• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • Animal Park Story: యానిమల్‌ 2 స్టోరీ ఇదేనా..! నెట్టింట వైరల్‌!

  టాలీవుడ్‌ డైరెక్టర్‌ సందీప్‌రెడ్డి వంగా (Sandeep Reddy Vanga), బాలీవుడ్‌ హీరో రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor) కాంబినేషన్‌లో తెరకెక్కిన హిట్‌ చిత్రం ‘యానిమల్‌’ (Animal). దానికి సీక్వెల్‌గా ‘యానిమల్‌ పార్క్‌’ (Animal Park) సినిమా కూడా రానుందని గతంలోనే సందీప్‌రెడ్డి వంగా ప్రకటించారు. అయితే ఈ సినిమాకు సంబంధించి తాజాగా కొన్ని అప్‌డేట్స్‌ బయటకొచ్చాయి. పార్ట్‌-2 కథ ఇదేనంటూ ఓ స్టోరీ కూడా నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. 

  పార్ట్‌-2 స్టోరీ అదేనా!

  ‘యానిమల్‌ పార్క్‌’ కథ ఇదేనంటూ నెట్టింట ఓ స్టోరీ లైన్‌ (Animal Park Story) వైరల్ అవుతోంది. దాని ప్రకారం.. యానిమల్‌ క్లైమాక్స్‌లో రణ్‌విజయ్‌ సింగ్‌ (రన్‌బీర్‌ కపూర్‌) తన తండ్రి (అనిల్‌ కపూర్‌)కి హాని తలపెట్టిన అబ్రార్‌ హక్ (బాబీ డియోల్‌)ను అంతం చేస్తాడు. దీంతో రివేంజ్‌ కోసం అబ్రార్‌ సోదరుడు అజిజ్‌.. రణ్‌విజయ్‌ సింగ్‌లా ప్లాస్టిక్‌ సర్జరీ చేయించుకుంటాడు. రణ్‌విజయ్‌లా హీరో ఇంటికి వెళ్లిన అజిజ్‌ అక్కడ రక్తపాతం సృష్టించడానికి ప్రయత్నిస్తాడు. తన అన్న చావు కోసం ప్రతీకారం తీర్చుకునేందుకు కుట్రలు చేస్తాడు. రణ్‌విజయ్‌ రూపంలో ఉన్న ఇద్దరు వ్యక్తుల మధ్య సాగే రివేంజ్‌ డ్రామా తొలి భాగం కంటే మరింత వైలెంట్‌గా ఉంటుందని నెట్టింట ప్రచారం జరుగుతోంది. 

  సీక్వెల్‌ 2025లోనే రానుందా?

  అయితే ఈ ‘యానిమల్‌ పార్క్‌’ (Animal Park Story)కు సంబంధించి స్క్రిప్ట్‌ వర్క్‌ ఈ నెలలోనే మెుదలవుతుందని సందీప్‌రెడ్డి వంగా సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ మూవీ నిర్మాత భూషణ్‌ కుమార్‌.. ప్రభాస్‌తో కూడా ‘స్పిరిట్‌’ సినిమా తీయనున్నారు. దీనికి కూడా సందీప్‌ రెడ్డి వంగానే దర్శకుడు. కొద్ది నెలల్లో చిత్రీకరణ పనులు కూడా ప్రారంభయ్యే ఛాన్స్ ఉంది. ఈ గ్యాప్‌లో ‘యానిమల్‌ 2’ సీక్వెల్‌ స్క్రిప్ట్‌ను డెవలప్‌ చేసేందుకు సందీప్‌ రైటింగ్‌ టీమ్‌ ప్రయత్నిస్తోందట. ఇప్పటికే ఆ పనుల్లో నిమగ్నమైనట్లు కూడా టాక్‌ వినిపిస్తోంది. 2025లో ‘యానిమల్‌ పార్క్‌’ను రిలీజ్‌ చేస్తారని టాక్‌. 

  మీ భర్తను అడగండి!

  బాలీవుడ్‌ హీరో అమీర్‌ఖాన్‌ (Aamir Khan) భార్య కిరణ్‌ రావు (Kiran Rao).. ఇటీవల ఓ ఇంటర్యూలో సందీప్‌రెడ్డి వంగా చిత్రంపై విమర్శలు చేశారు. స్త్రీల పట్ల ద్వేషం, వేధింపులను ప్రోత్సహించేలా ఉందంటూ వ్యాఖ్యానించారు. దీనిపై తాజాగా స్పందించిన సందీప్‌ ఆమె పేరు ప్రస్తావించకుండానే చురకలు అంటించారు. ‘నేను ఆమెకు ఒకటే చెప్పాలనుకుంటున్నా. మీరు అమీర్‌ ఖాన్‌ని వెళ్లి అడగండి. ఆయన నటించిన దిల్‌ సినిమాలో దాదాపు అమ్మాయిపై రేప్‌కు ప్రయత్నించే పరిస్థితిని సృష్టిస్తాడు. ఆ తర్వాత ఆమెనే తప్పు చేసినట్లుగా భావించేలా చేస్తాడు. చివరికి ఆమె అతనితోనే ప్రేమలో పడుతుంది. ఇదంతా ఏంటి? ఇలాంటివన్నీ తెలుసుకోకుండానే మాపై ఎలా దాడి చేస్తారో అర్థం కావడం లేదు’ అని విమర్శించారు.

  ఆ స్టార్లతో వర్క్‌ చేయాలి: వంగా

  తాజాగా ఇచ్చిన మరో ఇంటర్యూలో సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్‌ అగ్ర కథానాయకుడు షారుక్‌ఖాన్‌ (Shah Rukh Khan)తో కలిసి పని చేయాలని ఉందన్నారు. ‘కొంతకాలం క్రితం అనుకోని విధంగా ఆయన్ని కలిశా. ‘యానిమల్‌’ టీజర్‌ చూపించా. తనకెంతో నచ్చిందని చెప్పారు. చాలా సంతోషంగా అనిపించింది. ఆయనొక గొప్ప నటుడు. భవిష్యత్తులో తప్పకుండా కలిసి పని చేయాలని అనుకుంటున్నా. రణ్‌వీర్‌ సింగ్‌తోనూ సినిమా చేయాలని ఉంది’ అని సందీప్‌ అన్నారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv