• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • వరదలో ప్రయాణికుల ఆర్తనాదాలు

    ఉత్తరాఖండ్‌లో నది దాటడానికి యత్నించి ఓ బస్సు వరదలో చిక్కుకుంది. దీంతో ప్రయాణికులు బస్సు కిటికీల్లోంచి బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అటు హిమాచల్‌ప్రదేశ్‌లోనూ భారీ వర్షాలు కురుస్తుండగా.. అక్కడి బియాస్‌ నదిలో పలు కార్లు కొట్టుకుపోయాయి. ఒక్కసారిగా నదీ ప్రవాహం పెరగడంతో కార్లలోని వారంతా అప్రమత్తై బయటకు వచ్చేశారు. దీంతో ప్రాణనష్టం తప్పింది. వీటికి సంబంధించిన వీడియోలు సైతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. Watch | Bus Tries To Cross River In … Read more

    బీచ్‌లో జో బైడెన్‌ సందడి

    అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ డెలావర్‌ బీచ్‌లో సరదాగా గడిపారు. 80 ఏళ్ల వయసున్న బైడెన్‌ భార్య జిల్‌ బైడెన్, మనవరాలు ఫిన్నెగన్‌తో కలిసి బీచ్‌లో కాసేపు సన్‌ బాత్‌ తీసుకున్నారు. కుటుంబంతో కలిసి బీచ్‌లో ఎంజాయ్‌ చేస్తూ పని ఒత్తిళ్ల నుంచి రిలాక్సయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అయిదు రోజుల యూరప్‌ పర్యటనకి వెళ్లడానికి ముందు బైడెన్‌ ఈ సన్‌ బాత్‌ చేశారు. The most powerful man in the world. After sending cluster bombs … Read more

    తానా సభలో కొట్టుకున్న తెలుగు తముళ్లు

    తానా సభలో తెలుగు తమ్ముళ్ల కొట్లాట వైరల్ అవుతోంది. రెండుగా చీలిన టీడీపీ ఎన్నారై సభ్యులు పిడిగుద్దులతో విరుచుకుపడ్డారు. సభలో జూ.ఎన్టీఆర్ పేరు ప్రస్తావించడంతో గొడవ మొదలైనట్లు తెలుస్తోంది. తెలుగుదేశం ఎన్నారై అధ్యక్షుడు కోమటి జయరాం సమక్షంలోనే ఈ కొట్లాట జరగడం గమనార్హం. ఈ ఘటనపై నిర్మాత బండ్ల గణేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘సిగ్గు లేదా మీకు జీవితంలో బుద్ధి రాదు మీ బతుకులు చెడ’ అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. తానా … Read more

    బన్నీని చూసేందుకు ఎగబడ్డ ఫ్యాన్స్

    బెంగళూరులోని ఓ హోటల్‌లో దిగిన అల్లు అర్జున్‌ను చూసేందుకు భారీ ఎత్తున ఫ్యాన్స్‌ వెళ్లారు. ఆయన్ని చూసి ఫొటోలు దిగేందుకు ఎగబడ్డారు. దీనికి సంబంధించిన పలు వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక సినిమాల విషయానికి వస్తే అల్లు అర్జున్‌ ప్రస్తుతం ‘పుష్ప-2’లో నటిస్తున్నారు. ‘పుష్ప ది రైజ్‌’కు సీక్వెల్‌గా ఇది సిద్ధమవుతోంది. సుకుమార్‌ దర్శకుడు. దీనితోపాటు ఆయన ఇటీవల మరో పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌ అనౌన్స్‌ చేశారు. Icon Star #AlluArjun in Bangalore ?#PushpaTheRule pic.twitter.com/M4cVvaQ38R — Bunny – … Read more

    ధోని మంచి మనసు.. వీడియో వైరల్

    భారత మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోని మరోమారు తన మంచి మనసును చాటుకున్నాడు. తన విల్లాలో పనిచేసే సెక్యూరిటీ గార్డుకు సాయం చేశాడు. గార్డు డ్యూటీకి వస్తుండగా ధోని అతడ్ని చూశాడు. విల్లా చాలా దూరం ఉండటంతో గార్డును బైక్‌ ఎక్కించుకొని గేటు వద్ద వదిలిపెట్టాడు. సెక్యూరిటీ గార్డును దించాక మహీ వారికి హలో కూడా చెప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు మహీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. Dhoni dropping his security in gate??❤️@MSDhoni #MSDhoni … Read more

    ఈ IPSకు సలాం చేయాల్సిందే..!

    [VIDEO](url): యూపీకి చెందిన యువ ఐపీఎస్‌ అధికారిణి అనుకృతి శర్మ ఓ వృద్ధురాలి ముఖంలో చిరునవ్వుకు కారణమయ్యారు. నూర్జహాన్‌(70) అనే వృద్ధురాలి ఇంటికి అనుకృతి దగ్గరుండి విద్యుత్‌ సదుపాయం అందించారు. ఆమె ఇంట్లో లైట్‌ వెలగగానే అటు అను ముఖంలో.. ఇటు బామ్మ ముఖంలో సంతోషం ఒక్కసారిగా వెల్లివిరిసింది. ఆ సంతోష కాంతుల్ని ట్విటర్‌ ద్వారా ఆమె పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. Swades moment of my life ?? Getting electricity connection to Noorjahan … Read more

    గుర్రం చేత గంజాయి తాగించాడు

    ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో ఇద్దరు వ్యక్తులు గుర్రానికి బలవంతంగా సిగరేట్‌ తాగించారు. ఆ సిగరెట్‌ గంజాయితో కూడి ఉన్నట్లు తెలుస్తోంది. కేదార్‌నాథ్‌ యాత్రకు వెళ్లే భక్తుల సామాగ్రిని మోసేందుకు ఈ గుర్రాన్ని వినియోగిస్తున్నారు. ఈ క్రమంలో దాని యజమాని గుర్రాన్ని పట్టుకొని బలవంతంగా పొగ తాగించేందుకు ప్రయత్నించాడు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. విషయం తెలుసుకున్న పోలీసులు యజమానిని అదుపులోకి తీసుకున్నారు. #Uttrakhand Some people are making a horse smoke weed forcefully at the trek of … Read more

    విధ్వంసం.. 5 బాల్స్‌లో 5 సిక్సులు

    [VIDEO](url): ఇంగ్లండ్‌లో జ‌రుగుతున్న టీ20 బ్లాస్ట్ టోర్నీలో స‌ర్రే జట్టు బ్యాట‌ర్ విల్ జాక్స్ దుమ్మురేపాడు. మిడిల్‌సెక్స్ బౌల‌ర్ లూక్ హోల్‌మాన్ బౌలింగ్‌లో వ‌రుస‌గా అయిదు సిక్స‌ర్లు కొట్టాడు. ఇన్నింగ్స్ 11వ ఓవ‌ర్‌లో ఏకంగా 31 పరుగులు రాబట్టాడు. అయితే ఆఖరి బంతిని సిక్స్‌గా మలచడంలో జాక్స్‌ విఫలమయ్యాడు. దీంతో ఆరు బంతుల్లో ఆరు సిక్స‌ర్లు కొట్టిన యువ‌రాజ్‌, గిబ్స్ రికార్డును అత‌ను తృటిలో మిస్స‌య్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. 5 consecutive sixes by Will Jacks in … Read more

    సినిమా బాలేదన్నందుకు చితక్కొట్టారు

    HYD: ఆదిపురుష్‌ సినిమా బాలేదన్న వ్యక్తిపై ప్రభాస్‌ ఫ్యాన్స్ దాడి చేశారు. ప్రసాద్ ఐమ్యాక్స్ వద్ద యూట్యూబ్‌ ఛానళ్లకు బాధితుడు రివ్యూ చెబుతున్న క్రమంలో ఈ ఘటన జరిగింది. ఆచార్యలో గ్రాఫిక్స్‌ మధ్య చిరంజీవిని ఎలా చూశామో ప్రభాస్‌ను కూడా ఈ మూవీలో అలాగే చూపించారని బాధితుడు అన్నాడు. హనుమంతుడు, బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌ తప్ప సినిమాలో మరేమి బాలేదన్నాడు. దీంతో తీవ్ర అగ్రహానికి లోనైనా ఫ్యాన్స్‌ అతడ్ని చితక్కొట్టారు. తప్పుడు రివ్యూ చెబుతున్నాడంటూ మండిపడ్డారు. ఆదిపురుష్ సినిమా బాలేదు అన్నందుకు కొట్టిన ప్రభాస్ ఫ్యాన్స్#Adipurush … Read more

    నెదర్లాండ్‌ వ్యక్తిపై స్థానికుడు దాడి

    కర్ణాటక: బెంగళూరులో అమానుష ఘటన జరిగింది. నెదర్లాండ్‌కు చెందిన ఓ వ్యక్తిపై స్థానికుడు దాడికి యత్నించాడు. ట్రావెల్ వ్లాగర్‌ పెడ్రో మోటా ఓ వీధిలో వీడియో తీస్తుండగా స్థానిక వ్యక్తి చెయ్యి పట్టుకొని గట్టిగా లాగాడు. అక్కడ నుంచి వెళ్లిపోవాలంటూ బెదిరించాడు. ఇందుకు సంబంధించిన [వీడియో ](url)నెట్టింట వైరల్ అవుతోంది. నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అతడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామి ఇచ్చారు. Karnataka: Bengaluru Police has arrested the accused Nawab Hayath Sharif under Section … Read more