• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • Mokshagna Teja: మోక్షజ్ఞ టాలీవుడ్‌ ఎంట్రీపై బిగ్‌ అప్‌డేట్‌.. ఖుషీ అవుతున్న నందమూరి ఫ్యాన్స్‌!

  టాలీవుడ్‌లోని అతిపెద్ద సినీ కుటుంబంలో నందమూరి వంశం ఒకటి. నందమూరి తారక రామారావు నట వారసులుగా వచ్చిన హరికృష్ణ (Hari Krishna), బాలకృష్ణ (Bala Krishna), జూనియర్‌ ఎన్టీఆర్‌ (Jr NTR), కళ్యాణ్‌రామ్‌ (Kalyan Ram) వంటి వారు ఇండస్ట్రీలో తమకంటూ స్టార్‌ స్టేటస్‌ను సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తేజ (Mokshagna Teja) ఎంట్రీ ఎప్పుడు ఉంటుందా అని నందమూరి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ మధ్య బాలకృష్ణ కూడా.. తన కొడుకు మోక్షజ్ఞ ఎంట్రీ ఈ ఏడాది … Read more

  Vishwambhara : 75 ఏళ్ల వృద్ధుడి గెటప్‌లో చిరంజీవి… సినిమాలో ఇదే కీలకం!

  మెగాస్టార్‌ చిరంజీవి (Megastar Chiranjeevi) పేరు చెబితినే ఆయన ఫ్యాన్స్‌ పూనకాలతో తాండవం చేస్తారు. తెలుగు రాష్ట్రాల్లో చిరుకు ఉన్న క్రేజ్‌ కొత్తగా చెప్పాల్సిన పని లేదు. గతేడాది ప్రారంభంలో “వాల్తేరు వీరయ్య”గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిరు మంచి విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత మేహర్‌ రమేష్‌ దర్శకత్వంలో ‘భోళా శంకర్‌’ (Bhoola Shankar)గా వచ్చిన సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా రిజల్ట్‌తో జాగ్రత్త పడిన చిరు తన తర్వాతి చిత్రానికి ఓ సోషియో ఫాంటసీ కథను ఎంచుకున్నారు. బింబిసార ఫేమ్‌ … Read more

  Animal Park Story: యానిమల్‌ 2 స్టోరీ ఇదేనా..! నెట్టింట వైరల్‌!

  టాలీవుడ్‌ డైరెక్టర్‌ సందీప్‌రెడ్డి వంగా (Sandeep Reddy Vanga), బాలీవుడ్‌ హీరో రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor) కాంబినేషన్‌లో తెరకెక్కిన హిట్‌ చిత్రం ‘యానిమల్‌’ (Animal). దానికి సీక్వెల్‌గా ‘యానిమల్‌ పార్క్‌’ (Animal Park) సినిమా కూడా రానుందని గతంలోనే సందీప్‌రెడ్డి వంగా ప్రకటించారు. అయితే ఈ సినిమాకు సంబంధించి తాజాగా కొన్ని అప్‌డేట్స్‌ బయటకొచ్చాయి. పార్ట్‌-2 కథ ఇదేనంటూ ఓ స్టోరీ కూడా నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.  పార్ట్‌-2 స్టోరీ అదేనా! ‘యానిమల్‌ పార్క్‌’ కథ ఇదేనంటూ … Read more

  బన్నీ సరసన దీపికా పదుకొనే..?

  ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్, త్రివిక్రమ్‌ కాంబోలో మరో సినిమా తెరకెక్కనుంది. పుష్ప-2 తర్వాత ఈ చిత్రం పట్టాలెక్కనుంది. అయితే ఈ మూవీలో హీరోయిన్‌గా దీపికా పదుకొనేను తీసుకోబోతున్నట్లు సమాచారం. సెకండ్‌ హీరోయిన్‌గా పూజా హెగ్డేను సైతం తీసుకుంటారని తెలిసింది. ఈ వార్తలపై స్పష్టత రావాల్సింది. ఇక దీపికా భారత్‌లోని అగ్ర కథానాయికల్లో ఒకరిగా ఉన్నారు. అలాంటి దీపికతో బన్నీ స్టెప్పులేస్తే అదిరిపోతుందని ఫ్యాన్స్ ఇప్పటి నుంచే తెగ సంబరపడిపోతున్నారు.

  చిరంజీవికి విలన్‌గా దగ్గుబాటి రానా!

  చిరంజీవి, దర్శకుడు వశిష్ట కాంబోలో ‘MEGA 156’ మూవీ రానుంది. ఇందులో విలన్‌గా దగ్గుబాటి రానా నటించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. హాలీవుడ్‌ మార్వెల్‌ కామిక్స్‌ ‘లోకి’ పాత్ర మాదిరిగా రానా క్యారెక్టర్‌ ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో రానా క్రూరంగా కనిపించనున్నట్లు సమాచారం. చిరు 156వ చిత్రానికి సంబంధించిన విషయాలపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. కాగా, ఈ మూవీని సోషియో ఫాంటసీ ఎంటర్‌టైనర్‌గా వశిష్ట తెరకెక్కిస్తున్నారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించనున్నారు.

  రెండో పెళ్లికి సిద్ధమైన నిహారిక మాజీ భర్త

  మెగా డాటర్ నిహారిక మాజీ భర్త చైతన్య జొన్నల గడ్డ రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల నిహారిక- చైతన్య మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ బాధను మరిచిపోయేందుకు విదేశాలకు వెళ్లిన చైతన్య తిరిగి వచ్చాడు. ఈక్రమంలో తల్లిదండ్రులు చైతన్యను పెళ్లికి ఒప్పించినట్లు సమాచారం. ఐపీఎస్ అధికారి కూతురితో చైతన్య పెళ్లి కుదిరినట్లు తెలిసింది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

  మళ్ళీ తెరపైకి విజయ్, రష్మిక లవ్..!

  విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న రిలేషన్‌లో ఉన్నారన్న పుకార్లు ఎప్పటినుంచో ఉన్నాయి. తాజాగా వీటికి బలం చేకూర్చేలా ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో విజయ్ తమ్ముడు ఆనంద్ కూడా కనిపించడంతో నిజమేనని అనుకుంటున్నారు. ఓ హోటల్‌లో ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో కలిసి భోజనం చేస్తున్నట్లు వీడియోని చూస్తే తెలిసిపోతుంది. అయితే, వీరిద్దరికీ మనస్ఫర్దలు వచ్చాయని, ఆ తర్వాత ప్యాచప్ అయినట్లు నెట్టింట గుసగుసలు వినిపిస్తున్నాయి. #vijaydevarakonda #RashmikaMandanna #Rashmika pic.twitter.com/NdbfNfsETp — News Bazaar (@NewsBazaar4) June 24, 2023 Courtesy … Read more

  ‘ఎస్ఎస్ఎంబీ28’ టైటిల్ రివీల్: ఎప్పుడంటే?

  సూపర్‌స్టార్ మహేష్‌బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ‘ఎస్ఎస్ఎంబీ28’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ ఇప్పటికే కొంత భాగం షూటింగ్ కూడా జరుపుకుంది. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌ లుక్ కూడా మూవీమేకర్స్ రిలీజ్ చేశారు. కాగా ఈ మూవీకి సంబంధించి ఓ వార్త చక్కర్లు కొడుతోంది. మే1న ఈ చిత్ర టైటిల్ రివీల్ చేయనున్నట్లు టాక్. ఆ రోజు కృష్ణ జయంతి కావడంతో పక్కాగా టైటిల్ రివీల్ చేస్తారనే వార్తలు గుప్పుమంటున్నాయి. మహేశ్‌ … Read more

  ‘ఆదిపురుష్’ హడావుడి ఏదీ!

  పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ‘ఆదిపురుష్’ షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను జూన్ 16న విడుదల చేయనున్నారు. ఇందుకు మరో 2 నెలలే ఉంది. కానీ ఈ మూవీ నుంచి అప్డేట్స్ కానీ, ప్రమోషన్లు కానీ లేవు. దీంతో ఈ సినిమా అంచనాలు అందుకుంటుందా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఈ నెల 6న హనుమాన్ జయంతి కావడంతో.. ఆరోజు హనుమంతుడి పోస్టర్ రిలీజ్ చేస్తారా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. గతేడాది ఆదిపురుష్ టీజర్‌ని … Read more

  టాలీవుడ్ టాప్ హీరోల రెమ్యూనరేషన్స్ ఇవే?

  ఒకప్పుడు జాతీయ సినీ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమంలో మన హీరోల ఫొటోలు, టాలీవుడ్‌ సినిమా పోస్టర్లు కనిపించేవి కావు. అయితే అదంతా గతం. ఇప్పుడు టాలీవుడ్ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రాలతో మన ఇండస్ట్రీ ఖ్యాతి దేశ సరిహద్దులు దాటిపోయింది. ప్రస్తుతం టాలీవుడ్‌ నుంచి వస్తున్న అగ్ర హీరోల సినిమాలన్నీ దాదాపు పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతున్నవే. దీంతో దానికి తగ్గట్లే మన హీరోల రెమ్యూనరేషన్లు సైతం ఆకాశన్నంటాయి. ఒకప్పుడు రూ. 10 నుంచి రూ. 15 కోట్ల పారితోషికం తీసుకునే … Read more