలు ఉండటంతో వీరు గురువారం రాత్రి భోజనం చేసిన తర్వాత నిద్ర మాత్రలు మింగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వారి ఆత్మహత్యకు గల కారణాలు ఏంటనే దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

  ‘కేసీఆర్‌ వల్లే విశ్వనగరంగా హైదరాబాద్’

  సీఎం కేసీఆర్‌ తీసుకున్న విఫ్లవాత్మక నిర్ణయాల వల్ల హైదరాబాద్‌ విశ్వనగరంగా అవతరించిందని ఐటీ మంత్రి కేటీఆర్ అన్నారు. రహదారి వ్యవస్థలో మార్పులు, మెట్రో రైలు, మౌలిక వసతుల కల్పన, ప్రగతిశీల పారిశ్రామిక విధానం, ఆవిష్కరణలకు అనువైన వాతావరణం, హరితహారం వంటి కార్యక్రమాల వల్ల హైదరాబాద్‌ మునుపెన్నడూ చూడని అభివృద్ధి సాధించిందని సంతోషం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ను రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చేస్తామని కేటీఆర్‌ హామీ ఇచ్చారు.

  హైదరాబాద్‌లో ‘ఎనీ టైమ్ క్లినిక్’ మెషిన్

  దేశంలోనే మొదటి సారిగా ‘ఎనీ టైమ్ క్లినిక్’ హైదరాబాద్‌లో అందుబాటులోకి వచ్చింది. ఈ మెషిన్‌ ద్వారా జ్వరం నుంచి కేన్సర్ వరకు అన్ని రకాల వైద్య పరీక్షలు స్వయంగా మనమే చేసుకోవచ్చు. దీన్ని తొలిసారిగా చందానగర్‌లోని ప్రణామ్ ఆస్పత్రిలో ప్రారంభించారు. నార్మల్ హెల్త్ చెకప్, జ్వరం, కంటి పరీక్షలు వంటి 75 రకాల టెస్టులు చేసుకునేందుకు ఈ మెషిన్ ఉపయోగపడుతుంది. మెషిన్‌కు అమర్చిన కెమెరా ద్వారా వ్యాధి నిర్ధారణ అయిన వెంటనే వైద్యులతో వీడియో కాల్ మాట్లాడే అవకాశం సైతం ఉంది.

  హైదరాబాద్‌కు చేరుకున్న పాక్ క్రికెట్ టీం

  వరల్డ్‌ కప్ మెగా టోర్నీలో పాల్గొనేందుకు పాకిస్థాన్ క్రికెట్ టీం హైదరాబాద్ చేరుకుంది. పాక్ క్రికెటర్లకు భారత అభిమానులు ఘన స్వాగతం పలికారు. దాదాపు ఏడేళ్ల తర్వాత దాయాది జట్టు ఇండియాలో అడుగు పెట్టింది. పాక్ క్రికెటర్లకు కట్టుదిట్టమైన భద్రతను పోలీసులు అందించారు. పార్క్‌ హయాత్ హోటల్‌లో వారికి బస ఏర్పాటు చేశారు. శుక్రవారం ఉప్పల్ స్టేడియంలో జరిగే వామప్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో పాక్ తలపడనుంది. https://x.com/TheRealPCB/status/1707128719079580104?s=20

  HYD: WWE ఫైటింగ్ షురూ

  హైదరాబాద్‌లో WWE సందడి మొదలైంది. గచ్చిబౌలిలోని ఇండోర్ స్టేడియలో ‘సూపర్‌స్టార్ స్పెక్టాకిల్’ పేరిట ఈవెంట్ నిర్వహించారు. డబ్ల్యూడబ్ల్యూఈ ఫైటర్లను దగ్గర నుంచి చూసి ప్రేక్షకులు మైమరిచిపోయారు. తొలుత ఆస్కార్ విన్నింగ్ సాంగ్ ‘నాటు నాటు’ పాటకు రెజ్లర్లు డ్యాన్స్ వేయడంతో స్టేడియం మారుమోగిపోయింది. అనంతరం WWE స్టార్ జాన్ సీనా ప్రేక్షకుల కోసం మాట్లాడారు. ‘‘20 ఏళ్లుగా ఇలాంటి అనుభవం కోసమే ఎదురుచూస్తున్నా. భారత అభిమానులకు ధన్యవాధాలు.’’ అంటూ ఎమోషనల్ అయ్యారు. Cenation For Life ?Luve you @JohnCena ❤️#WWESuperstarSpectacle #WWEHyderabad pic.twitter.com/Ie8How2qbg … Read more

  మరో బాలుడిపై వీధికుక్క దాడి

  హైదరాబాద్‌లో మరోసారి వీధికుక్కలు రెచ్చిపోయాయి. ఓ బాలుడిపై దాడి చేసి చెవి కొరికాయి. టపాచబుత్రకు చెందిన ఓ మహళ తన కుమారుడితో కలసి వీధిలో నడచి వెళ్తోంది. ఈ క్రమంలో వెనుక నడిచి వస్తున్న పిల్లాడిపై ఓ వీధికుక్క అకస్మాత్తుగా దాడి చేసింది. ఆ చిన్నారి చెవిని కొరికివేసింది. వెంటనే అప్రమత్తమైన బాలుడి తల్లి కుక్కను తరిమివేసింది. వెంటనే బాలుడిని ఆస్పత్రిలో చేర్పించారు. ఆ బాలుడి సర్జరీకి రూ.3 లక్షలు ఖర్చు అయినట్లు సమాచారం. Stray dog menace haunts Hyderabad once again. … Read more