ఐపీఎల్-2023 సీజన్ ఎన్నో రికార్డులకు వేదికైంది. అత్యధిక సెంచరీలు, హై స్కోరింగ్ మ్యాచ్‌లు, చివరి బాల్ విన్స్ ఇలా ఎన్నో మరుపురాని గుర్తులతో ఈ సీజన్ ముగిసింది. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన తుదిపోరులో చెన్నై విజయం సాధించగా.. ఈ మ్యాచ్ ద్వారా ఐపీఎల్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా ధోని నిలిచాడు. ఈ నేపథ్యంలో ధోని తర్వాత అత్యధిక మ్యాచ్‌లు ఆడింది ఎవరు? వారి రన్స్ ఎలా ఉన్నాయి? హై స్కోర్ ఎంత? ఇప్పుడు తెలుసుకుందాం
1. ఎం.ఎస్ ధోని
ఐపీఎల్‌లో 250 మ్యాచ్‌లు ఆడిన తొలి క్రికెటర్‌గా ఎం.ఎస్ ధోని రికార్డు సృష్టించాడు. ఇందులో 220 మ్యాచ్‌లు చెన్నై తరుపున తరపున ఆడగా.. రైజింగ్ పుణె సూపర్ జెయింట్ తరఫున 30 గేమ్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఇక ఐపీఎల్ చరిత్రలో 11 ఫైనల్స్ ఆడిన తొలి ఆడగాడు కూడా ధోనీనే కావడం విశేషం. ఐపీఎల్‌లో 5,082 పరుగులు పూర్తి చేసుకున్న ధోని.. 142 క్యాచ్‌లు పట్టాడు. 42
స్టంపౌట్లు చేశాడు. 84 పరుగులు ఐపీఎల్‌లో ధోని వ్యక్తిగత హైస్కోర్‌గా ఉంది.
2. రోహిత్ శర్మ
ఐపీఎల్ అత్యధిక మ్యాచ్‌లు ఆడిన జాబితాలో రోహిత్ శర్మ రెండోస్థానంలో ఉన్నాడు. ఇప్పటివరకు
243 మ్యాచ్‌లు ఆడిన రోహిత్.. 6,211 రన్స్ చేశాడు. 109* హైయస్ట్ స్కోరుగా ఉంది. ఇక బౌలింగ్‌లో 15 వికెట్లను సైతం రోహిత్ పడగొట్టాడు. ఆరు పరుగులకు నాలుగు వికెట్లు తీసి (4/6) అత్యుత్తమ గణాంకాలను నమోదు చేశాడు. అటు 98 క్యాచ్‌లు సైతం హిట్‌మ్యాన్ పట్టాడు.
3. దినేష్ కార్తిక్
వికెట్ కీపర్ దినేష్ కార్తిక్ ఐపీఎల్‌లో 242 మ్యాచ్‌లు ఆడి 4,516 రన్స్ చేశాడు. ఇందులో 97* హైయస్ట్ స్కోరుగా ఉంది. ఇక కీపింగ్‌లో 141 క్యాచ్‌లు అందుకున్న కార్తిక్.. 36 స్టంపౌట్లు చేశాడు.
4. విరాట్ కోహ్లీ
ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీ 237 మ్యాచ్‌లు ఆడాడు. తన బ్యాటుతో 7,263 పరుగులు సాధించాడు. 113 విరాట్ కోహ్లీ అత్యధిక స్కోరుగా ఉంది. నాలుగు వికెట్లను సైతం తన ఖాతాలో వేసుకున్న విరాట్ 2/25 గణాంకాలను నమోదు చేశాడు. 106 క్యాచ్‌లు అందుకున్నాడు.
5. రవీంద్ర జడేజా
ఐపీఎల్‌లో 226 మ్యాచ్‌లు ఆడిన రవీంద్ర జడేజా ఈ జాబితాలో ఐదో స్థానంలో ఉన్నాడు. అలాగే ఇప్పటివరకూ 2,692 పరుగులు చేశాడు. 62 రన్స్ హైయస్ట్ స్కోరుగా ఉంది. బౌలింగ్‌లోనూ 152 వికెట్లు పడగొట్టిన జడ్డు.. 5/16 అత్యుత్తమ గణాంకాలను నమోదు చేశాడు. అలాగే 97 క్యాచ్‌లు పట్టాడు.
6. శిఖర్ ధావన్
ఐపీఎల్‌లో 217 మ్యాచ్‌లు ఆడిన శిఖర్ ధావన్ 6,617 రన్స్ చేశాడు. 106* హైస్కోర్ నమోదు చేశాడు. నాలుగు వికెట్లను సైతం తీసిన ధావన్ ఇప్పటివరకూ 96 క్యాచ్‌లు పట్టాడు.
7. సురేష్ రైనా
శిఖర్ ధావన్ తర్వాత అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా సురేష్ రైనా ఉన్నాడు. ఐపీఎల్‌లో 205 మ్యాచ్‌లు ఆడిన రైనా 5,528 పరుగులు రాబట్టాడు. ఇందులో 100* హై స్కోరుగా ఉంది. తన బౌలింగ్‌లో 25 వికెట్లు తీసిన రైనా.. 2/0 గణాంకాలు నమోదు చేశాడు. అలాగే 109 క్యాచ్‌లు ఒడిసిపట్టాడు. కాగా, గతేడాది ఐపీఎల్‌కు రైనా గుడ్‌బై చెప్పాడు.
8. రాబిన్ ఉతప్ప
వికెట్ కీపర్ రాబిన్ ఉతప్ప ఐపీఎల్‌లో 205 మ్యాచ్‌లు ఆడి 4,952 రన్స్ చేశాడు. 88 పరుగులు అతడి హైస్కోర్‌గా ఉంది. మెుత్తం 92 క్యాచ్‌లు పట్టిన ఉతప్ప 32 స్టంపౌట్లు చేశాడు. ఉతప్ప కూడా ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.
9. అంబటి రాయుడు
తెలుగు తేజం అంబటి రాయుడు ఇప్పటివరకూ 204 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాడు. 4,348 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో 100* రాయుడి హైయస్ట్ స్కోరుగా ఉంది. ఇప్పటివరకు 64 క్యాచ్‌లు అందుకున్న రాయుడు 2 స్టంపౌట్లు కూడా చేశాడు. గుజరాత్ vs చెన్నై మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌తో రాయుడు ఐపీఎల్ కెరీర్ ముగిసింది. ఇకపై ఐపీఎల్‌లో ఆడనని రాయుడు ప్రకటించిన విషయం తెలిసిందే.
10. రవిచంద్రన్ అశ్విన్
ఐపీఎల్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన పదో ఆటగాడిగా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ నిలిచాడు. ఇప్పటివరకూ 197 మ్యాచ్‌లు ఆడిన అశ్విన్ 171 వికెట్లు పడగొట్టాడు. 4/34 అత్యుత్తమ గణాంకాలను నమోదు చేశాడు. అలాగే బ్యాట్‌తోనూ రాణించి 714 రన్స్ చేశాడు. 43 క్యాచ్‌లను సైతం అందుకున్నాడు.
Celebrities Featured Articles Movie News
Anasuya Bharadwaj: నా భర్త కోపరేట్ చేయట్లేదు.. ఆనసూయ హాట్ కామెంట్స్ వైరల్