• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • కృష్ణ వర్ధంతి.. మహేశ్‌ బాబు కీలక నిర్ణయం

  టాలీవుడ్ హీరో మహేశ్‌బాబు మరోసారి ఉదారత చాటుకున్నారు. ఇప్పటికే తన ఫౌండేషన్‌ ద్వారా చిన్నారులకు గుండె ఆపరేషన్లకు సాయం చేస్తున్నారు. మహేష్ తన తండ్రి కృష్ణ ప్రథమ వర్ధంతి సందర్భంగా పేద విద్యార్థులకు చేయూతనిచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ‘సూపర్‌స్టార్‌ కృష్ణ ఎడ్యుకేషనల్‌ ఫండ్‌’ ద్వారా 40మందికి పైగా పేద విద్యార్థులను ఎంపిక చేసి వారి ఉన్నత చదువులకు స్కాలర్‌షిప్‌ అందించనున్నారు.

  మహేశ్‌ సినిమా వదులుకున్నా: నటి రేణూ

  నటి రేణూ దేశాయ్ ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకుంది. మహేశ్‌బాబు హీరోగా చేసిన ‘సర్కారు వారి పాట’లో తనకు అవకాశం వచ్చిందని తెలిపింది. ‘కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ సినిమా చేయలేకపోయాను. ఆ కారణం ఏంటో ఇప్పుడు చెప్పలేను. ఈ సినమాలో బ్యాంక్‌ ఆఫీసర్‌ పాత్ర కోసం నన్ను అడిగారు. ఆ రోల్‌ నాకెంతో నచ్చింది. యాక్ట్‌ చేయాలనుకున్నా కొన్ని కారణాల వల్ల కుదరలేదు’. అని రేణూ చెప్పుకొచ్చింది.

  ‘గుంటూరు కారం’ తాజా అప్‌డేట్

  సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న “గుంటూరు కారం” నుంచి తాజా అప్‌డేట్ వినిపిస్తుంది. మహేష్ రేపటి నుంచి సెట్స్ లో అడుగు పెట్టి ఇక రెగ్యులర్ షూట్ లో తాను పాల్గొననున్నారట. ఈ రెగ్యులర్ షూట్‌తో హీరో సీస్స్ ఆల్ మోస్ట్ కంప్లీట్ అయిపోవచ్చని తెలుస్తుంది. ఈ చిత్రంలో మహేష్ బాబుకు జోడీగా శ్రీలీల, మీనాక్షి చౌదరిలు నటిస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్నాడు.

  తండ్రి నుంచి ఎంతో నేర్చుకున్నా: మహేష్‌బాబు

  సూపర్ స్టార్ మహేష్‌బాబు ఓ కార్యక్రమంలో తన తండ్రి దివంగత నటుడు కృష్ణను గుర్తుచేసుకున్నారు. తాను నటించిన సినిమా ప్రేక్షకాదరణ పొందనప్పుడు ఎంతో నిరుత్సాహ పడతానని చెప్పారు. ‘ఎందుకంటే ఓ సినిమాపై ఎన్నో అంచనాలు ఉంటాయి. దాని వెనక ఎంతో మంది కష్టం ఉంటుంది. దాని పూర్తి బాధ్యత నేనే తీసుకుంటాను. అలాగే తర్వాతి సినిమాపై ఎక్కువ దృష్టి పెడతాను. ఈ విషయం నేను నాన్న దగ్గర నుంచి నేర్చుకున్నా. క్రమశిక్షణ, వినయం, వంటి ఎన్నో విషయాలు ఆయన నేర్పించారు’. అని మహేష్ తన … Read more

  మహేష్- రాజమౌళి చిత్రం నుంచి బిగ్‌ అప్‌డేట్

  సూపర్ స్టార్ మహేష్ బాబు- రాజమౌళి కాంబోలో వస్తున్న చిత్రం నుంచి బిగ్ అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమా ఫైనల్ స్క్రిప్ట్ పూర్తైనట్లు తెలిసింది. ఫైనల్ స్క్రిప్ట్‌ను విజయేంద్ర ప్రాసాద్ లాక్ చేసినట్లు సమాచారం. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో అత్యంత సాహోసోపేతమైన కథతో ఈ చిత్రం రూపుదిద్దుకోనుందని విజయేంద్ర ప్రసాద్ ప్రకటించారు. నవంబర్‌లో ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభం కానున్నాయి. వచ్చే ఏడాది జనవరిలో ఈ సినిమా షూటింగ్ పట్టాలెక్కనుంది.

  మహేశ్‌ ‘గుంటూరు కారం’పై ఆసక్తికర చర్చ

  సూపర్‌ స్టార్ మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న ‘గుంటూరు కారం’ ఇంటర్వెల్ సీన్‌పై సినీ అభిమానుల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ ఇంటర్వెల్ సీన్ కోసం హైదరాబాద్‌లోని ఓ స్టూడియోలో భారీ సెట్ వేస్తున్నట్లు తెలుస్తోంది. సెకెండ్ హాఫ్ మొత్తం ఈ సీన్ చుట్టూనే తిరుగుతుందనే టాక్ వినిపిస్తోంది. మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 13న థియేటర్లలోకి రానుంది.

  మహేష్ వాకింగ్ స్టైల్‌కు ఫిదా!

  సూపర్‌స్టార్ మహేష్‌బాబు వాకింగ్ స్టైల్ అందరినీ ఫిదా చేసింది. హైదరాబాద్‌లో జరిగిన ఓ భారీ ఈవెంట్‌లో మహేష్ పాల్గొన్నాడు. పూర్తిగా న్యూలుక్‌తో అదరగొట్టాడు. మెరూన్ కలర్ హుడీ..డార్క్ బ్లూకలర్ జీన్స్‌తో హ్యాండ్సమ్‌గా కనిపించాడు. గతంతో పోలిస్తే మరింత చార్మింగ్‌గా కనిపించాడు. మహేష్ స్టేజ్‌పైకి నడిచి వెళ్లే వాకింగ్ స్టైల్ అదిరిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. కాగా మహేష్ ప్రస్తుతం ‘గుంటూరు కారం’ సినిమాలో నటిస్తున్నాడు. Aaa charming smile Aaa style ??? Superstar #maheshbabu at #healachild #gamechanger2023 … Read more

  మహేష్ బాబు దెబ్బకు యూట్యూబ్ షేక్

  సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘గుంటూరు కారం’ మూవీ నుంచి విడుదలైన ‘మాస్ స్ట్రైక్ గ్లింప్స్’ యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. ఈ వీడియో ఇప్పటి వరకు 20 మిలియన్ వ్యూస్ సాధించి దూసుకెళ్తోంది. థమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ గ్లింప్స్‌ను మరోస్థాయిలో ఉంచింది. త్రివిక్రమ్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాలో మహేష్ బాబు ఊర మాస్ లుక్‌లో కనిపించనున్నాడు. మహేష్ సరసన పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. ‘గుంటూరు కారం’ వచ్చే సంక్రాంతికి విడుదల కానుంది.

  ‘మోసగాళ్లకు మోసగాడు’ 4K ట్రైలర్ రిలీజ్

  దివంగత సూపర్‌స్టార్ కృష్ణ హీరోగా నటించిన ‘మోసగాళ్లకు మోసగాడు’ సినిమా రీ రిలీజ్‌కు సిద్ధం అవుతోంది. మే 31న కృష్ణ జయంతి సందర్భంగా ఈ మూవీని 4K వెర్షన్‌ను థియేటర్లలో విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ సినిమా ట్రైలర్‌ను సూపర్‌స్టార్ మహేష్‌బాబు ఆవిష్కరించారు. ఈ ట్రైలర్‌కు ఫ్యాన్స్, ఆడియెన్స్ నుంచి సానుకూల స్పందన వస్తోంది. కాగా ‘మోసగాళ్లకు మోసగాడు’ చిత్రం 1971 విడుదలై ఘనవిజయం సాధించింది. సత్యనారాయణ, ప్రభాకర్, గుమ్మడి, జ్యోతిలక్ష్మీలు నటించారు.

  ఎన్టీఆర్- మహేష్ ఫ్యాన్స్ రచ్చ: అదిరిపోయిన వీడియో

  జూ. ఎన్టీఆర్ మహేష్ బాబు మంచి ఫ్రెండ్స్. ఎవరు మీలో కోటీశ్వరుడు ప్రొగ్రాంలో మహేష్‌ను తారక్ అన్న అని పిలవడం అందరికీ గుర్తుండే ఉంటుంది. తాజాగా జూ.ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా తారక్, మహేష్ బాబు ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు. తమ అభిమాన నటుడికి వెరైటీగా విషెస్ చెబుతున్నారు. జూ.ఎన్టీఆర్, మహేష్ బాబు సినిమాల్లోని డైలాగ్స్‌ను బ్యాక్ టూ బ్యాక్ ఎడిట్ చేసి పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. ?Happy Birthday Anna @tarak9999 from @urstrulyMahesh Anna fan's … Read more