• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • Rashmika Fake Video: నెట్టింట రష్మిక బోల్డ్‌ వీడియో వైరల్‌.. మండిపడ్డ కేంద్రం, అమితాబ్‌ బచ్చన్‌!

  సినీ ఇండస్ట్రీలో అత్యంత ఫ్యాన్‌ ఫాలోయింగ్ కలిగిన హీరోయిన్లలో రష్మిక (Rashmika) ఒకటి. ఈ భామ ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో తన పోస్టులను షేర్‌ చేస్తూ ఫ్యాన్స్‌ను అలరిస్తుంటుంది. ఈ భామ పెట్టే ఏ చిన్న ఫోటో అయినా నిమిషాల వ్యవధిలో ట్రెండింగ్‌లోకి వచ్చేస్తుంటుంది. అయితే తాజాగా రష్మికకు సంబంధించిన ఫేక్ వీడియో ఒకటి నెట్టింట వైరల్‌ అవుతోంది. 

  రష్మిక డీప్‌నెక్ బ్లాక్‌ డ్రెస్‌ వేసుకుని లిఫ్ట్‌లో ఉన్నట్లు వీడియోను మార్ఫింగ్‌ చేసి సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. నిమిషాల వ్యవధిలోనే ఈ ఫేక్‌ వీడియో విపరీతంగా వైరల్ అయ్యింది. అయితే దీనికి సంబంధించిన ఒరిజినల్ వీడియోను ఓ జర్నలిస్ట్‌ పోస్ట్ చేసి క్లారిటీ ఇచ్చారు. ఆ వీడియోలో ఉన్నది జారా పటేల్ అనే యువతి అని రష్మిక కాదని స్పష్టం చేశారు. 

  ఈ AI ఫేక్‌ వీడియోపై నటి రష్మిక స్పందించింది. ఇది తనను చాలా బాధించిందని ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో చెప్పుకొచ్చింది. టెక్నాలజీని ఎలా దుర్వినియోగం చేస్తున్నారో చూస్తుంటే భయం కలుగుతోందని పేర్కొంది. తాను కాలేజీ రోజుల్లో ఉన్నప్పుడు ఈ తరహా ఘటన జరిగి ఉంటే ఎలా ఎదుర్కొగలిగే దానినో కూడా ఊహించలేకపోతున్నట్లు చెప్పింది. ఈ సందర్భంలో మహిళగా, నటిగా తనకు మద్దతుగా నిలిచిన స్నేహితులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులకు రష్మిక కృతజ్ఞతలు తెలిపింది.

  అటు రష్మిక మార్ఫింగ్‌ వీడియోపై కేంద్రం సైతం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఐటీ శాఖ సహాయమంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ దీనిపై స్పందించారు. ‘ఇంటర్నెట్‌ను ఉపయోగించే పౌరుల రక్షణకు కట్టుబడి ఉన్నాం. ఐటీ నిబంధనల ప్రకారం సామాజిక వేదికలు చట్టపరమైన బాధ్యతలు నిర్వర్తించాలి. తమ మాధ్యమాల్లో ఏ యూజర్‌ కూడా నకిలీ/తప్పుడు సమాచారాన్ని పోస్ట్‌ చేయకుండా చూడాలి. ఫేక్‌ సమాచారాన్ని గుర్తిస్తే 36 గంటల్లోగా తొలగించాలి. లేదంటే న్యాయస్థానాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది’ అని ట్విటర్‌లో హెచ్చరించారు. 

  ఈ వీడియోపై రష్మిక అభిమానులతోపాటు పలువురు సినీ ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మార్ఫింగ్‌ వీడియో ఘటనపై బాలీవుడ్‌ హీరో అమితాబ్‌ బచ్చన్ కూడా స్పందించారు. దీన్ని క్రియేట్ చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని పేర్కొన్నారు.

  ప్రస్తుతం రష్మిక టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ వరుస సినిమాలు చేస్తోంది. రణ్‌బీర్‌ సరసన ఆమె నటించిన ‘యానిమల్‌’ (Animal) చిత్రం డిసెంబర్‌ 1న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అలాగే అల్లు అర్జున్-సుకుమార్‌ల పాన్ ఇండియా సినిమా ‘పుష్ప-2’లోనూ (Pushpa-2) రష్మిక నటిస్తోంది. ఇవి కాకుండా మరో మూడు పెద్ద ప్రాజెక్ట్‌ల్లో అవకాశాలను సొంతం చేసుకున్నారు. 

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv