క్రెడిట్ కార్డు ద్వారా యూపీఐ చెల్లింపులు చేసుకునే సౌలభ్యాన్ని కోటక్ మహీంద్రా బ్యాంక్ కల్పిస్తోంది. త్వరలోనే దీనిని అమలులోకి తీసుకు రానున్న తొలి బ్యాంకుకా ఘనత సాధించనుంది. డిజిటల్ వ్యాలెట్‌తో కోటక్ మహీంద్రా క్రెడిట్ కార్డును లింక్ చేసుకుని యూపీఐ చెల్లింపులు జరపొచ్చు. రూపే కార్డులకు మాత్రమే ఈ ఫీచర్ వర్తిస్తుంది. ఈ సేవలను పొందడానికి ముందుగా క్రెడిట్ కార్డును యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. యాడ్ బ్యాంక్ అకౌంట్ క్లిక్ చేసి.. క్రెడిట్ కార్డు ఆప్షన్‌ని ఎంచుకున్న అనంతరం వివరాలు సమర్పించాలి. త్వరలో మిగతా బ్యాంకులు కూడా ఈ వెసులుబాటును ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
క్రెడిట్ కార్డు నుంచి యూపీఐ చెల్లింపులకు అవకాశం కల్పించడం వినియోగదారులకు కాస్త ఊరటనిచ్చే విషయమే. ఇప్పటికే చాలా బ్యాంకులు ఈ దిశగా అడుగులు వేస్తున్నాయి. రూపే కార్డులకు మాత్రమే వర్తించే ఈ ఆప్షన్ ద్వారా బ్యాంకుల నుంచి బ్యాంకులకు, మెుబైల్ రీఛార్జ్‌లు, కరెంటు బిల్లులు చెల్లించడం వంటివి సౌకర్యవంతంగా చేసుకోవచ్చు. కానీ, వినియోగదారులు కొద్దిపాటి జాగ్రత్తగా ఉండాలి. క్రెడిట్ కార్డుతో యూపీఐ పేమెంట్స్ చేస్తున్నప్పుడు మీరు స్వల్ప కాలిక రుణం తీసుకుంటున్నారనే విషయాన్ని మర్చిపోవద్దు. బ్యాంకు ఖాతా నుంచి అప్పటికప్పుడు డెబిట్ కాకపోయినా నిర్ణీత వ్యవధిలోగా చెల్లించాల్సి ఉంటుంది.
గడువులోగా డబ్బులు సర్ధుబాటు అవుతాయి అనుకున్నప్పుడే ఇలాంటి చెల్లింపులు చేయాలి. లేదంటే అప్పుల ఊబిలో కూరుకుపోయే ప్రమాదం ఉంటుంది. తప్పదనుకున్నప్పుడు మాత్రమే అత్యవసర సమయాల్లో క్రెడిట్ కార్డు ద్వారా యూపీఐ చెల్లింపులు చేస్తే బాగుంటుంది. అప్పుడే ఇబ్బందులు ఎదురుకాకుండా యూపీఐ చెల్లింపులు ప్రయోజనకరంగా మారుతాయి.ఇప్పటికే హెచ్‌డీఎఫ్‌సీ, ఇండియన్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంకులు జారీ చేసిన రూపే క్రెడిట్ కార్డుల ద్వారా ఈ యూపీఐ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు.
Celebrities Featured Articles Hot Actress
Arrchita Agarwaal: శరీరం అలా ఉంటేనే ఇండస్ట్రీలోకి రావాలి: బాలీవుడ్ నటి