• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • అతడి వల్లే భారీ స్కోరు సాధించాం: రోహిత్

  దక్షిణాఫ్రికాపై విరాట్ కోహ్లీ సెంచరీతో భారీ స్కోరు సాధించగలిగామని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. ఈ మ్యాచ్‌లో బౌలర్లు ఎంతో కీలక పాత్ర పోషించారని తెలిపాడు. అందుకే దక్షిణాఫ్రికాపై భారత్ 243 పరుగుల భారీ తేడాతో విజయం సాధించిందన్నాడు. ఇంగ్లాండ్‌తో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొని మరీ విజయం సాధించామని చెప్పాడు. దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ క్లిష్ట పరిస్థితుల్లో అద్భుతంగా ఆడాడని రోహిత్ కొనియాడాడు.

  ముందే సెమీస్‌కు చేరడం ఆనందం: రోహిత్

  వన్డే ప్రపంచకప్‌లో ముందే సెమీస్‌కు చేరడం ఆనందంగా ఉందని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. తమ తొలి లక్ష్యం పూర్తయిందని తెలిపాడు.. ‘ఇక ముందున్న సవాళ్లకు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. జట్టులో ప్రతి ఒక్కరూ తమ పాత్రను గొప్పగా పోషిస్తున్నారు. వరల్డ్‌ కప్‌లో మా ఆటతీరు పట్ల గర్వంగా ఉంది. ఇప్పుడు అధికారికంగా సెమీస్‌కు చేరుకోవడం ఇంకా ఆనందాన్ని కలిగించింది. ఇక ఫైనల్స్‌పైనే గురి పెడతాం’. అని రోహిత్ చెప్పుకొచ్చాడు.

  బౌలర్లు అద్భుతం చేశారు: రోహిత్

  ఇంగ్లాండ్‌పై విజయం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని టీమిండియా కెప్టెన్‌ రోహిత్ శర్మ అన్నాడు. అనవసర షాట్లకు యత్నించి తనతోపాటు మిగతా బ్యాటర్లు వికెట్‌ సమర్పించారని పేర్కొన్నాడు. ‘జట్టులోని ప్రతి ఆటగాడికీ కఠిన పరీక్ష పెట్టిన మ్యాచ్‌ ఇది. బ్యాటింగ్‌లో అనుకున్నంతమేర రాణించలేదు. 30 పరుగులు తక్కువ చేసినట్లు అనిపించింది. కానీ, భారత బౌలింగ్‌ విభాగం అద్భుతం చేసింది. కీలక సమయాల్లో వికెట్లు తీసి ప్రత్యర్థిని కుదురుకోనివ్వలేదు. మా బౌలర్ల అనుభవం కలిసొచ్చింది’ అని రోహిత్ చెప్పాడు.

  రోహిత్ శర్మ అరుదైన ఘనత

  టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో 87(107) పరుగులు చేసిన రోహిత్ శర్మ.. 18వేల పరుగుల మార్కును క్రాస్ చేశాడు. ఈ ఘనత సాధించిన ఐదో టీమిండియా క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. రోహిత్ కంటే ముందు సచిన్(34,357), కోహ్లీ(26,421), ద్రవిడ్(24,208), గంగూలీ(18,575) ఈ ఘనత సాధించారు. మరోవైపు ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లు అదరగొడుతున్నారు. 40 పరుగులకు 4 వికెట్లు తీశారు.

  ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌కు రోహిత్ శర్మ దూరం?

  ఇంగ్లాండ్‌తో జరగనున్న నేటి మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ దూరం కానున్నట్ల తెలుస్తోంది. ప్లాక్టిస్ సేషన్‌లో రోహిత్ మణికట్టుకు గాయం అయినట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై బీసీసీఐ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఒకవేళ రోహిత్‌ మ్యాచ్‌కు రాకుంటే.. కేఎల్ రాహుల్ కెప్టెన్సీ వహించనున్నాడు. ఇంగ్లాండ్‌పై గెలిస్తే టీమిండియా నేరుగా సెమీస్‌కు వెళ్తుంది. ఇప్పటికే స్టార్ అల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా గాయంతో మ్యాచ్‌లకు దూరమైన సంగతి తెలిసిందే.

  గెలుపు కోసం సమిష్టిగా పోరాడాలి: రోహిత్

  టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఓ ఇంటర్య్వూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. వన్డే వరల్డ్‌కప్‌లో పొరపాట్లకు తావులేకుండా జట్టు విజయాలు సాధిస్తుందని చెప్పాడు. ‘టీమిండియా గెలుపు కోసం ఒకరిద్దరు కాదు జట్టు సమిష్టిగా పోరాడాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరు తమ పాత్రకు న్యాయం చేస్తేనే ముందుకు వెళ్లగలుగుతాం. ఆటగాళ్లు ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనపై ఉంటుంది’ అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.

  రోహిత్ శర్మ అరుదైన ఘనత

  న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఓ అరుదైన ఘనతను నమోదు చేశాడు. కివీస్‌తో మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ .4 ఫోర్లు, 4 సిక్స్‌లు కొట్టాడు. ఈ క్రమంలో అంతర్జాతీయ వన్డేల్లో ఒక క్యాలెండర్ ఇయర్‌లో 50 లేదా అంతకంటే ఎక్కువ సిక్స్‌లు కొట్టిన ఆటగాడిగా రోహిత్ నిలిచాడు. రోహిత్‌ ఈ ఏడాదిలో ఇప్పటివరకు 53 సిక్స్‌లు కొట్టాడు. ఈ ఘనత సాధించిన జాబితాలో రోహిత్‌ మూడో స్ధానంలో నిలిచాడు. అతనికంటే ముందు ఏబీ డివిలియర్స్‌(58 సిక్స్‌లు) తొలి స్ధానంలో ఉండగా.. క్రిస్‌ … Read more

  సగం లక్ష్యమే పూర్తయ్యింది: రోహిత్

  వరల్డ్‌కప్‌లో 2003 తర్వాత న్యూజిలాండ్‌ను ఒడించడం ఆనందంగా ఉందని టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ చెప్పాడు. ‘టోర్నీలో ఒక్కో మ్యాచ్‌ గెలుచుకుంటూ ముందుకు సాగుతున్నాం. ఇప్పటికీ ఇంకా సగం లక్ష్యమే పూర్తయింది. జట్టును సమతూకంగా ఉంచడంతో పాటు వర్తమానంలో ఉండటం ముఖ్యం. షమీ తనకొచ్చిన ఛాన్స్‌ను రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు. ఒకదశలో కివీస్‌ 300+ స్కోరు చేస్తుందని భావించాం. కానీ, షమీతో సహా ఇతర బౌలర్లు ప్రత్యర్థిని కట్టడి చేశారు’ అని రోహిత్ అన్నాడు.

  రోహిత్ అంత స్పీడు వెళ్లలేదు: హైవే పోలీసులు

  టీమిండిమా కెప్టెన్ రోహిత్ శర్మ ఓవర్ స్పీడుతో కారు నడిపాడని వస్తున్న వార్తలపై హైవే పోలీసులు స్పందించారు. రోహిత్ గంటకు 215 కి. మీ స్పీడుతో నడిపాడని వచ్చిన ప్రచారంలో నిజం లేదన్నారు. అతడు గంటకు 105 నుంచి 117 కి, మీ వేగంతోనే ప్రయాణించాడని తెలిపారు. దీంతో రోహిత్‌కు రూ.2000 చెప్పున రెండు సార్లు ఫైన్ విధించామని పేర్కొన్నారు. ఈ మొత్తాన్ని రోహిత్ చెల్లించాడని చెప్పారు. హైవేపై కేవలం 100 కి, మీ వేగంతోనే ప్రయాణించాలని పోలీసులు వివరించారు.

  వివాదంలో ఇరుక్కున్న రోహిత్ శర్మ

  బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌ వేళ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వివాదంలో ఇరుక్కున్నాడు. ముంబై- పుణే రోడ్‌ లైన్‌లో అతని కారు నిబంధనలు అతిక్రమించి 200కి.మీ వేగంతో ప్రయాణించిందని అధికారులు తెలిపారు. కొన్ని ప్రదేశాల్లో 215 కి.మీ వేగంతో ప్రయాణించినట్లు చెప్పారు. వెర్వేరు ప్రాంతాల్లో పరిమితికి మించిన వేగంతో కారు వెళ్లినందుకు ఓనర్‌ అయిన రోహిత్‌కు చలానాలు విధించారు. అయితే కారు నడిపింది రోహితా కాదా అనేది తెలియాల్సి ఉంది.