మరింత పెరగనున్న లోన్ల భారం
ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ మరోసారి రెపోరేటును పెంచుతున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న రెపో రేటును 25 బెసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు వెల్లడించారు. దీంతో రెపో రేటు 6.5శాతానికి పెరిగింది. రేపోరేటు పెరగడం వల్ల హోమ్ లోన్ EMIలు మరింత భారం కానున్నాయి. బ్యాంకులు సైతం రెపోరేటుకు అనుగుణంగా వడ్డీ రేట్లు పెంచే అవకాశం ఉంది.