కోహ్లీ ఫోన్ పోయిందట.. ట్వీట్ వైరల్
విరాట్ కోహ్లీ చేసిన ఓ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. ‘అన్ బాక్సింగ్ చేయకుండానే కొత్త ఫోన్‌ని పోగొట్టుకుంటే ఆ బాధ వర్ణనాతీతం. ఎవరైనా నా ఫోన్‌ని చూశారా?’ అని విరాట్ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌కు జొమాటో విచిత్రంగా స్పందిస్తూ ‘ఫర్వాలేదు. వదిన ఫోన్ నుంచి చల్లటి ఐస్క్రీంని ఆర్డర్ చేయు. అదొక్కటే ఉపశమనం కలిగిస్తుంది’ అని బదులిచ్చింది. ప్రమోషన్లలో భాగంగానే కోహ్లీ ఇలా ట్వీట్ చేసి ఉంటాడని పలువురు నెటిజన్లు భావిస్తున్నారు. మరికొందరేమో కోహ్లీకి ఫోన్ పంపించాలంటూ కంపెనీలను ట్యాగ్ చేస్తున్నారు. … Read more