• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ఎస్‌బీఐ అంబాసిడర్‌గా ధోని

  దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్‌బీఐ టీమిండియా మాజీ కెప్టెన్ ధోనిని తమ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుంది. క్లిష్టపరిస్థితుల్లో ప్రశాంతంగా ఉంటూ తెలివైన నిర్ణయాలను తీసుకోవడంలో ధోనీ ప్రసిద్ధి చెందిన సంగతి తెలిసిందే. ఈ లక్షణాలు తమ మార్కెటింగ్‌కు, కస్టమర్లకు మరింత కనెక్ట్ చేస్తుందని ఎస్‌బీఐ తెలిపింది. నైతికతకు పరిపూర్ణ రూపంగా ధోనితో భాగస్వామ్యం నిలుస్తుందని వెల్లడించింది.

  ‘రోహిత్ కెరీర్‌లో ధోనీదే కీలక పాత్ర’

  టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ఓపెనర్‌గా ధోనీనే అవకాశం ఇచ్చారని మాజీ క్రికెటర్ శ్రీ శాంత్ తెలిపాడు. రోహిత్ కెరీర్ ఇలా ఉండటానికి తనే కారణమని ధోనీ ఎప్పుడూ చెప్పుకోలేదని తెలిపాడు. ‘రోహిత్‌కు ధోనీ ఎందుకు ఓపెనర్‌గా అవకాశం ఇచ్చాడంటే, రోహిత్ అయితే ఆ స్థానంలో అద్భుతమైన ప్రదర్శన చేయగలడని అతడికి బాగా తెలుసు. అలాగే రైనా, విరాట్, అశ్విన్ విషయంలోనూ ధోనీ ఎన్నో నిర్ణయాలు తీసుకున్నాడు. వారితో పాటు నా కెరీర్‌లోనూ ధోనీ కీలక పాత్రపోషించాడు’ అని శ్రీశాంత్ చెప్పుకొచ్చాడు.

  మందు కొడుతున్న ధోనీ: వీడియో వైరల్

  భారత క్రికెట్ దిగ్గజం మహేంద్రసింగ్ ధోనికి సంబంధించిన ఓ పాత వీడియో ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోలో ధోని తన స్నేహితులతో కలసి మద్యం తాగుతుండడం విశేషం. ధోని కెరీర్ ఆరంభంలో ఈ వీడియో తీసినట్లుగా కనిపిస్తోంది. ఈ వీడియోలో మద్యం తాగుతూ.. ఫోన్ మాట్లాడుతూ ధోని కనిపించాడు. తన స్నేహితులు కూడా వైన్ సేవిస్తున్నారు. ఓ చిన్న గదిలో కింద కూర్చుని సాదాసీదాగా మహీ ఉన్నాడు. ఇది ఎక్కడ జరిగిందనేది క్లారిటీ లేదు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. … Read more

  వాహనాలంటే ఇంత పిచ్చేంటి ధోని భయ్యా?

  భారత మాజీ క్రికెటర్‌ ఎంఎస్‌ ధోనికి వాహనాలంటే ఎంతో ఇష్టమో మనకు తెలిసిందే. రాంచీలోని తన సొంత ఇంట్లో కార్లు, బైక్‌ల కోసం ప్రత్యేక గ్యారేజీనే ఏర్పాటు చేసుకున్నాడు. గ్యారేజీ మొత్తం వివిధ రకాల బైకులు, కార్లతో నిండిపోయింది. పాత కార్ల నుంచి లేటెస్ట్ మోడల్స్ వరకు ధోని గ్యారేజ్‌లో ఉన్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన అభిమానులు, ఇంత పిచ్చి ఏంటి ధోని భయ్యా అంటూ కామెంట్స్‌ పెడుతున్నారు. One of the craziest passion … Read more

  India Lost ICC Trophies: నాకౌట్స్‌లో టీమిండియా చెత్త రికార్డు.. పదేళ్లలో 8 ట్రోఫీలు ఫసక్..!

  2013 తర్వాత టీమిండియా ఏకంగా 8 ఐసీసీ ట్రోఫీలను నాకౌట్స్‌లో కోల్పోయింది. కొన్నింట్లో తుది వరకు వచ్చి ఓడిపోతే, మరికొన్నింట్లో మొదట్లోనే చేతులెత్తేసింది. 2014లో టీ20 వరల్డ్‌కప్‌‌లో మొదలైన పరాభవ ప్రస్థానం.. నిన్న మొన్నటి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ వరకు కొనసాగింది. నాకౌట్స్‌లో పేలవ ఆట తీరుతో టీమిండియా అభిమానులకు నిరాశే మిగుల్చుతోంది. 2013 తర్వాత భారత్ ఇప్పటివరకు కోల్పోయిన ఐసీసీ ట్రోఫీలేంటో చూద్దాం. 2014 టీ20 వరల్డ్‌కప్.. గ్రూప్ దశలో ఓటమే ఎరుగకుండా నాకౌట్స్‌లోకి ప్రవేశించింది భారత్. సెమీఫైనల్‌లో సౌతాఫ్రికాను మట్టికరిపించి … Read more

  రిటైర్మెంట్‌పై ధోని కీలక ప్రకటన

  చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ టైటిల్ గెలిచిన అనంతరం.. ధోని తన రిటైర్మెంట్‌పై కీలక ప్రకటన చేశాడు. ‘ఇలాంటి ఉద్విగ్న క్షణాల్లో రిటైర్మెంట్ ప్రకటించడం చాలా తేలిక. వచ్చే ఐపీఎల్ సీజన్ కోసం తొమ్మిది నెలల పాటు శిక్షణ పొందాలనుకుంటున్నా. ఇది ఫ్యాన్స్‌కు నా నుంచి అందించే గిఫ్ట్. స్టేడియంలో మ్యాచ్ జరిగిన క్షణాలు మరవలేను. స్టేడియంలో ధోని, ధోని నినాదాలు నా కళ్లల్లో నీళ్లు తెప్పించాయి’ అంటూ చెప్పుకొచ్చాడు. Thala happy and so are we ✨?pic.twitter.com/WfT3VybSUt — Chennai Super … Read more

  టాస్ గెలిస్తే చెన్నై బ్యాటింగ్?

  ఐపీఎల్ ఫైనల్‌ సన్నద్ధతపై చెన్నై కోచ్ స్టిఫెన్ ఫ్లేమింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఫైనల్ ఎప్పుడూ ప్రత్యేకమే. ఫైనల్స్‌లో మా రికార్డు 50శాతంగా ఉంది. శుభ్‌మన్‌ గిల్ అద్భుతంగా ఆడుతున్నాడు. గిల్‌ను త్వరగా ఔట్‌ చేయాల్సి ఉంది. గత మ్యాచ్‌లో త్వరగా వికెట్లను తీయడం వల్ల GT పైచేయి సాధించగలిగాం. తొలి క్వాలిఫయర్‌లో తొలుత మేం బౌలింగ్‌ చేయాలని భావించాం. కానీ ఫస్ట్‌ బ్యాటింగ్‌ చేయడం సరైందేనని తేలింది. ఈసారి టాస్ కీలకం. మాకున్న అనుభవంతో ఫైనల్‌ మ్యాచ్‌లో కచ్చితంగా విజయం సాధిస్తాం’ అని … Read more

  హమ్మయ్యా.. ధోని రిటైర్మెంట్ లేనట్లే!

  సీఎస్కే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి ఐపీఎల్ 2023 సీజన్ చివరిదని అందరూ అనుకుంటుటున్నారు. ఈ క్రమంలోనే ధోని ఆటను ఆస్వాదించడానికి అభిమానులు స్టేడియాలకు పోటెత్తుతున్నారు. అతడు రెండు బంతులాడినా అదే మాకు మహాప్రసాదం అన్నట్లుగా ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. ఈ క్రమంలో లక్నోతో మ్యాచ్‌లో టాస్ సందర్భంగా కామెంటేటర్ డానీ మారిసన్ ‘‘ఇదే నీకు చివరి ఐపీఎల్ అవుతుందా.. అందుకే ఇంతమంది ప్రేక్షకులు స్టేడియానికి వచ్చారా’’ అంటూ ధోనిని ప్రశ్నించాడు. ‘‘ఇదే నా చివరి ఐపీఎల్ అని మీరే డిసైడ్ అయ్యారు.. నేను కాదు.’’ … Read more

  ధోనీ న్యూ లుక్; పిక్స్ వైరల్

  భారత క్రికెట్ మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ న్యూ లుక్ అదిరిపోయింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తెల్ల గడ్డం, నల్ల జుట్టుతో సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో ట్రెండీగా కనిపిస్తున్నాడు. కాగా ఐపీఎల్ ప్రారంభమవ్వడానికి మరో 2 నెలలు మాత్రమే ఉండడంతో ధోనీ ప్రాక్టీస్ మొదలెట్టేశాడు. ప్రాక్టీస్‌కు సంబంధిం చిన [వీడియో](url)లు కూడా వైరల్‌గా మారాయి. వచ్చే ఐపీఎల్ ధోనీకి చివరిదని క్రీడా విశ్లేషకులు, అభిమానులు పేర్కొంటున్నారు. MS Dhoni practicing at nets ahead of IPL … Read more

  గోల్ఫ్ ఆడిన WC విన్నింగ్ కెప్టెన్లు

  ఇండియాకు వరల్డ్ కప్ తెచ్చిపెట్టిన లెజెండరీ కెప్టెన్లు మహేంద్ర సింగ్ ధోని, కపిల్ దేవ్ ఇద్దరూ కలిసి గోల్ఫ్ ఆడారు. గురుగ్రామ్‌లో నిర్వహించిన కపిల్ దేవ్-గ్రాంట్ థోర్న్‌టన్ ఇన్విటేషనల్ 2022 ఈవెంట్‌లో ధోని పాల్గొన్నాడు. ఈ సందర్భంగా గోల్ఫ్ ఆడుతూ అందరినీ ఆశ్చర్యపరిచాడు. క్రికెట్‌లో కాకుండా గోల్ఫ్‌లో కూడా ప్రతిభ కనబరచాడు. అటు కపిల్ దేవ్ సైతం ధోనితో కాలిసి ఆటలో పాలుపంచుకున్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన [వీడియో](url) సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. Exclusive glimpse of Mahi playing golf ! … Read more