‘అయోధ్యలో అర్జునుడు’గా మహేష్!
సూపర్‌స్టార్ మహేష్‌బాబు హీరోగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఎస్ఎస్ఎంబీ28’ మూవీకి ‘అయోధ్యలో అర్జునుడు’ టైటిల్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. త్రివిక్రమ్ ‘అ’ టైటిళ్లు అతడు, అత్తారింటింకి దారేది, అ ఆ బాక్సాఫీస్ వద్ద మెరిపించగా, అజ్ఞాతవాసి మాత్రం ఫెయిలయ్యింది. టైటిల్ ఇంట్రెస్టింగ్గా ఉండడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. మహేష్-త్రివిక్రమ్ కాంబినేషన్లో ఇది మూడో చిత్రం కావడం విశేషం. కాగా ఈ సినిమాలో పూజా హెగ్డే, సంయుక్త మీనన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. చినబాబు ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. Courtesy Twitter:Mahesh Babu … Read more