భారత్ క్రికెట్ కెప్టెన్ రోహిత్ శర్మపై నెట్టింట్లో జోకులు పేలుతున్నాయి. న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో రోహిత్‌కు వింత అనుభవం ఎదురైంది. [టాస్](url) గెలిచాక.. ఏదీ తీసుకోవాలో గుర్తు లేక సతమతమయ్యాడు. కానీ ఇది కావాలని చేశాడా.. మరచిపోయి చేశాడా అనేది క్లారిటీ లేదు. ఇక దీనిపై నెటిజన్లు స్పందిస్తున్నారు. ‘రోహిత్ భయ్యా నీకు ఇంత మతిమరుపా’ అని కొందరు.. కావాలనే చేశాడని మరికొందరు నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు.