• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • వన్డే ర్యాంకింగ్స్‌లో రోహిత్ దూకుడు

    టీమిండియా కెప్టెన్ రోహిత్‌ శర్మ వన్డే ర్యాంకింగ్స్‌లో దుసుకుపోతున్నాడు. ఈ క్రమంలో రోహిత్ స్థానాలను మెరుగుపర్చుకుని విరాట్ కోహ్లీ ని అధిగమించాడు. రోహిత్‌ ఐదు స్థానాలు ఎగబాకి ఆరో స్థానంలో నిలవగా ప్రపంచకప్‌లో వరుసగా రెండు అర్ధ శతకాలు బాదిన కోహ్లీ ఎనిమిదో స్థానంలో ఉన్నాడు. భారత ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ రెండో స్థానంలో, పాక్‌ కెప్టెన్ బాబర్ అజామ్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

    భారత్‌ను ఓడించడం కష్టమే: రికీ పాంటింగ్

    ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వరల్డ్ కప్‌లో భారత్‌ను ఓడించడం చాలా కష్టమని తెలిపారు. ‘బౌలింగ్, బ్యాటింగ్ అన్ని విభాగాల్లోనూ టీమిండియా పటిష్టంగా ఉంది. ఫాస్ట్, స్పిన్ బౌలింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక టాప్ మిడిలార్డర్ బ్యాటింగ్ బలంగా ఉంది. అందుకే భారత్‌ను ఎదుర్కోవడం కత్తిమీద సామే.. అయితే ఒత్తిడిని తట్టుకుని భారత్ ఇదే ఊపును ఎలా కొనసాగిస్తుందో చూడాలి’ అని పాంటింగ్ చెప్పుకొచ్చారు. రోహిత్ ఆడుతున్న తీరు చూస్తుంటే అతడు ఎంత బలంగా మారాడో అర్థమైపోతుందని … Read more

    టీమిండియా చరిత్ర తిరగరాస్తోంది: అక్తర్

    పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ టీమిండియాపై ప్రశంసలు కురిపించాడు. 2011 ప్రపంచకప్ చరిత్రను భారత్ తిరగ రాస్తుందన్నాడు. ‘2023 వన్డే వరల్డ్ కప్‌లో టీమిండియా సరైన మార్గంలో పయనిస్తోంది. వారు సెమీఫైన‌ల్లో తడబడకపోతే భారత్ నిజంగా వరల్డ్ కప్‌ గెలుస్తోంది. టీమిండియా అద్భతంగా ఆడుతోంది. పాక్‌ది చాలా నిరుత్సాహపరిచే ప్రదర్శన భారత్ పాక్‌ను పూర్తిగా చిత్తు చేసింది’ అని అక్తర్ పేర్కొన్నాడు.

    రోహిత్ ఆటతీరు అద్భుతం: పాక్ కెప్టెన్

    మ్యాచ్ అనంతరం పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ అజామ్ రోహిత్ శర్మపై ప్రశంసలు కురిపించాడు. రోహిత్ అద్భుతమైన రీతిలో బ్యాటింగ్‌ చేశాడని కొనియాడాడు. అతడిని నిలువరించడం కష్టంగా మరిందన్నాడు. ‘తొలుత మాకు శుభారంభమే లభించింది. రిజ్వాన్‌, నేనూ నార్మల్‌గానే ఆడాలనుకున్నాం. కానీ అకస్మాత్తుగా మా​ బ్యాటింగ్‌ ఆర్డర్‌ కుప్పకూలిపోయింది. సరైన రీతిలో ఇన్నింగ్స్‌ ముగించలేకపోయాం’ అని బాబర్ చెప్పుకొచ్చాడు. .

    రోహిత్ డేంజర్‌ బ్యాటర్‌: మాజీ క్రికెటర్

    టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా రోహిత్ శర్మపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వన్డే క్రికెట్‌లో అత్యుత్తమ ఆటగాళ్లలో రోహిత్ శర్మ ఒకడని కొనియాడారు. 50 ఓవర్ల ఫార్మాట్‌లో హిట్‌మ్యాన్‌ ఎన్నో ఘనతలు సాధించినా అతనికి తగిన గుర్తింపు దక్కడం లేదన్నారు. ‘రోహిత్ శర్మ ప్రపంచ కప్‌లో ఏడు సెంచరీలు సాధించాడు. అతను సిక్సర్లను చాలా అలవోకగా బాదతాడు. అతడికి మనం తగినంత గుర్తింపు ఇవ్వకపోవడం దురదృష్టకరం. రోహిత్ శర్మ వన్డేల్లో డేంజర్‌ బ్యాటర్‌’ అని చోప్రా పేర్కొన్నాడు.

    ‘రోహిత్ కెరీర్‌లో ధోనీదే కీలక పాత్ర’

    టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ఓపెనర్‌గా ధోనీనే అవకాశం ఇచ్చారని మాజీ క్రికెటర్ శ్రీ శాంత్ తెలిపాడు. రోహిత్ కెరీర్ ఇలా ఉండటానికి తనే కారణమని ధోనీ ఎప్పుడూ చెప్పుకోలేదని తెలిపాడు. ‘రోహిత్‌కు ధోనీ ఎందుకు ఓపెనర్‌గా అవకాశం ఇచ్చాడంటే, రోహిత్ అయితే ఆ స్థానంలో అద్భుతమైన ప్రదర్శన చేయగలడని అతడికి బాగా తెలుసు. అలాగే రైనా, విరాట్, అశ్విన్ విషయంలోనూ ధోనీ ఎన్నో నిర్ణయాలు తీసుకున్నాడు. వారితో పాటు నా కెరీర్‌లోనూ ధోనీ కీలక పాత్రపోషించాడు’ అని శ్రీశాంత్ చెప్పుకొచ్చాడు.

    సచిన్ రికార్డును బ్రేక్ చేసిన రోహిత్

    ఆఫ్గానిస్తాన్‌తో మ్యాచ్‌లో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్ హిట్‌ మ్యాన్ సెంచరీతో చెలరేగాడు. కేవలం 63 బంతుల్లోనే రోహిత్‌ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. మొత్తం 84 బంతులు రోహిత్‌.. 16 ఫోర్లు, 5 సిక్స్‌లతో 131 పరుగులు చేశాడు. ఈ క్రమంలో వన్డే ప్రపంచకప్‌లో ఫాస్టెస్ట్‌ సెంచరీ ఘటత రో​హిత్‌ శర్మకు దక్కింది. రోహిత్‌ ఇప్పటివరకు వన్డే ప్రపంచకప్‌లో 7 సెంచరీలు చేశాడు. ఈ క్రమంలో సచిన్ టెండూల్కర్ (6) రికార్డును రోహిత్ బ్రేక్‌ చేశాడు.

    IND vs AFG: టీమిండియా ఘన విజయం

    వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ఆఫ్గానిస్థాన్‌తో టీమిండియా తలపడింది. తొలుత టాస్ నెగ్గిన ఆఫ్గాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 50 ఓవర్లుకు ఆఫ్గాన్ 8 వికెట్లను కోల్పోయి 272 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 35 ఓవర్లలో నిర్థేశించిన లక్ష్యాన్ని చేరుకుని విజయం సాధించింది. టీమిండియా బ్యాటర్లు కెప్టెన్ రోహిత్ శర్మ (131) ఇషాన్ కిషన్ (47) విరాట్ కోహ్లీ (55) శ్రేయస్ అయ్యర్ (25) పరుగులు చేసి జట్టుకు ఘన విజయాన్ని అందించారు.

    రికార్డుల కోసం ఆడొద్దు: రోహిత్‌

    ఆసీస్‌తో తొలి మ్యాచ్‌కు ముందు సహచర క్రికెటర్లకు భారత కెప్టెన్ రోహిత్ శర్మ కీలక సూచనలు చేశాడు. వరల్డ్‌ కప్‌ వంటి మెగా టోర్నీల్లో ఎవరూ వ్యక్తిగత రికార్డులకు ప్రాధాన్యత ఇవ్వొద్దని సూచించాడు. అందుకు మెగా సంగ్రామం వేదికగా కాదని పేర్కొన్నాడు. జట్టులో హార్దిక్ వంటి పేస్‌ ఆల్‌రౌండర్ ఉండటం వల్ల స్పిన్నర్లను అదనంగా తీసుకొనేందుకు వీలు కలుగుతుందని రోహిత్ వ్యాఖ్యానించాడు. ‘నాణ్యమైన పేస్‌, స్పీడ్‌తో హార్దిక్‌ బౌలింగ్‌ చేస్తాడు. దీంతో ముగ్గురు స్పిన్నర్లు, ముగ్గురు సీమర్లతో మ్యాచ్‌ ఆడేందుకు వీలుంది. ఇది జట్టుకు … Read more

    అనుకున్నదేదీ వెంటనే జరిగిపోదు: రోహిత్ శర్మ

    భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ ఓ ఆంగ్ల వెబ్‌సైట్ ఇంటర్య్వూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తనకు కెప్టెన్‌ అవకాశం 26 లేదా 27 ఏళ్ల వయసులో వచ్చి ఉంటే బాగుండేదన్నారు. ‘జీవితంలో అనుకున్నదేది వెంటనే జరిగిపోదు. జట్టులో చాలా మంది విన్నర్లుగా ఉన్నా వారి కెప్టెన్సీ అవకాశం అందలేదు. గతంలో గౌతమ్ గంభీర్, సెహ్వాగ్, యువరాజ్ సింగ్ లాంటి స్టార్లు ఆడారు. కానీ వారు ఎప్పుడూ కెప్టెన్సీ చేపట్టలేదు. ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది. అదెంతో ఆనందంగా ఉంది’ అని రోహిత్ చెప్పుకొచ్చాడు.