• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • గీతాగోవిందం సినిమాకు సీక్వెల్?

  విజయ్ దేవరకొండ- రష్మిక మంధాన నటించిన గీతాగోవిందం సినిమాకు సీక్వెల్ రానున్నట్లు తెలిసింది. లైగర్ ప్లాప్ తర్వాత విజయ్ ఖుషి సినిమా చేస్తున్నారు. అయితే సమంత అనారోగ్యం వల్ల ఈ మూవీ షూటింగ్ వాయిదాపడుతూ వస్తోంది. ఈక్రమంలో గీతగోవిందం డైరెక్టర్ పరుశురామ్ ఓ కథను వినిపించారని దానికి విజయ్ ఓకే చెప్పినట్లు తెలిసింది. ఈ సినిమాలో విజయ్ సరసన రష్మిక నటించనున్నట్లు టాక్. అయితే ఇది సీక్వెల్‌లా లేక కొత్త కథ అనేదానిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని తెలిసింది.

  “అవును, విజయ్‌ నేను టూర్‌కు వెళ్లాం”: రష్మిక

  తెలుగు, తమిళ, కన్నడ, హిందీ సినిమాల్లో నటిస్తూ నేషనల్‌ క్రష్‌గా పేరు తెచ్చుకున్న నటి రష్మిక మందన్న. నటుడు విజయ్‌ దేవరకొండతో ఈమె ప్రేమలో ఉందంటూ ఎంత కాలంగానే పుకార్లు వినిపిస్తున్నాయి. అయితే విజయ్‌ తనకు మంచి స్నేహితుడు మాత్రమేనని రష్మిక మరోసారి చెప్పింది. ‘‘విజయ్‌ నాకు బెస్ట్‌ ఫ్రెండ్‌. న్యూ ఇయర్‌ రోజు నేను లైవ్‌లో ఉన్నప్పుడు వెనుక విజయ్‌ వాయిస్‌ వినిపిస్తోందని కామెంట్స్‌ పెట్టారు. వాటిని చూసి మేము నవ్వుకున్నాం. విజయ్‌తో పాటు ఇంకో నలుగురి వాయిస్‌ కూడా ఉంది. అదెవరికీ … Read more

  విజయ్‌తో రష్మిక వెకేషన్ పూర్తి

  విజయ్ దేవరకొండతో మాల్దీవుల్లో వెకేషన్ పూర్తి చేసుకున్న రష్మిక మంధాన ముంబైకి చేరుకుంది. ఈ క్రమంలో ఫొటోగ్రాపర్ల కంటపడింది. మేడమ్ ఎలా ఉన్నారు ఒక్కసారి మాస్క్ తీయండి ఫొటోలు తీసుకుంటాం అని కోరగా.. రష్మిక నో చెప్పింది. ‘సారీ, నేను మాస్క్ తీయలేను. శరీరం నల్లగా మారింది. మాస్క్ తీస్తే మీరంతా భయపడుతారు’ అని రష్మిక బదులిచ్చింది. దీంతో రష్మిక ఎందుకు మాస్క్ తీయలేదబ్బా అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

  విజయ్‌, రష్మిక మాల్దీవ్స్‌ టూర్‌

  వెండితెర జోడీ విజయ్‌ దేవరకొండ, రష్మిక ప్రేమపై నిరంతరం వార్తలు వస్తూనే ఉంటాయి. వారు మాత్రం దీనిపై ఎప్పుడూ నోరు విప్పలేదు. అయితే ఇవాళ మరోసారి వీరి ప్రేమ వ్యవహారం వార్తల్లోకెక్కింది. వీరిద్దరూ కలిసి మాల్దీవులు టూర్‌ వెళ్తున్నారంటూ ప్రచారం సాగుతోంది.ఇవాళ ఉదయం రష్మిక ముంబయి ఎయిర్‌పోర్ట్‌లో కనిపించారు. ఫోటోగ్రాఫర్లకు హాయ్‌ చెప్పి లోపలికి వెళ్లిపోయారు. కాసేపటికే విజయ్‌ కూడా ఎయిర్‌పోర్ట్‌ చేరుకున్నాడు. దీంతో వీరిద్దరూ కలిసి మాల్దీవుల టూర్‌ వెళ్తున్నారంటూ గుసగుసలు మొదలయ్యాయి.

  నన్ను ఎవరో తలుచుకుంటున్నారు?

  పుష్ప సినిమాతో తన స్థాయిని మరింత పెంచుకుంది హీరోయిన్ రష్మిక మందన్న. అభిమానులు ముద్దుగా ఈ బ్యూటీని నేషనల్ క్రష్ అని పిలుచుకుంటుంటారు. తాజాగా ఈ అమ్మడు చేసిన ట్వీట్ ఒకటి వైరల్ అవుతోంది. ‘హికప్స్‌తో నిద్ర లేచా.. నన్నెవరు తలుచుకుంటున్నారో’ అంటూ ట్వీట్‌లో తెలిపింది. దీనిపై ట్విట్టర్ జనం విభిన్న రకాలుగా స్పందిస్తున్నారు. కొందరేమో మేమే అంటూ కామెంట్ చేస్తున్నారు. మరి మీ స్పందనేంటి? కామెంట్‌లో తెలపండి.

  సీతారామం మూవీ డిలెటెడ్ సీన్ వైరల్

  సీతారామం మూవీ డిలెటెడ్ సీన్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మూవీలో పాక్ యువతి అఫ్రిన్‌గా నటించిన రష్మిక ఇండియా గురించి తక్కువ చేసి మాట్లాడుతుంది. బ్యాగ్‌ను తిరిగిచ్చిన క్యాబ్ డ్రైవర్‌తో పొగరుగా ప్రవర్తిస్తుంది. ఈ సీన్ సినిమాలో ఉంటే కాంట్రవర్సీ అవుతుందని తీసేశారు. అయితే ఇది కూడా ఉంటే రష్మిక పాత్ర హైలైట్ అయ్యేదని భావిస్తున్నారు. దేశం గురించి గొప్ప మాటలే ఉన్నాయి కదా అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

  ‘సీతా రామం’ మూవీ నుంచి డిలీటెడ్ సీన్ రిలీజ్

  ‘సీతా రామం’ నుంచి తాజాగా ఒక డిలీటెడ్ సీన్‌ను రిలీజ్ చేశారు. అఫ్రీన్‌గా న‌టించిన ర‌ష్మిక సీత గురించి తెలుసుకునేందుకు నూర్జ‌హాన్ ప్యాలెస్‌కు వెళ్తుంది. ఆ స‌మ‌యంలో క్యాబ్‌లో ఆమె బ్యాగ్‌, పాస్‌పోర్ట్‌, వీసా అన్ని మ‌రిచిపోతుంది. బ‌య‌ట‌కు వ‌చ్చి చూసేస‌రికి ఆ క్యాబ్ డ్రైవ‌ర్ అక్క‌డే ఉంటాడు. దీంతో పాకిస్తాన్‌కు చెందిన ఆమె ఇండియాలో ఇలాంటి వాళ్లు కూడా ఉన్నారా అని అడుగుతుంది. మా దేశంలో అంద‌రూ ఇలానే ఉంటారు మేడ‌మ్. మీ బ్యాగ్ తీసుకొని వెళ్లి మా దేశం ప‌రువు తీయ‌లేను … Read more

  అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు పండ‌గే..’పుష్ప 2’ షూటింగ్ స్టార్ట్‌

  ‘పుష్ప 2’ షూటింగ్ ఎట్ట‌కేల‌కు మొద‌ల‌వుతుంది. ఎప్పుడో ప్రారంభం కావాల్సిన ఈ షూటింగ్ వివిధ కార‌ణాల‌తో వాయిదా ప‌డుతూ వ‌స్తుంది. అయితే నిన్న ర‌ష్మిక గుడ్‌బాయ్ ట్రైల‌ర్ లాంచ్‌లో భాగంగా పుష్ఫ‌2 షూటింగ్ మ‌రో రెండు రోజుల్లో స్టార్ట్ అవుతుంద‌ని చెప్పింది. మొద‌టిభాగం సూప‌ర్ స‌క్సెస్ కావ‌డంతో ఇప్పుడు రెండో భాగం విష‌యంలో సుకుమార్ చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్న‌ట్లు తెలుస్తుంది. పుష్ప 2లో క‌థ మొత్తం ఫ‌హాద్ ఫాజిల్, అల్లు అర్జున్‌ల మ‌ధ్య గొడ‌వ‌ల చుట్టూ ఉంటుంద‌ని చెప్తున్నారు. పార్ట్‌-1లో ఉన్న‌వారితో పాటు కొత్త … Read more

  ర‌ష్మిక తొలి హిందీ మూవీ ‘గుడ్‌బాయ్’ ట్రైల‌ర్ రిలీజ్

  ర‌ష్మిక మంద‌న న‌టించిన తొలి బాలీవుడ్ చిత్రం ‘గుడ్‌బాయ్’ ట్రైల‌ర్ రిలీజ్ అయింది. ట్రైల‌ర్‌లో ఫ‌న్, ఎమోష‌న్, స‌మాజంపై సెటైర్లు అన్నీ క‌లిసి ఉన్నాయి. ర‌ష్మిక తండ్రిగా అమితాబ్ న‌టించాడు. పుష్ప సినిమాతో త‌న‌కు బాలీవుడ్ ప్రేక్ష‌కుల నుంచి చాలా ప్రేమ ల‌భించింది. ఇది నా మొద‌టి హిందీ సినిమా. దీన్ని కూడా అంతే ఆద‌రిస్తార‌ని కోరుకుంటున్నాను అని ట్రైల‌ర్ లాంచ్ కార్య‌క్ర‌మంలో ర‌ష్మిక చెప్పింది. ఈ మూవీ అక్టోబ‌ర్ 7న విడుద‌ల కానుంది.

  ర‌ష్మిక బాలీవుడ్ మూవీ ‘గుడ్‌బై’ రిలీజ్ డేట్ ఫిక్స్‌

  ర‌ష్మిక బాలీవుడ్‌లో అమితాబ్‌తో క‌లిసి న‌టించిన మూవీ ‘గుడ్‌బై’. ఈ సినిమా విడుద‌ల తేదీని తాజాగా ప్ర‌క‌టించారు. అక్టోబ‌ర్ 7న చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. మూవీ ఫ‌స్ట్ లుక్ పోస్టర్‌లో ర‌ష్మిక, అమితాబ్ ప‌తంగి ఎగ‌ర‌వేస్తూ క‌నిపిస్తున్నారు. ఈ సినిమాలో ఆమె అమితాబ్‌కు కూతురుగా న‌టించింది. మీ ఫ్యామిలీని క‌లిసేందుకు మా నాన్న, నేను వ‌స్తున్నామంటూ ఆమె సోష‌ల్‌మీడియాలో పోస్ట‌ర్‌ను పంచుకుంది. వికాస్ బ‌హ‌ల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని ఏక్తా క‌పూర్ నిర్మించింది.