టాలీవుడ్‌లోని అతిపెద్ద సినీ కుటుంబంలో నందమూరి వంశం ఒకటి. నందమూరి తారక రామారావు నట వారసులుగా వచ్చిన హరికృష్ణ (Hari Krishna), బాలకృష్ణ (Bala Krishna), జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR), కళ్యాణ్‌రామ్ (Kalyan Ram) వంటి వారు ఇండస్ట్రీలో తమకంటూ స్టార్ స్టేటస్‌ను సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తేజ (Mokshagna Teja) ఎంట్రీ ఎప్పుడు ఉంటుందా అని నందమూరి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ మధ్య బాలకృష్ణ కూడా.. తన కొడుకు మోక్షజ్ఞ ఎంట్రీ ఈ ఏడాది ఉంటుందని చెప్పిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మోక్షజ్ఞ తెరంగేట్రానికి సంబంధించి ఓ వార్త బయటకొచ్చింది. ప్రస్తుతం అది ఇండస్ట్రీలో వైరల్ అవుతోంది.
కథలు వింటున్న బాలయ్య!
ఈ ఏడాది ఎట్టి పరిస్థితుల్లోనూ మోక్షజ్ఞ తొలి చిత్రం ప్రారంభం కావాలని తండ్రి నందమూరి బాలకృష్ణ పట్టుదలగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తన కుమారుడి ఫిల్మ్ కోసం కథలు వింటున్నట్లు సమాచారం. ఏ కథ అయితే మోక్షజ్ఞ ఎంట్రీకి బాగుంటుందోనన్న దానిపై ఇప్పటికే బాలయ్య పూర్తి స్పష్టతతో ఉన్నారని ఫిల్మ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అందుకు తగ్గ కథ దొరకగానే బాలయ్య వెంటనే ఓకే చెప్పేస్తారని టాక్ వినిపిస్తోంది.
ఫిజిక్‌పై ఫోకస్ పెట్టిన మోక్షజ్ఞ!
తొలి చిత్రాన్ని ఎలాగైన సెట్స్‌పైకి తీసుకెళ్లాలని తండ్రి బాలకృష్ణ కృషి చేస్తున్న నేపథ్యంలో మోక్షజ్ఞ తన ఫిజిక్‌పై దృష్టి పెట్టారు. తొలి సినిమా కోసం అతడు తీవ్రంగా కసరత్తు చేస్తున్నాడట. ఈ క్రమంలో రీసెంట్‌గా వైరల్ అయిన పిక్‌లో కూడా మోక్షజ్ఞ చాలా ఫిట్‌గా మారిపోయి కనిపించాడు. గత ఏడాది వరకూ బొద్దుగా ఉన్న అతను ప్రస్తుతం బరువు తగ్గి ఫిట్‌గా హీరో లుక్‌లోకి వచ్చేశాడు. పైగా ప్రస్తుతం వైజాగ్‌లో సత్యానంద్ దగ్గర మోక్షజ్ఞ నటనలో శిక్షణ తీసుకుంటున్నట్లు కూడా తెలుస్తోంది.
‘ఆదిత్య 369’ సీక్వెల్!
మోక్షజ్ఞ ఎంట్రీకి సంబంధించి ఓ వార్త ఇండస్ట్రీలో హల్‌చల్ చేస్తోంది. బాలకృష్ణ సూపర్ హిట్ మూవీ ‘ఆదిత్య 369’ సీక్వెల్‌లో మోక్షజ్ఞ నటిస్తాడని ప్రచారం జరుగుతోంది. దీనికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తారని కూడా టాక్ వినిపిస్తోంది. మరి చివరకు ఏ దర్శకుడు ఫిక్స్ అవుతాడో చూడాలి. ఇదే నిజమైతే తమ ఆనందానికి అవధులు ఉండవని నందమూరి ఫ్యాన్స్ అంటున్నారు. తన తండ్రి చేసిన ‘ఆదిత్య 369’ సినిమాతో మోక్షజ్ఞ ఇండస్ట్రీలోకి అడుగుపెడితే విజయం తథ్యమని అభిప్రాయపడుతున్నారు.
బోయపాటితో ఉంటుందా?
మోక్షజ్ఞ ఎంట్రీ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తారని కూడా గతంలో వార్తలు వచ్చాయి. దీనిపై గోవా ఫిలిం ఫెస్టివల్ వేదికగా నందమూరి బాలకృష్ణ అప్పట్లోనే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన కుమారుడిని ఈ ఏడాది తెలుగు చలనచిత్ర పరిశ్రమకు పరిచయం చేయబోతున్నట్లు స్పష్టం చేశారు. మోక్షజ్ఞ చిత్రాన్ని బోయపాటి చేస్తారా? అన్న ప్రశ్నకు ‘అంతా ధైవేచ్ఛ’ అంటూ బాలయ్య సమాధానం ఇచ్చారు. అన్ని అనుకున్నట్లు జరిగితే.. మోక్షజ్ఞ సినిమా త్వరలోనే ఉండనుంది.
Featured Articles Movie News
Dil Raju: అన్ని చేస్తాం.. అన్నింటికీ చెక్ పెడతాం