• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ప్రకృతి కన్నెర్ర.. 2000 మంది మృతి

  సెంట్రల్ మొరాకోలో సంభవించిన భూకంపంలో ఇప్పటివరకూ 820 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 670 మందికిపైగా గాయపడ్డారు. భూకంపం కారణంగా మర్రాకెచ్ నగరం మరీ ఎక్కువగా నష్టపోయింది. దీంతో పాటు దేశ రాజధాని రాబత్‌లోనూ బలంగా ప్రకంపనలు నమోదు అయ్యాయి. భూ ప్రకంపనల కారణంగా ప్రజలు చూస్తుండగానే ఎత్తైన భవనాలు కుప్పకూలాయి. ఇళ్లు కూలిపోవడాన్ని చాలా మంది వారి ఫోన్లలో వీడియో తీశారు. ఈ క్రమంలో ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ? #BREAKING | #Morocco | #earthquake | #Marrakech … Read more

  భూమిని చీల్చుకొని వచ్చిన మెుసళ్లు

  భూమిని చీల్చుకొని వచ్చిన మెుసళ్ల వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. తొలుత ఒక మెుసలిని మాత్రమే గమనించిన స్థానికులు దాన్ని బయటకు లాగి బందించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో మరో మెుసలి ఒక్కసారిగా నేల నుంచి బయటకు దూసుకొచ్చింది. మింగేద్దామనే రీతిలో నోటిని అమాంతం తెరిచింది. ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందన్న దానిపై స్పష్టత లేదు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. హాలీవుడ్‌ సినిమా సీన్‌ చూసినట్లు ఉందని కామెంట్స్‌ చేస్తున్నారు. OMG what are they … Read more

  బైకర్స్‌ను అడ్రస్‌ అడిగిన ధోని

  మహేంద్ర సింగ్ ధోని తన స్నేహితుడితో కలిసి రాంచీ వెళ్తూ ఓ వ్యక్తిని అడ్రస్‌ అడిగాడు. అతడి ఫ్రెండ్ వాహనం నడుపుతుండగా మహీ ముందు సీట్లో కూర్చొని ఉన్నాడు. తాను వెళ్లాల్సిన మార్గం గురించి బైకర్స్‌ను అడిగి తెలుసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అడ్రస్‌ తెలుసుకున్న అనంతరం ధోని భైకర్స్‌కు సెల్ఫీ ఇచ్చాడు. ఆపై కరచాలనం చేసి అక్కడ్నుంచి వెళ్లిపోయాడు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ధోనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ధోని సింప్లిసిటీని మెచ్చుకుంటున్నారు. This man is so … Read more

  తమన్నా రిహార్సల్స్‌ వీడియో వైరల్‌

  రజనీకాంత్‌ ‘జైలర్’ సినిమా ఆడియో ఫంక్షన్‌ను చెన్నైలోని నెహ్రూ ఇండోర్‌ స్టేడియంలో నిర్వహించనున్నారు. అయితే ఈవెంట్‌లో హీరోయిన్‌ తమన్నా ప్రధాన ఆకర్షణగా నిలవనున్నట్లు తెలుస్తోంది. ఆమె ప్రత్యేకంగా ‘నువ్ కావాలయ్యా’ పాటకు డ్యాన్స్‌ కూడా చేయనున్నారు. ఈ పాట రిహార్సల్స్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. ఇందులో తమన్నా డ్యాన్స్ ప్రాక్టిస్‌ చేస్తూ కనిపించింది. కాగా, ఆగస్టు 10న జైలర్ సినిమా రిలీజ్ కానుంది. #TamannaahBhatia rehearsal is in full swing ??for #JailerAudioLaunch #Jailer #Rajinikanth #Anirudh #NelsonDilipKumar … Read more

  సిక్స్‌ కొట్టి మరి ఔట్‌ అయ్యాడు

  కౌంటీ ఛాంపియన్‌షిప్‌ 2023 డివిజన్‌ వన్‌ పోటీల్లో ఆసక్తికర ఘటన జరిగింది. వార్విక్‌ షైర్‌పై జరిగిన మ్యాచ్‌లో మిడిల్‌ సెక్స్‌ కెప్టెన్‌ టోబీ రోలాండ్‌ జోన్స్‌ అనూహ్యంగా వెనుదిరిగాడు. తాను ఎదుర్కొన్న 15వ బంతిని సిక్స్‌ కొట్టి ఆపై హిట్‌ వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. తొలుత బ్యాట్‌ వికెట్‌ తాకడాన్ని గమనించని అంపైర్‌ సిక్స్‌ సిగ్నల్‌ ఇచ్చాడు. కీపర్‌ అప్పీల్ చేయడంతో తిరిగి ఔట్‌గా ప్రకటించాడు. Toby Roland-Jones delivers the textbook ‘six’ and … Read more

  సమంత న్యూలుక్‌ అదుర్స్‌

  టాలీవుడ్‌ అగ్రకథానాయికల్లో ఒకరైన సమంత న్యూలుక్‍లోకి మారింది. షార్ట్ హెయిర్ కట్‍తో చాలా కొత్తగా కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియోను సామ్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. ఈ వీడియోలో సమంత నవ్వు హైలైట్‍ అని చెప్పొచ్చు. అందమైన నవ్వుతో సామ్ వీడియో మెరిసిపోయింది. సినిమాలకు బ్రేక్‌ ఇచ్చినా తాను సంతోషంగానే ఉన్నానన్న సందేశాన్ని ఈ వీడియో ద్వారా సమంత ఫ్యాన్స్‌కు అందించింది. మరోవైపు సమంత న్యూలుక్‌ చూసిన ఫ్యాన్స్‌ సూపర్ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. Driving us crazy with her charming … Read more

  డ్యాన్స్‌ చేసిన సోనియా.. వీడియో వైరల్‌

  కాంగ్రెస్‌ అగ్రనేత సోనియా గాంధీ మహిళా రైతులతో డ్యాన్స్ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. హరియాణాకు చెందిన కొందరు మహిళ రైతులు సోనియా నివాసానికి వచ్చారు. వారిని సాదరంగా ఆహ్వానించిన సోనియా, ప్రియాంక గాంధీ మహిళతో కలిసి భోజనం చేశారు. అనంతరం వారితో సరదాగా ముచ్చటించారు. మహిళా రైతులు సోనియాను నృత్యం చేయాలని కోరగా.. అందుకు ఆమె అంగీకరించి వారితో కలిసి కాలుకదిపారు. Women farmers from Haryana had expressed their desire to @RahulGandhi to see … Read more

  మైదానంలో తెల్లముఖం పెట్టిన ఇషాన్‌!

  వెస్టిండీస్‌తో తొలి టెస్టు మూడో రోజు ఆటలో భారత వికెట్‌ కీపర్ ఇషాన్‌ కిషన్‌ చేసిన పని నెట్టింట వైరల్‌గా మారింది. జడేజా వేసిన 31ఓవర్‌ ఆఖరి బంతిని ఆడే క్రమంలో వెస్టిండీస్‌ బ్యాటర్‌ హోల్డర్‌ మిస్‌ అయ్యాడు. బంతిని అందుకున్న ఇషాన్‌.. హోల్డర్‌ క్రీజు దాటే వరకూ ఎదురు చూశాడు. లైన్‌ దాటగానే బెయిల్స్‌ కొట్టి స్టంపౌట్‌కు అప్పీల్ చేశాడు. కానీ అంపైర్‌ ఓవర్‌ డెడ్ అయిందని ప్రకటించడంతో కిషన్‌ తెల్లముఖం వేశాడు. దీనిపై నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. వీడియోను ట్రెండ్‌ చేస్తున్నారు. … Read more

  డ్యాన్సర్‌గా మారిన విరాట్‌ కోహ్లీ

  టీమ్‌ఇండియా స్టార్‌ బ్యాటర్ విరాట్ కోహ్లీ డ్యాన్సర్‌ అవతారం ఎత్తాడు. విండీస్‌తో జరిగిన తొలి టెస్టు మూడో రోజు ఆట సందర్భంగా డ్యాన్సింగ్‌ మూమెంట్స్‌తో అభిమానులను అలరించాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ ‌అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. ‘విరాట్ భాయ్.. కొరియోగ్రాఫర్‌గా మారిపో’ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. ‘విరాట్‌ డ్యాన్స్‌ అదరహో’ అంటూ ఇంకొందరు పోస్టులు పెడుతున్నారు. కాగా తొలి టెస్టులో 76 పరుగులతో విరాట్‌ రాణించాడు. Kohli reminding us all that it's Friday night, … Read more

  ఉత్కంఠరేపిన విమానం ల్యాండింగ్

  హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ (HAL)కు చెందిన ఓ ఎయిర్‌క్రాఫ్ట్‌ రన్‌వేపై ప్రమాదకరంగా ల్యాండ్‌ అయ్యింది. ల్యాండింగ్‌ సమయంలో విమానం ముందు భాగం రన్‌వేను తాకి కొంతదూరం అలాగే ముందుకెళ్లింది. చివరకు విమానం సురక్షితంగా ల్యాండ్‌ కావడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. HAL ఎయిర్‌పోర్టు నుంచి బయల్దేరిన కొద్దిసేపటికే విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో విమానం తిరిగి HAL ఎయిర్‌పోర్ట్‌లోనే ల్యాండ్ అయ్యింది. Extremely well executed wheel in abnormal position landingAt Bangalore HAL airport, today … Read more