మ్యాచ్ అనంతరం పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ రోహిత్ శర్మపై ప్రశంసలు కురిపించాడు. రోహిత్ అద్భుతమైన రీతిలో బ్యాటింగ్ చేశాడని కొనియాడాడు. అతడిని నిలువరించడం కష్టంగా మరిందన్నాడు. ‘తొలుత మాకు శుభారంభమే లభించింది. రిజ్వాన్, నేనూ నార్మల్‌గానే ఆడాలనుకున్నాం. కానీ అకస్మాత్తుగా మా బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలిపోయింది. సరైన రీతిలో ఇన్నింగ్స్ ముగించలేకపోయాం’ అని బాబర్ చెప్పుకొచ్చాడు.
.