• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అతడి బౌలింగ్ కఠినమైనది: రోహిత్

    దక్షిణాఫ్రికాకు చెందిన డేల్‌ స్టెయిన్‌ బౌలింగ్‌ కఠినమైనదని రోహిత్ అన్నాడు. అతడి బౌలింగ్‌ సవాల్‌ విసురుతుందని తెలిపాడు. ‘నాకు ఏ బౌలరైనా సవాల్‌ విసిరాడంటే అది డేల్‌ స్టెయిన్‌ మాత్రమే. అతడి బౌలింగ్‌ నైపుణ్యాలు అద్భుతం. ]ఫాస్ట్‌ బౌలింగ్‌లో స్వింగ్‌ చేయగల సమర్థుడు. వేగంతో బంతిని విసిరి కూడా స్వింగ్‌ రాబట్టగల అతికొద్దీమంది బౌలర్లలో స్టెయిన్‌ ఉంటాడు. నిలకడగా అదే స్పీడ్‌తో బంతులను సంధిస్తాడు’’ అని రోహిత్ చెప్పుకొచ్చాడు.

    అదే మా లక్ష్యం: రాహుల్ ద్రవిడ్

    రిజర్వ్ బెంచ్ బలాన్ని పరీక్షించడమే తమ లక్ష్యమని కోచ్ రాహుల్ ద్రవిడ్ స్పష్టం చేశాడు. రెండో వన్డేలో టీమిండియా ఓడిపోవడం, సెలక్షన్‌పై విమర్శలు రావడంతో ద్రవిడ్ ఇలా స్పందించాడు. ‘రోహిత్, కోహ్లీలకు నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. ఆసియా కప్, వరల్డ్ కప్‌ ముందు ఇదే మాకు చివరి అవకాశం. అందుకే సిరీస్‌లో ఆటగాళ్లను పరీక్షిస్తున్నాం. సూర్యకు మరిన్ని అవకాశాలు ఇస్తాం. ఇషాన్ కిషన్ సద్వినియోగం చేసుకున్నాడు. ఇలాంటి ఆటనే మేం ఆశిస్తున్నాం’ అని ద్రవిడ్ వెల్లడించాడు. Head Coach Rahul Dravid explains #TeamIndia's … Read more

    బర్త్‌డే రోజు ఇషాన్‌ను ఆటపట్టించిన రోహిత్

    టీమిండియా క్రికెటర్ ఇషాన్‌ కిషన్‌ బర్త్ డే సందర్బంగా BCCI ట్విట్టర్‌లో ఓ వీడియోను షేర్ చేసింది. ప్రాక్టీస్‌ చేయడం నుంచి కేక్‌ కటింగ్‌ వరకు ఇషాన్ లైఫ్‌ను వీడియోలో చూపించింది. ఈ క్రమంలోనే ఇషాన్‌ను ఆటపట్టిస్తూ తనకు ఏం గిఫ్ట్‌ ఇస్తున్నావని రోహిత్ అడిగాడు. ఇషాన్‌ ఏం సమాధానం ఇవ్వకుండా నవ్వాడు. మళ్లీ రోహితే విండీస్‌తో రెండో టెస్టులో సెంచరీ సాధించి భారత జట్టుకు బహుమతిగా ఇవ్వాలని కోరాడు. ఈ వీడియో క్రికెట్ అభిమానులను ఆకట్టుకుంటుంది. A day in the life … Read more

    రిపోర్టర్‌గా మారిన రోహిత్ శర్మ

    టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రిపోర్టర్‌గా మారారు. వైస్ కెప్టెన్ అజింక్య రహానెని పలు ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టాడు. ‘వెస్టిండీస్‌లో ఆడిన అనుభవం ఉన్న ప్లేయర్‌గా నువ్వు యంగ్ ప్లేయర్లకు ఎలాంటి సలహాలు ఇస్తావు’ అని రోహిత్ అడిగాడు. ‘ఒక్కటే చెప్పేది.. కుర్రాళ్లకు ఓపిక తప్పనిసరి. క్రీజులో ఉన్నప్పుడు సహనంతో ఉండాలి’ అని అజింక్య చెప్పాడు. రేపటి నుంచి వెస్టిండీస్‌తో టెస్టు ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ఆటగాళ్లు ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్నారు. ?? ??? ????! When #TeamIndia Captain @ImRo45 … Read more

    ధావన్ చెప్పాడు కాబట్టి బౌలింగ్: రోహిత్

    పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో టాస్ సందర్భంగా ఆసక్తికర దృశ్యం చోటు చేసుకుంది. టాస్ గెలిచిన రోహిత్ శర్మ.. ఏ నిర్ణయం తీసుకోవాలని శిఖర్ ధావన్‌ని అడిగాడు. దీంతో ‘మీరు బౌలింగ్ చేయండి’ అని శిఖర్ రోహిత్‌తో చెప్పాడు. ఇదే విషయాన్ని టాస్ రిప్రసెంటేటివ్ అంజుమ్ చోప్రాతో చెబుతూ తాము బౌలింగ్ చేయదల్చుకున్నట్లు రోహిత్ శర్మ నవ్వుతూ వెల్లడించాడు. టాస్ ఓడిన శిఖర్ ధావన్ మాట్లాడుతూ.. తాము కూడా ముందుగా బౌలింగ్ చేయాలని అనుకున్నట్లు చెప్పాడు. దీంతో ఈ ఇద్దరి బ్యాటర్ల మధ్య అనుబంధాన్ని హైలైట్ … Read more

    ప్రధానుల చేతుల మీదుగా కెప్టెన్లకు క్యాప్

    [VIDEO:](url) భారత్, ఆస్ట్రేలియా మధ్య నాలుగో టెస్టు సందర్భంగా అరుదైన దృశ్యం చోటు చేసుకుంది. ఇరు జట్ల కెప్టెన్లు తమ దేశ ప్రధాని చేతుల మీదుగా క్యాప్(టోపీ)లను అందుకున్నారు. ఆసీస్ ప్రధాని ఆంటోనీ అల్బనీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌కు క్యాప్‌ని అందజేయగా, భారత ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా క్యాప్‌ని రోహిత్ శర్మ అందుకున్నాడు. అనంతరం నలుగురు కలిసి చేతులు జోడించి పైకెత్తారు. ఇండోఆస్ట్రేలియన్ బంధం ముడిపడి 75వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇరు దేశాల ప్రధానులు ఈ మ్యాచ్‌కు అతిథులుగా హాజరయ్యారు. … Read more

    వికెట్ త్యాగం చేసిన రోహిత్ శర్మ

    [VIDEO:](url)టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై నెట్టింట ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో రోహిత్ తన వికెట్‌ని త్యాగం చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో రోహిత్ శర్మ రనౌట్‌గా వెనుదిరిగిన విషయం తెలిసిందే. ఇన్నింగ్స్ 7వ ఓవర్‌లో డీప్ స్క్వేర్ లెగ్ దిశగా బాదాడు. బంతి గ్యాప్‌లో పడటంతో తొలి రన్ వేగంగా తీశారు. ఆలోపే ఫీల్డర్ బంతిని చేరుకోవడంతో సెకండ్ రన్ వద్దని రోహిత్ కాల్ ఇచ్చాడు. అయితే, పుజారా అలాగే నాన్‌స్ట్రైక్ దిశగా పరుగెత్తడంతో రోహిత్ తన వికెట్‌ని సమర్పించుకోవాల్సి వచ్చింది. … Read more

    కోహ్లీని కెప్టెన్సీ నుంచి కావలనే తీసేశాం: చేతన్ శర్మ

    [VIDEO:](url)కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తొలగించడంపై చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇష్టపూర్వకంగా రోహిత్‌ని కెప్టెన్ చేయలేదని, విరాట్‌ని తీసేయాలనే ఉద్దేశంతోనే కెప్టెన్సీలో మార్పు చేసినట్లు వెల్లడించాడు. ‘అప్పుడు కోహ్లీ ఫామ్‌లో లేడు. ఇదే అదనుగా భావించి విరాట్‌ని ఎలాగైనా తీసేయాలని అనుకున్నాం. ఈ క్రమంలో కెప్టెన్‌గా రోహిత్‌ని ప్రమోట్ చేశాం. అంతే గాని రోహిత్‌పై మక్కువతో కాదు’ అని వ్యాఖ్యానించారు. ఈ స్టింగ్ ఆపరేషన్‌పై మరిన్ని కథనాల కోసం YouSay ఫాలో అవ్వండి. We Stand With Chetan … Read more

    నా మొహం కాదు.. రీప్లే చూపించు: రోహిత్

    డీఆర్ఎస్ కోరిన తర్వాత రీప్లే చూపించకుండా తమను కవర్ చేయడంపై కెప్టెన్ రోహిత్ శర్మ అసహనానికి గురయ్యాడు. ఆసీస్‌తో టెస్టు సందర్భంగా ఈ ఘటన జరిగింది. ఆసీస్ బ్యాటర్ పీటర్ హ్యాండ్‌స్కాంబ్ ఎల్‌బీడబ్ల్యూపై రోహిత్ సమీక్ష కోరాడు. అయితే, స్క్రీన్‌పై రీప్లే కాకుండా, తన మొఖాన్ని చూపించడంపై రోహిత్ స్పందిస్తూ.. ‘నా మొహం కాదు భయ్యా.. రీప్లే చూపించు’ అంటూ వ్యాఖ్యలు చేశాడు. దీంతో పక్కనున్న సూర్య, అశ్విన్ నవ్వుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాల్లో వైరల్ అవుతోంది. https://twitter.com/FabulasGuy/status/1624315250748325888?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1624315250748325888%7Ctwgr%5Ef8a923a3b2df68d7ceb8b5acdff8ab30aee6fed0%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fd-34020137012780128073.ampproject.net%2F2301261900000%2Fframe.html

    రోహిత్ భయ్యా.. ఇంత మతిమరుపా?

    భారత్ క్రికెట్ కెప్టెన్ రోహిత్ శర్మపై నెట్టింట్లో జోకులు పేలుతున్నాయి. న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో రోహిత్‌కు వింత అనుభవం ఎదురైంది. [టాస్](url) గెలిచాక.. ఏదీ తీసుకోవాలో గుర్తు లేక సతమతమయ్యాడు. కానీ ఇది కావాలని చేశాడా.. మరచిపోయి చేశాడా అనేది క్లారిటీ లేదు. ఇక దీనిపై నెటిజన్లు స్పందిస్తున్నారు. ‘రోహిత్ భయ్యా నీకు ఇంత మతిమరుపా’ అని కొందరు.. కావాలనే చేశాడని మరికొందరు నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. ? Toss Update ?#TeamIndia win the toss and elect to field … Read more