• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • 8 బ్యాంకుల లైసెన్స్‌ రద్దు చేసిన RBI

    నిబంధనలు పాటించని 8 రకాల బ్యాంకులపై ఆర్బీఐ కొరఢా ఝులిపించింది. 8 సహకార బ్యాంకుల లైసెన్స్‌లను రద్దుచేసింది. తగినంత మూలధనం లేకపోవడం, బ్యాంకింగ్ నియంత్రణ చట్టాన్ని పాటించకపోవడం, భవిష్యత్‌లో నష్టాల బాట పట్టే ప్రమాదం ఉండటంతో RBI వీటి లైసెన్స్‌లు రద్దు చేసింది. లైసెన్స్‌ కోల్పోయిన బ్యాంకులు.
    1. ముధోల కో-ఆపరేటివ్ బ్యాంక్
    2. మిలాత్ కో-ఆపరేటివ్ బ్యాంక్
    3. శ్రీ ఆనంద్ కో-ఆపరేటివ్ బ్యాంక్
    4. రూపి కో-ఆపరేటివ్ బ్యాంక్
    5. దక్కన్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్
    6. లక్ష్మీ కో-ఆపరేటివ్ బ్యాంక్
    7. సేవా వికాస్ కో-ఆపరేటివ్ బ్యాంక్ బ్యాంక్

    2022-23 ఆర్థిక సంవత్సరంలో ఈ బ్యాంకుల లైసెన్సు కాలపరిమితి మార్చి 31తో ముగిసింది. నిబంధనలు అతిక్రమిస్తుండటంతో దాదాపు 114 సార్లు రిజర్వు బ్యాంకు జరిమానాలు విధించింది. సహకార బ్యాంకులు గ్రామీణ ప్రాంతాల్లో వేగంగా విస్తరించాయి. కానీ, ఈ బ్యాంకుల్లో అక్రమాలు వెలుగు చూడటంతో ఆర్బీఐ చర్యలు చేపట్టింది. ఈ బ్యాంకుల ద్వంద్వ స్థితి , బలహీనమైన ఫైనాన్సింగ్ వ్యాపారం కారణంగా స్థానిక రాజకీయ నాయకుల జోక్యంతో సమస్యలు ఎదుర్కొంటున్నాయి. తరచూ నిబంధనలు ఉల్లింఘిస్తున్న కారణంగా ఆర్బీఐ చర్యలకు ఉపక్రమించింది. 

    ఈ బ్యాంకుల వద్ద తగినంత మూలధనం లేకపోవడం, బ్యాంకింగ్ నియంత్రణ చట్టాన్ని పాటించని కారణంగా 8 బ్యాంకులకు లైసెన్సులు రద్దు చేసింది. భవిష్యత్‌లో ఆదాయం తగ్గే అవకాశం ఉన్నందునా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు ప్రకటించారు. గత కొన్నేళ్లుగా సహకార బ్యాంకింగ్ రంగంపై ప్రత్యేక దృష్టి సారించింది. ప్రత్యేకంగా పర్యవేక్షిస్తోంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv