• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ధోని స్కెచ్‌కు హార్దిక్‌ బలి!

    IPL: మైదానంలో ధోని వ్యూహాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బ్యాటర్ బలహీనతలకు తగ్గట్లు ధోని ఫీల్డ్‌ సెట్‌ చేస్తుంటాడు. ఈ ఎత్తుగడతోనే నిన్నటి మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ కెప్టెన్ హార్దిక్‌ పాండ్యను ధోని ఔట్‌ చేయించాడు. ఫోర్‌ కొట్టి ఊపుమీదున్న హార్దిక్‌కు చెక్‌ పెట్టేందుకు జడేజాను కుడివైపునకు రప్పించి ఫీల్డింగ్‌లో మార్పు చేశాడు. వ్యూహాంలో భాగంగా బౌలర్‌ తర్వాత బంతిని ఆఫ్‌ సైడ్‌ వేయగా హార్దిక్‌ బంతిని జడేజాకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ? … Read more

    పరాయి స్త్రీతో భర్త డ్యాన్స్‌.. భార్య ఏం చేసిందంటే?

    సోషల్ మీడియాలో ఓ [వీడియో ](url)తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి పబ్‌లో మందు కొట్టి ఎంజాయ్ చేస్తుంటాడు. తర్వాత అక్కడే ఉన్న పరాయి మహిళతో ఎంతో సంతోషంగా డాన్స్ చేస్తుంటాడు. ఈ క్రమంలో సడెన్‌ ఎంట్రీ ఇచ్చిన అతడి భార్య నేరుగా వెళ్లి వాళ్లిద్దరి మధ్యలో నిలబడుతుంది. భర్త వైపు కోపంగా చూస్తూ కాలికి ఉన్న చెప్పు తీసుకుంటుంది. ‘ఏదీ నా ముందు స్టెప్పులు వెయ్యి చూద్దాం’ అన్నట్లు కసురుకుంటుంది. దీంతో భర్త తప్పు చేసిన వాడిలా నిలబడిపోతాడు. ఈ వీడియోపై నెటిజన్లు … Read more

    గాండ్రించిన పులి.. వణికిపోయిన పర్యాటకులు

    [VIDEO](url): సఫారీ రైడ్‌కు వెళ్లిన కొందరు పర్యాటకుల పైకి ఓ పులి దూసుకొచ్చిది. దీంతో వారంతా భయంతో కేకలు వేశారు. ఉత్తరాఖండ్‌లోని జిమ్‌ కార్బెట్ జాతీయ పార్కులో ఈ ఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. సఫారీ వాహనంలో ప్రయాణిస్తున్న కొందరు పర్యాటకులు పొదల మధ్య ఉన్న పులిని చూశారు. దానిని ఫొటోలు, వీడియోల్లో బందిస్తుండగా అది ఒక్కసారిగా వాహనంపైకి దూకింది. సఫారీ డ్రైవర్‌ వాహనాన్ని ముందుకు పోనివ్వడంతో పులి వెనక్కి తగ్గింది. Striped monk gets irritated ? … Read more

    ఫోన్‌ చూస్తూ ట్రైన్‌ నడిపిన మహిళ.. అంతలోనే!

    [VIDEO](url): రష్యాలో ఓ మహిళా లోకో పైలెట్‌ నిర్లక్ష్యం రైలు ప్రమాదానికి దారితీసింది. మహిళా డ్రైవర్‌ రైలు నడుపుతూ ఫోన్‌తో కాలక్షేపం చేయసాగింది. ట్రాక్‌పై ఓ రైలు ఆగి ఉండటాన్ని ఆమె గమనించలేదు. దీంతో రైలు నేరుగా వెళ్లి ఆగి ఉన్న రైలును ఢీకొట్టింది. రైలు భారీ కుదుపునకు గురి కావడంతో ప్రయాణికులంతా ఒక్కసారిగా సీట్లలో నుంచి ఎగిరి పడ్డారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. రైలుకు సేఫ్టీ ఎక్విప్‌మెంట్ ఉండటంతో పాటు ప్రయాణికుల రద్దీ లేకపోవడంతో ప్రాణ నష్టం జరగలేదు. … Read more

    28 ఏళ్లకే 9 మందికి జన్మనిచ్చిన మహిళ!

    [VIDEO](url): అమెరికాలోని నెవాడా రాష్ట్రానికి చెందిన ఓ మహిళ 28 ఏళ్ల వయసుకే తొమ్మిది మందికి జన్మనిచ్చింది. కోరా డ్యూక్‌ అనే మహిళ 2001లో తన 17ఏళ్ల వయసులో పెళ్లి చేసుకుంది. 2012లో చివరిసారిగా బిడ్డకు జన్మనిచ్చింది. అప్పుడు కోరా వయసు 28 ఏళ్లు. ఇటీవల తన సంతానంతో కలిసి కోరా చేసిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. పిల్లలను వయసుల వారీగా నిల్చోబెట్టి, వారిని పరిచయం చేస్తూ తీసిన ఆ వీడియో నెటిజన్లను ఆకర్షించింది. 9 Kids at 28 … Read more

    ఆ నటిని పెళ్లి చేసుకోవాలని అనుకున్నా: సల్మాన్

    [VIDEO](url): బాలీవుడ్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌కు సంబంధించిన ఓ పాత ఇంటర్యూ వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. ఆ వీడియోలో తాను నటి జూహీ చావ్లాను పెళ్లిచేసుకోవాలని భావించానని సల్మాన్‌ తెలిపారు. ఇదే విషయం వాళ్ల నాన్నకు చెప్తే తను అంగీకరించలేదని పేర్కొన్నారు. ఎందుకని యాంకర్‌ ప్రశ్నించగా నేను వాళ్లకు సరిపోనని అనుకున్నారేమో అంటూ నవ్వుతూ బదులిచ్చాడు. తాజాగా సల్మాన్ అభిమాని ఒకరు ఈ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. దాంతో ఈ వీడియో వైరల్‌గా మారింది. Salman Khan proposed marriage … Read more

    లోకల్‌ ట్రైన్‌లో నార్వే టీమ్ డ్యాన్స్‌.. వీడియో వైరల్‌

    [VIDEO](url): నార్వే డ్యాన్స్ టీం ముంబై లోక‌ల్ ట్రైన్‌లో పెర్ఫామ్ చేసిన వీడియో సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల‌వుతోంది. ‘లేకే పెహ‌లా పెహ‌లా ప్యార్’ సాంగ్ రీవ్యాంప్ వెర్ష‌న్‌కు వారు క్రేజీ స్టెప్స్‌తో హోరెత్తించారు. ఈ వీడియోను నార్వే డ్యాన్స్ టీం త‌మ ఇన్‌స్టాగ్రాం ఖాతాలో పోస్ట్ చేసింది. ట్రైన్‌లో ప్ర‌యాణీకులంద‌రూ చూస్తుండ‌గా డ్యాన్స్ టీం హుషారైన మూమెంట్స్‌తో ఉర్రూతలూగించారు. ‘భార‌త్‌లోని లోకల్ ట్రైన్‌లో మా తొలి స్టెప్’ అంటూ నార్వే టీమ్‌ వీడియోకు క్యాప్ష‌న్ ఇచ్చింది. ఈ వీడియోపై నెటిజ‌న్లు ప్రశంస‌లు గుప్పించారు. … Read more

    అభిమానిపై షకీబ్‌ దాడి.. వీడియో వైరల్‌

    [VIDEO](url): బంగ్లాదేశ్‌ ఆల్‌రౌండర్‌ షకీబ్‌ అల్ హసన్‌ మరోమారు సహనం కోల్పోయి వార్తల్లో నిలిచాడు. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన షకీబ్‌ను అభిమానులు చుట్టుముట్టారు. ముందుకు కదలకుండా ఉక్కిరిబిక్కిరి చేశారు. దీంతో అసహనానికి గురైన షకీబ్‌ ఓ అభిమానిపై టోపీతో దాడి చేశాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆటలో దూకుడుగా ఉండే షకీబ్‌ వివాదాల్లోనూ అదే జోరు కొనసాగిస్తూ తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. Nah i love shakib al hasan sometimes you just gotta beat … Read more

    ఫీల్డింగ్‌ చేస్తూ చాక్లెట్ తిన్న కోహ్లీ.. వీడియో వైరల్!

    [VIDEO:](url) ఆస్ట్రేలియాతో నాల్గో టెస్టు సందర్భంగా మైదానంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకోంది. టీమ్‌ఇండియా స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ చాక్లెట్‌ తింటూ ఫీల్డింగ్ చేశాడు. ఆస్ట్రేలియా బ్యాటర్‌ లుబుషేన్‌ బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో స్లిప్‌లో ఉన్న కోహ్లీ ఎనర్జీ బార్‌ను తింటూ కనిపించాడు. ఈ క్రమంలో శ్రేయస్‌ అయ్యర్ తనకు కొంచెం ఇవ్వమని కోహ్లీని అడిగాడు. దీంతో కోహ్లీ తన పాకెట్‌లో ఉన్న చాక్లెట్‌ను తీసి అయ్యర్‌ వైపు విసిరేశాడు. ఈ రెండు వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. https://twitter.com/i/status/1633805338754400259

    చిన్నారి డ్యాన్స్‌కు నెటిజన్లు ఫిదా!

    [VIDEO](url): పెళ్లి వేడుకలో ఓ చిన్నారి చేసిన డ్యాన్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రొఫేషనల్స్‌కు ఏమాత్రం తీసుపోకుండా బాలిక వేసిన డ్యాన్స్‌ను చూసి నెటిజన్లు ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు. డ్యాన్స్ చేస్తున్న సమయంలో ఓ మహిళా అడ్డుగా వచ్చినప్పటికీ చిన్నారి పట్టించుకోలేదు. ఎంతో ఏకాగ్రతగా నృత్యంలోనే లీనమైంది. బాలిక నైపుణ్యాన్ని గుర్తించిన ఓ మహిళా కానుకగా నగదు ఇచ్చింది. https://www.instagram.com/reel/CnpLW8HDyAU/?utm_source=ig_web_copy_link