• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • డబ్బు ఆశ చూపి వృద్ధ దంపతులకు రూ.4 కోట్లు టోకరా!

  ఓ వృద్ద దంపతుల వద్ద సైబర్‌ నేరగాళ్లు కోట్లు దోచుకున్నారు. ముంబయిలో వృద్ధ జంట నివసిస్తోంది. ఈ క్రమంలో 71 ఏళ్ల వృద్ధురాలికి ఓ రోజు గుర్తు తెలియని మహిళ నుంచి ఓ ఫోన్‌ కాల్‌ వచ్చింది. తన భర్త పీఎఫ్‌ ఖాతాలో కంపెనీ రూ.11 కోట్లు డిపాజిట్ చేసిందని నమ్మబలికింది. ఆ డబ్బు అందుకోవాలంటే ట్యాక్స్ కింది రూ.4.35 కోట్లు జమ చేయాలని కోరింది. ఆ వృద్ధ దంపతులు డబ్బులు జమ చేసిన తర్వాత నుంచి సదరు మహిళ ఫోన్ స్విచ్‌‌ఆఫ్ వచ్చింది. … Read more

  అగ్ని ప్రమాదంలో ముగ్గురు సజీవ దహనం

  ముంబైలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. శాంతాక్రూజ్‌లోని గెలాక్సీ హోటల్‌లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు సజీవ దహనం అయ్యారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది, మంటలను అదుపు చేశారు. హోటల్‌లో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తరలించారు. India- A fire broke out in Hotel Galaxy located in the Santacruz area of Mumbai.Three killed, six rescued.#India #mumbai #Fire #accident … Read more

  ప్యాడ్లతోనే విమానమెక్కిన ముంబై క్రికెటర్

  ముంబై ఇండియన్స్ క్రికెటర్ నేహాల్ వధేరాకు ఆ జట్టు యాజమాన్యం వినూత్న శిక్ష విధించింది. జట్టు సమావేశానికి వధేరా ఆలస్యంగా రావడంతో ప్యాడ్లు కట్టుకుని విమానమెక్కాలని ఆదేశించింది. ఇలా ఎవరైనా ఆలస్యంగా వస్తే ముంబై ఇలాంటి శిక్షే వేస్తుంది. దీంతో వధేరా ప్యాడ్లు కట్టుకునే ఎయిర్‌పోర్టుకు చేరుకున్నాడు. సాధారణ జంప్‌షూట్‌కు బదులు ప్యాడ్లతో కనిపించడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. #MumbaiIndians youngster #NehalWadhera turned all heads at Mumbai airport with his punishment #OOTD. … Read more

  ముంబై ఘన విజయం

  ఐపీఎల్ 2023లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది. 6 వికెట్ల తేడాతో బెంగళూరును చిత్తు చేసింది.. 200 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై 16.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. జట్టులో సూర్యకుమార్ యాదవ్(83) చెలరేగి ఆడాడు. ఏమాత్రం కనికరం చూపకుండా బెంగళూరు బౌలర్లపై సూర్య ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ఇషాన్ కిషన్(42), నేహాల్ వధేరా(52)లు రాణించారు. హసరంగ, వైశాఖ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. సూర్య ధనాధన్‌ ఇన్నింగ్స్‌ భారీ లక్ష్య ఛేదనలో … Read more

  తెలుగులో మాట్లాడిన రోహిత్‌ శర్మ

  IPLలో ఉప్పల్‌ రాజీవ్‌ గాంధీ స్టేడియం వేదికగా హైదరాబాద్‌-ముంబయి మధ్య రసవత్తర పోరు జరిగింది. ఈ సందర్భంగా ముంబయి జట్టు హైదరాబాద్ వచ్చిన వేళ… భాగ్యనగరంలో అడుగుపెట్టగానే రోహిత్‌ తెలుగులో మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచాడు. “ MI ఫ్యాన్స్ మేం వచ్చేశాం. పదండి ఉప్పల్‌కు” అంటూ ముంబయి జట్టు అభిమానులకు పిలుపునిచ్చాడు. రోహిత్ శర్మకు హైదరాబాద్‌తో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభించిన ఏడాది 2008లో హిట్ మ్యాన్‌ను డెక్కన్ ఛార్జర్స్ హైదరాబాద్‌ వేలంలో కొనుగోలు చేసింది. అప్పట్నుంచి దాదాపు మూడు … Read more

  బ్రిడ్జి కింద క్రికెట్ గ్రౌండ్; ఎక్కడో కాదు?

  [వీడియో;](url) ముంబైలోని ఓ ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద క్రికెట్ మైదానం ఏర్పాటు చేశారు. దీంతో పాటు టెన్నిస్ కోర్టు, బాస్కెట్ బాల్ కోర్టు కూడా నిర్మించారు. ఈ మైదానాల్లో ఎవరైనా ఉచితంగా ఆడుకోవచ్చు. ఓ నెటిజన్ ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్‌గా మారింది. ఇది బెస్ట్ ఐడియా అంటూ నెటిజన్లు తెగ పొగిడేస్తున్నారు. దీనిని తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ రిట్వీట్ చేశారు. ‘‘ఇలాంటి సౌకర్యం త్వరలో హైదరాబాద్‌లో కూడా కల్పిస్తాం.’’ అంటూ ట్వీట్ చేశారు. Let’s get … Read more

  ఎయిర్‌పోర్టులో తమన్నా, విజయ్ వర్మ..!

  తమన్నా భాటియా, విజయ్ వర్మ రిలేషన్‌లో ఉన్నారంటూ గత కొంత కాలంగా ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవల తమన్నా విజయ్‌కి ముద్దు పెడుతున్న వీడియో కూడా నెట్టింట వైరల్ అయింది. అయితే, వీరిద్దరూ ముంబై ఎయిర్‌పోర్టు వద్ద కనిపించడంతో ఇది నిజమేనని పలువురు అంటున్నారు. ముందుగా తమన్నా ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. అక్కడున్న వారికి న్యూ ఇయర్ శుభాకాంక్షలు చెబుతూ బయటకు వచ్చేసింది. అనంతరం నటుడు విజయ్ వర్మ కూడా రావడంతో గతకొంత కాలంగా వస్తున్న రూమర్లకు బలం చేకూర్చినట్లు అయింది. న్యూ ఇయర్ వేడుకలను … Read more

  SUPER: చిన్నారిని కాపాడిన పోలీసు

  రైలు ఎక్కుతుండగా కాలుజారి ప్లాట్ ఫాం గ్యాప్‌లో ఇరుక్కుపోయిన తల్లీబిడ్డలను పోలీసులు అధికారి కాపాడారు. మహారాష్ట్రలోని మన్‌కర్డ్ రైల్వే స్టేషనులో ఈ ఘటన జరిగింది. నిన్న మధ్యాహ్నం ఓ మహిళ తన బిడ్డతో కలిసి రైలు ఎక్కుతుండగా పట్టు కోల్పోయింది. రైలు కదలడంతో అప్రమత్తమైన పోలీసు అధికారి వెంటనే బిడ్డను బయటకు తీశాడు. సీసీ ఫుటేజీ వైరల్ కావడంతో అధికారిని మెచ్చుకుంటున్నారు. ఈ [వీడియో](url) వైరల్‌గా మారింది. #MissionJeevanRaksha आज अपराध शाखाके अक्षय सोये द्वारा मानखुर्द रेलवे स्टेशनके प्लेटफार्म 2 … Read more

  ముంబ‌యి సిద్ధార్థ్ రాయ్‌ క‌పూర్ ఆఫీస్‌లో ర‌ష్మిక‌

  ర‌ష్మిక ముంబ‌యిలోని నిర్మాత‌ సిద్ధార్థ్ రాయ్ క‌పూర్ ఆఫీస్‌కు వెళ్లింది. ఈ విష‌యం మీడియా కంట ప‌డ‌టంతో కెమెరాలు ఆమెను వెంటాడాయి. అందరికీ న‌వ్వుతూ ఫోటోల‌కు పోజులిచ్చిన ఆమె ఆఫీసులోకి వెళ్లి కాసేపు చ‌ర్చ‌ల త‌ర్వాత తిరిగి బ‌య‌ట‌కు వ‌చ్చింది. అయితే వీళ్లు దేని గురించి మాట్లాడారో మాత్రం ఇంకా తెలియ‌లేదు. అక్క‌డ ఉన్న ఫ్యాన్స్‌తో స‌ర‌దాగా ముచ్చ‌టించిన ర‌ష్మిక కొంత‌మందికి సెల్ఫీలు కూడా ఇచ్చింది. ఆ త‌ర్వాత అక్క‌డినుంచి వెళ్లిపోయింది. సౌత్‌తో పాటు బాలీవుడ్ సినిమాల‌తో బిజీగా ఉన్న ఈ భామ కొత్త … Read more

  ముంబ‌యి లోక‌ల్ ట్రైన్‌లో సంద‌డి చేసిన‌ విజ‌య్, అన‌న్య‌

  ‘లైగ‌ర్’ ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా విజ‌య్ దేవ‌ర‌కొండ‌, అన‌న్య ముంబ‌యిలో సంద‌డి చేస్తున్నారు. శుక్ర‌వారం ఉద‌యం మాస్కులు ధ‌రించి రైల్వే స్టేష‌న్‌కు వెళ్లిన వీరు లోక‌ల్ ట్రైన్‌లో ప్ర‌యాణించారు. రైలులో ప్ర‌యాణికుల‌తో త‌మ సినిమా గురించి ముచ్చ‌టించారు. కాసేప‌టికి విజ‌య్‌ అన‌న్య ఒడిలో త‌ల‌పెట్టుకొని నిద్ర‌పోయాడు. గురువారం సాయంత్రం కూడా ఈ జంట ముంబ‌యిలోని బ‌స్తీల్లో తిరుగుతూ లైగ‌ర్ పాట‌ల‌కు స్టెప్పులేస్తూ సంద‌డి చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోష‌ల్‌మీడియాలో వైర‌ల్‌గా మారాయి.