విదేశాల్లో ఫోన్‌పేతో పేమెంట్స్
ఫోన్‌పేలో సరికొత్త సేవలు అందుబాటులోకి వచ్చాయి. విదేశాల్లో భారతీయులు ఇకపై ఫోన్‌పే యూపీఐ ద్వారా నగదు చెల్లింపులు చేయవచ్చు. యూఏఈ, సింగపూర్, మారిషస్, నేపాల్, భూటాన్ దేశాల్లో సేవలను వినియోగించవచ్చని వెల్లడించారు. దీంతో అంతర్జాతీయంగా యూపీఐ సేవలను అందుబాటులోకి తీసుకుచ్చిన తొలి సంస్థగా ఫిన్ టెక్ నిలిచింది. భారతీయులు విదేశాలకు వెళ్లినప్పుడు నగదు మార్పిడి చేయకుండా తమ భారతీయ ఖాతా ద్వారా చెల్లింపులు చేసే సౌలభ్యం కలిగింది.