సూపర్‌స్టార్ మహేష్‌బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ‘ఎస్ఎస్ఎంబీ28’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ ఇప్పటికే కొంత భాగం షూటింగ్ కూడా జరుపుకుంది. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా మూవీమేకర్స్ రిలీజ్ చేశారు. కాగా ఈ మూవీకి సంబంధించి ఓ వార్త చక్కర్లు కొడుతోంది. మే1న ఈ చిత్ర టైటిల్ రివీల్ చేయనున్నట్లు టాక్. ఆ రోజు కృష్ణ జయంతి కావడంతో పక్కాగా టైటిల్ రివీల్ చేస్తారనే వార్తలు గుప్పుమంటున్నాయి.
మహేశ్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న మూడో సినిమా ఇది. మిర్చియార్డ్ నేపథ్యంలో కథ సాగుతుందని తెలుస్తోంది. ఇందుకు తగ్గట్లుగానే ఫస్ట్ లుక్ ఉంది. మహేశ్ నడుస్తుండగా చుట్టూ మిరపకాయలు ఉన్న ఫొటోను విడుదల చేశారు. మహేశ్ ఊర మాస్ లుక్ విపరీతంగా ఆకట్టుకుంది. నిన్న మెున్నటి వరకు మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రాలు చేసిన సూపర్ స్టార్ నుంచి ఫ్యాన్స్ మాస్ సినిమా కోరుకుంటున్నారు.
చిత్రానికి గుంటూరు కారం అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇలాంటి యాంగిల్‌లో టైటిల్ పెడితే మాస్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకునే అవకాశం ఉంది. మరోవైపు ఫస్ట్ లుక్‌లో ఎక్కువగా చర్చకు రాని విషయం మహేశ్ సిగరేట్ తాగటం. పోకిరి, అతిథి తర్వాత ఈ సినిమాలోనే మహేశ్ సిగరేట్‌తో కనిపిస్తున్నాడు. లుక్ కూడా స్టైలిష్‌గా ఉండటంతో… సినిమా పక్కా విజయవంతం అవుతుందనే నమ్మకంతో ఉన్నారు చిత్ర యూనిట్.
SSMB 28 చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే రెండు షెడ్యూల్‌లు పూర్తి చేసుకున్నారు. థమన్ కూడా స్వరాలు సమకూరుస్తున్నారు. శంకర్ మహదేవన్‌తో ఓ పాట పాడిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే త్రివిక్రమ్, థమన్ కాంబోలో అల వైకుంఠపురం, అరవింద సమేత వీర రాఘవ వంటి బ్లాక్ బస్టర్లు ఉన్నాయి. ఇందులో కూడా పాటలు ఓ రేంజ్‌లో ఉంటాయనే ఊహించవచ్చు.
Celebrities Featured Articles Hot Actress
Arrchita Agarwaal: శరీరం అలా ఉంటేనే ఇండస్ట్రీలోకి రావాలి: బాలీవుడ్ నటి